కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; యెదూతూనుది.*+ దావీదు శ్రావ్యగీతం.
దుష్టుడు నా దగ్గర ఉన్నంతసేపు
నా నోటికి చిక్కం పెట్టుకుంటాను”+ అని నేను అనుకున్నాను.
2 నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను;+
కనీసం మంచివాటి గురించి కూడా మాట్లాడలేదు,
కానీ నా వేదన చాలా తీవ్రంగా ఉంది.
3 నా గుండెలో మంట రగులుకుంది.
నేను ఆలోచించే* కొద్దీ ఆ మంట ఎక్కువౌతూ ఉంది.
అప్పుడు నేను ఇలా అన్నాను:
4 “యెహోవా, నా అంతం ఎప్పుడు వస్తుందో,
నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియజేయి;+
అప్పుడు, నా జీవితం ఎంత చిన్నదో* నేను తెలుసుకుంటాను.
ప్రతీ మనిషి క్షేమంగా ఉన్నట్టు కనిపించినా, అతను కేవలం ఊపిరి లాంటివాడే.+ (సెలా)
6 ప్రతీ మనిషి నీడలా తిరుగుతుంటాడు.
అనవసరంగా ప్రయాసపడతాడు.
అతను ఆస్తిని కూడబెట్టుకుంటాడు, దాన్ని ఎవరు అనుభవిస్తారో అతనికి తెలీదు.+
7 అలాంటప్పుడు, యెహోవా, నేను దేని కోసం ఆశపెట్టుకోవాలి?
నేను నీ మీదే ఆశపెట్టుకున్నాను.
8 నా అపరాధాలన్నిటి నుండి నన్ను కాపాడు.+
మూర్ఖుడు నన్ను అవమానించే పరిస్థితి రానివ్వకు.
10 నువ్వు పంపించిన తెగులును నా నుండి తీసేయి.
నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించిపోయాను.
11 మనిషి చేసిన తప్పునుబట్టి నువ్వు అతన్ని శిక్షించి సరిదిద్దుతావు;+
అతను ఎంతో ఇష్టపడేవాటిని చిమ్మెటలా నాశనం చేస్తావు.
నిజంగా ప్రతీ మనిషి కేవలం ఊపిరి లాంటివాడు.+ (సెలా)
12 యెహోవా, నా ప్రార్థన విను,
సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు.+
నా కన్నీళ్లు నిర్లక్ష్యం చేయకు.
13 నేను చనిపోయి కనుమరుగయ్యే లోపే
కోపంతో నిండిన నీ చూపును నా మీద నుండి తీసేయి,
అప్పుడు నేను సంతోషిస్తాను.”