కీర్తనలు
దావీదు శ్రావ్యగీతం.
29 బలవంతుల కుమారులారా, యెహోవాకు తగిన ఘనత ఆయనకు ఇవ్వండి;
యెహోవా మహిమను బట్టి, బలాన్ని బట్టి ఆయనకు తగిన ఘనత ఇవ్వండి.+
2 యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి.
పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి.*
3 యెహోవా స్వరం నీళ్ల మీద వినిపిస్తోంది;
మహిమగల దేవుడు ఉరుముతున్నాడు.+
యెహోవా అనేక జలాల మీద ఉన్నాడు.+
4 యెహోవా స్వరం శక్తివంతమైనది;+
యెహోవా స్వరం మహిమగలది.
5 యెహోవా స్వరం దేవదారు చెట్లను విరగ్గొడుతుంది;
అవును, యెహోవా లెబానోను దేవదారు చెట్లను+ ముక్కలుముక్కలు చేస్తాడు.
7 యెహోవా స్వరం అగ్నిజ్వాలలతో విరుచుకుపడుతుంది.+
8 యెహోవా స్వరం ఎడారిని* వణికిపోయేలా చేస్తుంది;+
యెహోవా కాదేషు ఎడారిని+ వణికిపోయేలా చేస్తాడు.
9 యెహోవా స్వరం జింకను ఈనేలా చేస్తుంది,
అడవిలోని చెట్లను మోడుగా చేస్తుంది.+
ఆయన ఆలయంలో ఉన్నవాళ్లందరూ, “దేవుణ్ణి మహిమపర్చండి” అంటారు.
11 యెహోవా తన ప్రజలకు బలాన్నిస్తాడు.+
యెహోవా తన ప్రజల్ని శాంతితో దీవిస్తాడు.+