కీర్తనలు
దావీదు కీర్తన. శ్రావ్యగీతం.
24 భూమి, దానిలో ఉన్న ప్రతీది,
లోకం, దాని నివాసులు యెహోవా సొంతం.+
2 ఎందుకంటే, ఆయనే సముద్రాల మీద దాన్ని స్థిరంగా నిలిపాడు,+
నదుల మీద దాన్ని స్థిరపర్చాడు.
3 యెహోవా పర్వతానికి ఎవరు ఎక్కగలరు?+
ఆయన పవిత్ర స్థలంలో ఎవరు నిలబడగలరు?
4 నా జీవం తోడని* అబద్ధ ప్రమాణం చేయకుండా,
మోసపూరితంగా ఒట్టు వేయకుండా,+
నిర్దోషమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం కలిగినవాళ్లే కదా.+
6 ఆయన్ని వెదికే తరం ఇదే,
యాకోబు దేవా, నీ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించేవాళ్లు వీళ్లే. (సెలా)
8 మహిమగల ఈ రాజు ఎవరు?
9 మహిమగల రాజు ప్రవేశించేలా
ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి;
ప్రాచీన గుమ్మాల్లారా, తెరుచుకోండి!
10 మహిమగల ఈ రాజు ఎవరు?
సైన్యాలకు అధిపతైన యెహోవా. ఆయనే మహిమగల ఈ రాజు.+ (సెలా)