కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం.
20 కష్టం వచ్చిన రోజున యెహోవా నీకు జవాబివ్వాలి.
యాకోబు దేవుని పేరు నిన్ను కాపాడాలి.+
3 నువ్వు అర్పించిన కానుకలన్నీ ఆయన గుర్తుంచుకోవాలి;
నీ దహనబలి కొవ్వును ఆయన స్వీకరించాలి. (సెలా)
యెహోవా నీ విన్నపాలన్నిటినీ అనుగ్రహించాలి.
6 యెహోవా తన అభిషిక్తుణ్ణి+ కాపాడతాడని ఇప్పుడు నాకు తెలుసు.
7 కొంతమంది రథాల మీద, మరికొంతమంది గుర్రాల మీద ఆధారపడతారు,+
మనం మాత్రం మన దేవుడైన యెహోవా పేరున మొరపెట్టుకుంటాం.+
8 వాళ్లు కుప్పకూలి పడిపోయారు,
కానీ మనం లేచి బలం పుంజుకున్నాం.+
9 యెహోవా, రాజును కాపాడు!+
సహాయం కోసం మేము మొరపెట్టే రోజున మాకు జవాబివ్వు.+