కీర్తనలు
యాత్ర కీర్తన. దావీదుది.
131 యెహోవా, నా హృదయానికి పొగరెక్కలేదు,
నా కళ్లు నెత్తికెక్కలేదు;+
గొప్పగొప్ప వాటి కోసం,
నా శక్తికి మించిన వాటి కోసం నేను పాకులాడలేదు.+
2 బదులుగా, పాలు మానేసిన బిడ్డ తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు
నా ప్రాణాన్ని* నేను సముదాయించి ఊరుకోబెట్టాను;+
పాలు మానేసిన పిల్లాడిలా నేను సంతృప్తిగా ఉన్నాను.
3 ఇప్పటినుండి సదాకాలం
ఇశ్రాయేలు యెహోవా కోసం ఎదురుచూడాలి.+