కీర్తనలు
యాత్ర కీర్తన.
123 పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవా,
నేను నీ వైపే తల ఎత్తి చూస్తున్నాను.+
2 దాసుల కళ్లు యజమాని చేతి వైపు చూసినట్టు,
దాసురాలి కళ్లు యజమానురాలి చేతి వైపు చూసినట్టు
మా దేవుడైన యెహోవా మా మీద దయ చూపించే వరకు
మా కళ్లు ఆయన వైపు చూస్తున్నాయి.+
3 యెహోవా, మా మీద దయ చూపించు, మా మీద దయ చూపించు,
ఎందుకంటే మేము పడాల్సినన్ని అవమానాలు పడ్డాం.+
4 నిశ్చింతగా ఉన్నవాళ్లు* మమ్మల్ని ఎంతో ఎగతాళి చేశారు,
అహంకారులు మమ్మల్ని చాలా నీచంగా చూశారు.