కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. శ్రావ్యగీతం.
109 నేను స్తుతించే దేవా,+ మౌనంగా ఉండిపోకు.
2 దుష్టులు, మోసగాళ్లు నాకు వ్యతిరేకంగా నోరు తెరుస్తున్నారు.
తమ నాలుకలతో నా గురించి అబద్ధాలాడుతున్నారు;+
3 ద్వేషపూరిత మాటలతో నన్ను చుట్టుముడుతున్నారు,
కారణం లేకుండా నా మీద దాడి చేస్తున్నారు.+
4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా నన్ను ఎదిరిస్తున్నారు;+
అయినా నేను ప్రార్థిస్తూనే ఉన్నాను.
6 అతని మీద ఒక చెడ్డవాడిని నియమించు;
అతని కుడిపక్కన ఎదిరించేవాడు* నిలబడాలి.
9 అతని పిల్లలు* తండ్రిలేనివాళ్లు అవ్వాలి,
అతని భార్య విధవరాలు అవ్వాలి.
10 అతని పిల్లలు* పాడుబడ్డ తమ ఇళ్లలో నుండి బయల్దేరి
ఆహారం కోసం బిచ్చమెత్తుకుంటూ తిరగాలి.
11 అప్పులవాళ్లు* అతనికి ఉన్నదంతా లాక్కోవాలి,
అపరిచితులు అతని ఆస్తిపాస్తుల్ని దోచుకోవాలి.
12 ఎవ్వరూ అతని మీద దయ* చూపించకూడదు,
తండ్రిలేని అతని పిల్లల మీద ఎవ్వరూ కరుణ చూపించకూడదు.
13 అతని వంశం అంతరించిపోవాలి;+
అతని వంశస్థుల పేరు ఒక్క తరంలోనే తుడిచిపెట్టుకుపోవాలి.
14 అతని పూర్వీకుల తప్పును యెహోవా గుర్తుచేసుకోవాలి,+
అతని తల్లి పాపం తుడిచేయబడకూడదు.
15 వాళ్లు చేసినదాన్ని యెహోవా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి;
వాళ్ల జ్ఞాపకాన్ని భూమ్మీద నుండి తుడిచేయాలి.+
17 శపించడమంటే అతనికి మహా ఇష్టం, అందుకే అతని మీదికి శాపం వచ్చింది;
అతనికి దీవించే మనసు లేదు, అందుకే అతను దీవెన పొందలేదు.
18 శాపాలు వస్త్రంలా అతన్ని కప్పేశాయి.
అవి నీళ్లలా అతని శరీరంలోకి,
నూనెలా అతని ఎముకల్లోకి పోయబడ్డాయి.
19 అవి అతను చుట్టుకునే బట్టల్లా,
అతను ఎప్పుడూ కట్టుకునే దట్టీలా ఉండాలి.+
20 నన్ను ఎదిరించేవాళ్లకు,
నా గురించి చెడుగా మాట్లాడేవాళ్లకు యెహోవా ఇచ్చే జీతం అదే.+
21 అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా,
నీ పేరు కోసం నా తరఫున చర్య తీసుకో.+
నన్ను రక్షించు, ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ మంచిది.+
23 నేను నీడలా మాయమైపోతున్నాను;
మిడతలా దులిపేయబడ్డాను.
24 ఉపవాసం వల్ల నా మోకాళ్లు బలహీనపడ్డాయి,
నా శరీరం చిక్కిపోయింది, నేను కృశించిపోతున్నాను.*
25 వాళ్లు నన్ను ఎగతాళి చేస్తున్నారు.+
నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు.+
26 యెహోవా, నా దేవా, నాకు సహాయం చేయి;
నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను రక్షించు.
27 ఇది నీ చేతి వల్లే జరిగిందని,
యెహోవా, నువ్వే ఇది చేశావని వాళ్లకు తెలియాలి.
28 వాళ్లను శపించనివ్వు, కానీ నువ్వు దీవించు.
వాళ్లు నా మీదికి లేచినప్పుడు వాళ్లు సిగ్గుపడాలి,
అయితే నీ సేవకుడు సంతోషించాలి.
30 నా నోరు ఉత్సాహంగా యెహోవాను స్తుతిస్తుంది;
చాలామంది ముందు నేను ఆయన్ని స్తుతిస్తాను.+
31 ఎందుకంటే ఆయన పేదవాడి కుడిపక్కన నిలబడి,
అతన్ని దోషిగా తీర్పుతీర్చేవాళ్ల నుండి అతన్ని కాపాడతాడు.