యోబు
30 “ఇప్పుడేమో నాకన్నా వయసులో చిన్నవాళ్లు నన్ను చూసి నవ్వుతున్నారు,+
నేను వాళ్ల తండ్రుల్ని నా మందను కాసే కుక్కల దగ్గరికి కూడా రానిచ్చేవాణ్ణి కాదు.
2 వాళ్ల చేతుల బలం వల్ల నాకేం లాభం?
వాళ్ల బలం నశించిపోయింది.
3 వాళ్లు పేదరికంతో, ఆకలితో క్షీణించిపోయారు;
అప్పటికే పాడైపోయి నిర్జనంగా ఉన్న స్థలంలో
ఇసుక నములుతున్నారు.
4 వాళ్లు పొదల్లో నుండి ఉప్పగా ఉండే ఆకుల్ని పీక్కొని తింటారు;
తంగేడు చెట్ల వేర్లే వాళ్లకు ఆహారం.
5 వాళ్లు సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడుతున్నారు;+
ప్రజలు దొంగను చూసి అరిచినట్టు వాళ్లను చూసి అరుస్తున్నారు.
6 వాళ్లు లోయల్లో,* నేల సందుల్లో, బండ సందుల్లో నివసిస్తారు.
7 వాళ్లు పొదల మధ్య నుండి కేకలు వేస్తారు,
ముళ్ల చెట్ల మధ్య పోగౌతారు.
8 బుద్ధిలేనివాళ్ల పిల్లల్లా, అనామకుల పిల్లల్లా
వాళ్లు దేశంలో నుండి తరిమేయబడ్డారు.
11 దేవుడు నా ఆయుధాల్ని తీసేసి* నన్ను నిస్సహాయ స్థితిలో ఉంచాడు,
కాబట్టి నాతో వాళ్లు అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నారు.*
12 నా కుడివైపు వాళ్లు అల్లరిమూకలా లేస్తున్నారు;
నన్ను పారిపోయేలా చేసి
నా దారిలో నాశనకరమైన అడ్డంకులు పెడుతున్నారు.
14 గోడలోని పెద్ద పగులు గుండా వచ్చినట్టు వాళ్లు వస్తున్నారు;
వినాశనం మధ్య కూడా నా మీదికి దూసుకొస్తున్నారు.
15 భయం నన్ను ముంచెత్తుతోంది;
నా ఘనత గాలిలా కొట్టుకుపోతోంది,
నా రక్షణ మబ్బులా మాయమైపోతోంది.
18 నా వస్త్రం గొప్పశక్తితో మెలితిప్పబడింది;*
అది మెడపట్టీలా నాకు ఊపిరాడకుండా చేస్తోంది.
19 దేవుడు నన్ను బురద గుంటలోకి తోసేశాడు;
నేను ధూళిలా, బూడిదలా అయిపోయాను.
20 నేను సహాయం కోసం నీకు మొరపెడుతున్నాను, కానీ నువ్వు జవాబివ్వట్లేదు;+
నేను నిల్చున్నాను, కానీ నువ్వు కేవలం చూస్తూ ఉన్నావు.
21 నువ్వు మారిపోయి, నాతో క్రూరంగా ప్రవర్తిస్తున్నావు;+
నీ చేతి బలమంతా ఉపయోగించి నా మీద దాడిచేస్తున్నావు.
22 నువ్వు నన్ను పైకి లేపి, గాలికి కొట్టుకుపోయేలా చేస్తున్నావు;
తర్వాత తుఫానుతో నన్ను అల్లాడిపోయేలా* చేస్తున్నావు.
23 నువ్వు నన్ను మరణానికి అప్పగిస్తావని,
సజీవులందరూ కలుసుకునే ఇంటికి తీసుకెళ్తావని నాకు తెలుసు.
24 అయితే విపత్తు సమయంలో సహాయం కోసం మొరపెట్టే నిస్సహాయుణ్ణి
ఎవ్వరూ పూర్తిగా నాశనం చేయరు.+
25 కష్టాల్లో ఉన్నవాళ్ల కోసం నేను ఏడ్వలేదా?
పేదవాళ్ల కోసం దుఃఖపడలేదా?+
26 నేను మంచిని ఆశిస్తే చెడు జరిగింది;
వెలుగు కోసం ఎదురుచూస్తే చీకటి వచ్చింది.
27 నాలో అలజడి తగ్గలేదు;
కష్టాలతో నిండిన రోజులు నాకు ఎదురయ్యాయి.
28 నేను చీకట్లో నడుస్తున్నాను;+ సూర్యుని వెలుగు లేదు.
నేను సమాజంలో లేచి, సహాయం కోసం మొరపెడుతున్నాను.
29 నేను నక్కలకు సహోదరుణ్ణి అయ్యాను,
నిప్పుకోళ్లకు సహచరుణ్ణి అయ్యాను.+