యోబు
18 అప్పుడు షూహీయుడైన బిల్దదు+ ఇలా అన్నాడు:
2 “మీరు ఎంతసేపు ఇలా మాట్లాడుతుంటారు?
కాస్త అవగాహన చూపించండి, అప్పుడు మేం మాట్లాడగలుగుతాం.
4 నువ్వు కోపంతో నిన్ను నువ్వు ముక్కలుముక్కలుగా చీల్చేసుకున్నా,
నీకోసం భూమి విడిచిపెట్టబడుతుందా?
బండరాయి దాని స్థానం నుండి పక్కకు జరుగుతుందా?
5 అవును, దుష్టుడి దీపం ఆరిపోతుంది,
అతని నిప్పు మండదు.+
6 అతని డేరాలోని వెలుగు చీకటైపోతుంది,
అతని దీపం ఆరిపోతుంది.
7 బలమైన అతని అడుగులు చిన్నవౌతాయి,
అతని సలహానే అతన్ని పడిపోయేలా చేస్తుంది.+
8 ఎందుకంటే, అతని పాదాలు అతన్ని వలలోకి నడిపిస్తాయి,
అతను దానిలో చిక్కుకుపోతాడు.
9 అతని మడిమె బోనులో ఇరుక్కుపోతుంది,
అతనికి ఉచ్చు బిగుసుకుంటుంది.+
10 అతని కోసం నేలమీద చాటుగా ఉరి ఉంచబడుతుంది,
అతని దారిలో వల ఉంటుంది.
11 భయాలు అన్నివైపులా అతన్ని చుట్టుముడతాయి,+
అడుగడుగునా అతన్ని వెంటాడతాయి.
12 అతని బలం క్షీణిస్తుంది,
విపత్తు+ వల్ల అతను కుంటుతాడు.
13 అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి* అతని చర్మాన్ని, కాళ్లను, చేతుల్ని తినేస్తుంది.
14 సురక్షితంగా ఉన్న తన డేరాలో నుండి అతను పెరికేయబడతాడు,+
ఘోరమైన మరణం దగ్గరికి తీసుకెళ్లబడతాడు.
15 అతని డేరాలో పరాయివాళ్లు నివసిస్తారు;
అతని ఇంటిమీద గంధకం చల్లుతారు.+
16 కింద అతని వేర్లు ఎండిపోతాయి,
పైన అతని కొమ్మలు వాడిపోతాయి.
17 అతని జ్ఞాపకం భూమ్మీద నుండి తుడిచిపెట్టుకుపోతుంది,
వీధిలో అతని పేరు ఎవరికీ తెలీదు.*
18 అతను వెలుగులో నుండి చీకట్లోకి గెంటేయబడతాడు,
ఫలవంతమైన నేల నుండి తరిమేయబడతాడు.
19 తన ప్రజల మధ్య అతనికి సంతానం గానీ, వంశం గానీ ఉండదు,
అతను నివసిస్తున్న* చోట అతని వాళ్లెవరూ మిగలరు.
20 అతని రోజు వచ్చినప్పుడు, పడమటి వైపున్న ప్రజలు ఆశ్చర్యపోతారు,
తూర్పు వైపున్న ప్రజలు భయభ్రాంతులకు గురౌతారు.
21 తప్పుచేసేవాడి డేరాలకు,
దేవుణ్ణి తెలుసుకోనివాడి స్థలానికి ఇలా జరుగుతుంది.”