కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎస్తేరు 5
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎస్తేరు విషయసూచిక

      • ఎస్తేరు రాజు ముందుకు రావడం (1-8)

      • హామాను కోపం, అహంకారం (9-14)

ఎస్తేరు 5:1

అధస్సూచీలు

  • *

    లేదా “రాజభవనానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 4:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 144-145, 156

ఎస్తేరు 5:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 4:11; 8:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 156

ఎస్తేరు 5:3

అధస్సూచీలు

  • *

    లేదా “సగం వరకు.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 156

ఎస్తేరు 5:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 3:1, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 157

ఎస్తేరు 5:6

అధస్సూచీలు

  • *

    లేదా “సగం వరకు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 7:2

ఎస్తేరు 5:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీలు 157-158

ఎస్తేరు 5:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 3:2-5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 159

ఎస్తేరు 5:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 5:14; 6:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/1993, పేజీ 20

ఎస్తేరు 5:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 9:7-10
  • +ఎస్తే 3:1

ఎస్తేరు 5:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 5:5
  • +ఎస్తే 5:8

ఎస్తేరు 5:14

అధస్సూచీలు

  • *

    దాదాపు 22.3 మీటర్లు (73 అడుగులు). అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఎస్తే 6:4; 7:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    విశ్వాసం, పేజీ 160

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఎస్తే. 5:1ఎస్తే 4:16
ఎస్తే. 5:2ఎస్తే 4:11; 8:4
ఎస్తే. 5:4ఎస్తే 3:1, 10
ఎస్తే. 5:6ఎస్తే 7:2
ఎస్తే. 5:9ఎస్తే 3:2-5
ఎస్తే. 5:10ఎస్తే 5:14; 6:13
ఎస్తే. 5:11ఎస్తే 9:7-10
ఎస్తే. 5:11ఎస్తే 3:1
ఎస్తే. 5:12ఎస్తే 5:5
ఎస్తే. 5:12ఎస్తే 5:8
ఎస్తే. 5:14ఎస్తే 6:4; 7:9
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఎస్తేరు 5:1-14

ఎస్తేరు

5 మూడో రోజు+ ఎస్తేరు తన రాచవస్త్రాల్ని ధరించుకొని, రాజగృహ లోపలి ఆవరణలో రాజగృహానికి* ఎదురుగా నిలబడింది. అప్పుడు రాజు రాజగృహంలో ప్రవేశ ద్వారానికి ఎదురుగా తన రాజ సింహాసనం మీద కూర్చొనివున్నాడు. 2 ఆవరణలో ఎస్తేరు రాణి నిలబడివుండడం చూసిన వెంటనే రాజుకు ఆమె మీద దయ కలిగింది, అతను తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఎస్తేరు వైపుకు చాపాడు.+ ఎస్తేరు, దగ్గరికి వచ్చి ఆ దండం కొనను ముట్టుకుంది.

3 రాజు ఆమెతో, “ఎస్తేరు రాణీ, ఏంటి ఇలా వచ్చావు? నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం* అడిగినా సరే నీకిస్తాను!” అన్నాడు. 4 అందుకు ఎస్తేరు, “రాజుకు ఇష్టమైతే, రాజు కోసం ఈ రోజు నేను సిద్ధం చేసిన విందుకు రాజు, హామాను+ కలిసి రావాలి” అని అంది. 5 కాబట్టి రాజు, “ఎస్తేరు కోరినట్టే హామానును త్వరగా రమ్మనండి” అని తన మనుషులకు చెప్పాడు. అలా రాజు, హామాను కలిసి ఎస్తేరు సిద్ధం చేసిన విందుకు వెళ్లారు.

6 విందు చివర్లో, ద్రాక్షారసం తాగే సమయంలో రాజు ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకిస్తాను! నీ మనవి ఏంటి? నా రాజ్యంలో సగం* అడిగినా సరే నీకు ఇస్తాను!” అన్నాడు.+ 7 అప్పుడు ఎస్తేరు ఇలా అంది: “నా విన్నపం, నా మనవి ఏంటంటే: 8 రాజు దయ నామీద ఉంటే, నేను వేడుకున్నది ఇవ్వడం, అలాగే నా మనవి ప్రకారం చేయడం రాజుకు ఇష్టమైతే, రేపు నేను మీ కోసం సిద్ధం చేయబోయే విందుకు రాజు, హామాను కలిసి రావాలి; నాకు ఏం కావాలో రేపు నేను రాజుకు చెప్తాను.”

9 ఆ రోజు హామాను సంతోషంతో, హృదయానందంతో బయటికి వచ్చాడు. అతను రాజగృహ ద్వారం దగ్గర మొర్దెకైని చూశాడు. అయితే తాను రాగానే అతను లేచి నిలబడకపోవడం, తనకు భయపడకపోవడం గమనించినప్పుడు హామానుకు మొర్దెకై మీద విపరీతమైన కోపం వచ్చింది.+ 10 అయినా హామాను తన కోపాన్ని అణుచుకొని తన ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత అతను తన స్నేహితుల్ని, తన భార్య జెరెషును+ పిలిపించాడు. 11 హామాను తనకున్న గొప్ప సంపదల గురించి, తనకు చాలామంది కుమారులు+ ఉండడం గురించి, రాజు తనకు పదోన్నతిని ఇచ్చి అధిపతులకన్నా, రాజ సేవకులకన్నా తనను ఉన్నత స్థానంలో ఉంచడం+ గురించి గొప్పలు చెప్పుకున్నాడు.

12 హామాను ఇంకా ఇలా అన్నాడు: “అంతేకాదు, ఎస్తేరు రాణి తాను సిద్ధం చేసిన విందుకు రాజుతోపాటు నన్ను తప్ప ఇంకెవర్నీ ఆహ్వానించలేదు.+ రేపటి విందుకు కూడా రాజుతోపాటు రమ్మని ఆమె నన్ను ఆహ్వానించింది.+ 13 అయితే రాజగృహ ద్వారం దగ్గర యూదుడైన ఆ మొర్దెకై కనిపించినంత కాలం ఇవేవీ నన్ను సంతోషపెట్టలేవు.” 14 దాంతో అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు ఇలా అన్నారు: “50 మూరల* ఎత్తున్న కొయ్య ఒకటి నిలబెట్టించు. ఉదయం వెళ్లి, మొర్దెకైని ఆ కొయ్య మీద వేలాడదీయించమని+ రాజుతో చెప్పు. తర్వాత రాజుతో కలిసి వెళ్లి విందును ఆస్వాదించు.” హామానుకు ఆ సలహా నచ్చి ఒక కొయ్యను నిలబెట్టించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి