కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 సమూయేలు 4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

2 సమూయేలు విషయసూచిక

      • ఇష్బోషెతు హత్య (1-8)

      • ఆ హంతకుల్ని దావీదు చంపించడం (9-12)

2 సమూయేలు 4:1

అధస్సూచీలు

  • *

    అక్ష., “సౌలు కుమారుడు.”

  • *

    అక్ష., “అతని చేతులు బలహీనపడ్డాయి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 3:27
  • +2స 2:8

2 సమూయేలు 4:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:17; 18:21, 25

2 సమూయేలు 4:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 11:31, 33

2 సమూయేలు 4:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 20:16
  • +2స 9:3
  • +1స 29:1, 11
  • +2స 9:13; 1ది 8:34

2 సమూయేలు 4:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 4:2

2 సమూయేలు 4:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 2:10
  • +1స 18:10, 11; 20:1, 33
  • +1స 18:28, 29

2 సమూయేలు 4:9

అధస్సూచీలు

  • *

    లేదా “విడిపించిన.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 24:12; 26:25; 2స 12:7; కీర్త 34:7

2 సమూయేలు 4:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2స 1:2, 4
  • +2స 1:13-15

2 సమూయేలు 4:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 9:6; నిర్గ 21:12; సం 35:16, 30

2 సమూయేలు 4:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 55:23
  • +ద్వితీ 21:22

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

2 సమూ. 4:12స 3:27
2 సమూ. 4:12స 2:8
2 సమూ. 4:2యెహో 9:17; 18:21, 25
2 సమూ. 4:3నెహె 11:31, 33
2 సమూ. 4:41స 20:16
2 సమూ. 4:42స 9:3
2 సమూ. 4:41స 29:1, 11
2 సమూ. 4:42స 9:13; 1ది 8:34
2 సమూ. 4:62స 4:2
2 సమూ. 4:82స 2:10
2 సమూ. 4:81స 18:10, 11; 20:1, 33
2 సమూ. 4:81స 18:28, 29
2 సమూ. 4:91స 24:12; 26:25; 2స 12:7; కీర్త 34:7
2 సమూ. 4:102స 1:2, 4
2 సమూ. 4:102స 1:13-15
2 సమూ. 4:11ఆది 9:6; నిర్గ 21:12; సం 35:16, 30
2 సమూ. 4:12కీర్త 55:23
2 సమూ. 4:12ద్వితీ 21:22
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
2 సమూయేలు 4:1-12

సమూయేలు రెండో గ్రంథం

4 అబ్నేరు హెబ్రోనులో చనిపోయాడని+ సౌలు కుమారుడు ఇష్బోషెతు*+ విన్నప్పుడు, అతను ఎంతో భయపడ్డాడు,* ఇశ్రాయేలీయులు అందరూ ఎంతో ఆందోళనపడ్డారు. 2 సౌలు కుమారునికి చెందిన దోపిడీ ముఠాలకు ఇద్దరు నాయకులు ఉండేవాళ్లు: ఒకతని పేరు బయనా, ఇంకొకతని పేరు రేకాబు. వాళ్లు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. (బెయేరోతును+ కూడా బెన్యామీనులో ఒక భాగంగా పరిగణించేవాళ్లు. 3 బెయేరోతీయులు గిత్తయీముకు+ పారిపోయారు. వాళ్లు ఈ రోజు వరకు అక్కడ పరదేశులుగా నివసిస్తున్నారు.)

4 సౌలు కుమారుడైన యోనాతానుకు+ కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడు.+ సౌలు, యోనాతాను చనిపోయారనే వార్త యెజ్రెయేలు+ నుండి వచ్చినప్పుడు అతనికి ఐదేళ్లు. అప్పుడు అతని దాది అతన్ని ఎత్తుకొని పారిపోయింది. కానీ ఆమె అలా భయంతో పారిపోతున్నప్పుడు అతను కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతని పేరు మెఫీబోషెతు.+

5 బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు రేకాబు, బయనా బాగా ఎండకాస్తున్న సమయంలో ఇష్బోషెతు ఇంటికి వెళ్లారు. అతను మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకుంటున్నాడు. 6 వాళ్లు గోధుమలు తెస్తున్నట్టు నటిస్తూ ఇంట్లోకి వెళ్లి అతన్ని పొత్తికడుపులో కత్తితో పొడిచారు; తర్వాత రేకాబు, అతని సహోదరుడు బయనా+ అక్కడి నుండి పారిపోయారు. 7 వాళ్లు ఇష్బోషెతు ఇంట్లోకి వెళ్లినప్పుడు, అతను తన పడకగదిలో మంచంమీద పడుకొని ఉన్నాడు. వాళ్లు అతన్ని పొడిచి చంపారు. తర్వాత వాళ్లు అతని తల నరికారు. వాళ్లు అతని తలను తీసుకొని అరాబాకు వెళ్లే దారిలో రాత్రంతా నడిచారు. 8 వాళ్లు అతని+ తలను హెబ్రోనులో ఉన్న దావీదు రాజు దగ్గరికి తీసుకొచ్చి, “నీ ప్రాణం తీయాలని చూసిన+ నీ శత్రువైన సౌలు+ కుమారుడు ఇష్బోషెతు తల ఇదిగో. ఈ రోజు యెహోవా మా ప్రభువైన రాజు కోసం సౌలు మీద, అతని వంశస్థుల మీద పగతీర్చుకున్నాడు” అన్నారు.

9 అయితే, దావీదు బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులతో అంటే రేకాబుతో, అతని సహోదరుడైన బయనాతో ఇలా అన్నాడు: “కష్టాలన్నిట్లో నుండి నన్ను రక్షించిన* యెహోవా+ జీవం తోడు, 10 ఒకతను వచ్చి, ‘సౌలు చనిపోయాడు’+ అని నాకు చెప్పినప్పుడు, అతను నాకు మంచివార్త తెస్తున్నానని అనుకున్నాడు. కానీ నేను అతన్ని పట్టుకొని సిక్లగులో చంపాను.+ అదే ఆ సందేశకుడికి నేను ఇచ్చిన బహుమానం! 11 అలాంటిది దుష్టులు ఒక నీతిమంతుణ్ణి అతని ఇంట్లోనే అతని మంచం మీద చంపినందుకు నేను వాళ్లను ఇంకెంత ఎక్కువగా శిక్షించాలి! నేను అతని రక్తానికి మిమ్మల్ని బాధ్యులుగా చేసి+ మిమ్మల్ని భూమ్మీద లేకుండా చేయొద్దా?” 12 వాళ్లను చంపమని దావీదు తన యువకులకు ఆజ్ఞాపించాడు.+ ఆ యువకులు వాళ్ల చేతుల్ని, పాదాల్ని నరికి వాళ్ల శవాల్ని హెబ్రోనులోని కోనేరు దగ్గర వేలాడదీశారు,+ అయితే ఇష్బోషెతు తలను మాత్రం తీసుకెళ్లి హెబ్రోనులోని అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి