కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఆదికాండం విషయసూచిక

      • శారా మరణం, సమాధుల స్థలం (1-20)

ఆదికాండం 23:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:17

ఆదికాండం 23:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 12:5
  • +యెహో 14:15
  • +ఆది 35:27; సం 13:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (సార్వజనిక),

    No. 3 2016 పేజీ 4

    కావలికోట,

    6/1/1995, పేజీ 7

    తేజరిల్లు!,

    5/8/1994, పేజీ 22

ఆదికాండం 23:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 10:15

ఆదికాండం 23:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:1, 8; హెబ్రీ 11:9, 13

ఆదికాండం 23:6

అధస్సూచీలు

  • *

    లేదా “నువ్వు మా మధ్య గొప్ప ప్రధానుడివి” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 21:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2001, పేజీ 21

ఆదికాండం 23:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 1:13

ఆదికాండం 23:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:15
  • +ఆది 25:9, 10; 49:29-33; 50:13, 14

ఆదికాండం 23:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రూతు 4:1

ఆదికాండం 23:15

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

ఆదికాండం 23:16

అధస్సూచీలు

  • *

    అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 7:15, 16

ఆదికాండం 23:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 25:9, 10; 49:29-33; 50:13, 14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/1994, పేజీ 32

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ఆది. 23:1ఆది 17:17
ఆది. 23:2ఆది 12:5
ఆది. 23:2యెహో 14:15
ఆది. 23:2ఆది 35:27; సం 13:22
ఆది. 23:3ఆది 10:15
ఆది. 23:4ఆది 17:1, 8; హెబ్రీ 11:9, 13
ఆది. 23:6ఆది 21:22
ఆది. 23:71ది 1:13
ఆది. 23:9ఆది 23:15
ఆది. 23:9ఆది 25:9, 10; 49:29-33; 50:13, 14
ఆది. 23:10రూతు 4:1
ఆది. 23:16అపొ 7:15, 16
ఆది. 23:20ఆది 25:9, 10; 49:29-33; 50:13, 14
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం 23:1-20

ఆదికాండం

23 శారా 127 ఏళ్లు బ్రతికి చనిపోయింది.+ 2 ఆమె కనాను దేశంలోని+ కిర్యతర్బాలో+ అంటే హెబ్రోనులో+ చనిపోయింది. ఆమె చనిపోయినందుకు అబ్రాహాము చాలా దుఃఖించాడు, ఏడ్చాడు. 3 తర్వాత అబ్రాహాము తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి, హేతు+ కుమారులతో ఇలా అన్నాడు: 4 “నేను పరదేశిగా వచ్చి మీ మధ్య స్థిరపడ్డాను.+ నా భార్య మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసి పాతిపెట్టడానికి మీ ప్రాంతంలో నాకు కొంత స్థలాన్ని ఇవ్వండి.” 5 అప్పుడు హేతు కుమారులు అబ్రాహాముతో ఇలా అన్నారు: 6 “ప్రభూ, మా మాట విను. నువ్వు మా మధ్య దేవుడు ఎంచుకున్న ప్రధానుడివి.*+ మా సమాధుల స్థలాల్లో శ్రేష్ఠమైన దానిలో నువ్వు నీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టుకోవచ్చు. మాలో ఎవరి సమాధుల స్థలంలోనైనా నువ్వు నీ భార్యను పాతిపెట్టుకోవచ్చు, మేము ఎవ్వరం అడ్డుచెప్పం.”

7 దానికి అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు+ కుమారులకు వంగి నమస్కారం చేసి, 8 వాళ్లతో ఇలా అన్నాడు: “నా భార్య మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసి పాతిపెట్టడానికి మీరు ఒప్పుకుంటే, నా మాట విని సోహరు కుమారుడు ఎఫ్రోనును వేడుకొని, 9 అతని పొలం చివర ఉన్న మక్పేలా గుహను నాకు అమ్మమనండి; ఆ భూమి ఎంత వెండి పలికితే అంతకు మీ సమక్షంలో దాన్ని నాకు అమ్మమనండి.+ అప్పుడు నాకు కూడా ఒక సమాధుల స్థలం ఉంటుంది.”+

10 ఆ సమయంలో ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చొని ఉన్నాడు. కాబట్టి, హిత్తీయుడైన ఎఫ్రోను హేతు కుమారుల ముందు, ఆ నగర ద్వారం+ దగ్గరున్న వాళ్లందరి ముందు ఇలా అన్నాడు: 11 “లేదు ప్రభూ! నా మాట విను. నీకు ఆ పొలాన్ని, అందులోని గుహను ఇచ్చేస్తాను. నా ప్రజల సమక్షంలో దాన్ని నీకు ఇచ్చేస్తాను. నీ భార్యను పాతిపెట్టుకో.” 12 అప్పుడు అబ్రాహాము ఆ దేశ ప్రజల ముందు వంగి నమస్కారం చేసి, 13 వాళ్లు వింటుండగా ఎఫ్రోనుతో ఇలా అన్నాడు: “లేదు, దయచేసి నా మాట విను. నీ పొలం ఎంత వెండి పలికితే అంత నేను నీకు ఇస్తాను. ఆ వెండిని నా దగ్గర తీసుకో, అప్పుడే నా భార్యను అక్కడ పాతిపెట్టుకుంటాను.”

14 దానికి ఎఫ్రోను అబ్రాహాముతో ఇలా అన్నాడు: 15 “నా ప్రభూ! నా మాట విను. ఈ భూమి విలువ 400 షెకెల్‌ల* వెండి. కానీ మన మధ్య డబ్బుదేముంది? నీ భార్యను పాతిపెట్టుకో.” 16 అబ్రాహాము ఎఫ్రోను మాట విని, హేతు కుమారుల ముందు ఎఫ్రోను చెప్పినంత వెండిని, అంటే అప్పటి వర్తకుల ప్రమాణాల ప్రకారం 400 షెకెల్‌ల* వెండిని తూచి అతనికి ఇచ్చాడు.+ 17 అలా మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలాన్ని, అంటే ఆ పొలాన్ని, అందులోని గుహను, ఆ పొలం సరిహద్దుల లోపలున్న చెట్లన్నిటినీ అబ్రాహాము ఆస్తిగా ఖరారు చేశారు. 18 హేతు కుమారుల సమక్షంలో, ఆ నగర ద్వారం దగ్గరున్న వాళ్లందరి ముందు అబ్రాహాము దాన్ని కొన్నట్టు ఖరారు అయ్యింది. 19 ఆ తర్వాత అబ్రాహాము తన భార్య శారాను కనాను దేశంలో మమ్రే దగ్గర అంటే హెబ్రోను దగ్గర మక్పేలాలో ఉన్న పొలంలోని గుహలో పాతిపెట్టాడు. 20 అలా హేతు కుమారుల సమక్షంలో ఆ పొలం, అందులోని గుహ అబ్రాహాముకు చెందిన సమాధుల స్థలం అయ్యింది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి