కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 8
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

    • 8

      • విగ్రహాలకు అర్పించిన ఆహారం గురించి  (1-13)

        • మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు (5, 6)

1 కొరింథీయులు 8:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2018, పేజీలు 12-16

    కావలికోట (అధ్యయన),

    8/2017, పేజీ 29

    కావలికోట,

    1/1/2001, పేజీ 9

    2/15/1993, పేజీలు 21-22

1 కొరింథీయులు 8:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    9/2019, పేజీ 12

    కావలికోట (అధ్యయన),

    7/2018, పేజీ 8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 8:1-13

1 కొరింథీయులు

8 ఇప్పుడు, విగ్రహాలకు అర్పించిన ఆహారం గురించి రాస్తున్నాను. నిజమే, ఈ విషయంలో మనందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానం వల్ల గర్వం వస్తుంది, కానీ ప్రేమ బలపరుస్తుంది. 2  ఒక విషయం గురించి తనకు తెలుసని ఎవరైనా అనుకుంటే, నిజానికి అతనికి దాని గురించి ఇంకా పూర్తిగా తెలీదు. 3 అయితే ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆ వ్యక్తి దేవునికి తెలుసు.

4 విగ్రహాలకు అర్పించిన ఆహారం తినడం మాటకొస్తే విగ్రహాలు వట్టివేనని, ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. 5 పరలోకంలో గానీ, భూమ్మీద గానీ ప్రజలు దేవుళ్లని అనుకునేవి చాలానే ఉన్నాయి. అలాగే “దేవుళ్లు,” “ప్రభువులు” కూడా చాలామందే ఉన్నారు. 6 అయినా, మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి; ఆయన వల్లే అన్నీ ఉనికిలోకి వచ్చాయి, మనం ఉన్నది ఆయన కోసమే. అలాగే, ఒక్కడే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు; ఆయన్ని ఉపయోగించుకొనే దేవుడు అన్నిటినీ సృష్టించాడు, ఆయన ద్వారానే మనం ఉనికిలో ఉన్నాం.

7 అయితే, అందరికీ ఈ జ్ఞానం లేదు. కొందరు ఒకప్పుడు విగ్రహాల్ని పూజించేవాళ్లు కాబట్టి ఆహారం తినేటప్పుడు అది విగ్రహాలకు అర్పించిందన్నట్టుగా తింటారు. ఎందుకంటే వాళ్ల మనస్సాక్షి బలహీనంగా ఉంది, కలుషితమైంది. 8 ఆహారం మనల్ని దేవునికి దగ్గర చేయదు; మనం తినకపోతే నష్టమేమీ లేదు, తింటే ఒరిగేదేమీ లేదు. 9 అయితే, తినే ఆహారాన్ని ఎంచుకునే విషయంలో మీకున్న హక్కు బలహీనంగా ఉన్నవాళ్లకు అడ్డురాయిలా మారకుండా చూసుకుంటూ ఉండండి. 10 ఎందుకంటే, జ్ఞానం ఉన్న మీరు విగ్రహపూజ జరిగే ఆలయంలో భోజనం చేయడం బలహీనమైన మనస్సాక్షి ఉన్నవాళ్లు చూస్తే, వాళ్లు విగ్రహాలకు అర్పించింది తినేంత దూరం వెళ్లరా? 11 కాబట్టి మీ జ్ఞానం వల్ల, బలహీనంగా ఉన్న మీ సోదరుడు అంటే, క్రీస్తు ఎవరి కోసమైతే చనిపోయాడో ఆ సోదరుడు నాశనమౌతాడు. 12 ఈ విధంగా మీరు మీ సోదరుల విషయంలో పాపం చేసి వాళ్ల బలహీనమైన మనస్సాక్షిని గాయపరిస్తే, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్టే. 13 అందుకే, నేను తినే ఆహారం నా సోదరుణ్ణి ఇబ్బందిపెడితే, ఇంకెప్పుడూ నేను మాంసం తినను. అప్పుడే నా వల్ల నా సోదరునికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి