కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 కొరింథీయులు 12
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 కొరింథీయులు విషయసూచిక

    • 12

      • పవిత్రశక్తి ఇచ్చే వరాలు (1-11)

      • ఒక్క శరీరం, చాలా అవయవాలు (12-31)

1 కొరింథీయులు 12:2

అధస్సూచీలు

  • *

    అంటే, “అవిశ్వాసులుగా.”

1 కొరింథీయులు 12:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2007, పేజీ 21

1 కొరింథీయులు 12:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2011, పేజీలు 24-25

1 కొరింథీయులు 12:8

అధస్సూచీలు

  • *

    లేదా “తెలివిగల సందేశాన్ని ప్రకటించే.”

1 కొరింథీయులు 12:10

అధస్సూచీలు

  • *

    లేదా “శక్తివంతమైన కార్యాలు.”

1 కొరింథీయులు 12:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 110

1 కొరింథీయులు 12:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 22-24

1 కొరింథీయులు 12:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    8/2020, పేజీలు 22-24

1 కొరింథీయులు 12:21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/1996, పేజీ 20

1 కొరింథీయులు 12:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2014, పేజీ 24

    10/15/1997, పేజీలు 14-15

1 కొరింథీయులు 12:24

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/1999, పేజీ 20

1 కొరింథీయులు 12:25

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 19

    కావలికోట,

    6/15/2007, పేజీ 20

    5/15/2004, పేజీ 19

1 కొరింథీయులు 12:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 19

1 కొరింథీయులు 12:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/1995, పేజీ 11

1 కొరింథీయులు 12:28

అధస్సూచీలు

  • *

    లేదా “శక్తివంతమైన కార్యాలు.”

1 కొరింథీయులు 12:31

అధస్సూచీలు

  • *

    లేదా “ఉత్సాహంగా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/15/2009, పేజీలు 26-27

    2/15/1999, పేజీలు 22-23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
1 కొరింథీయులు 12:1-31

1 కొరింథీయులు

12 సోదరులారా, పవిత్రశక్తి ఇచ్చే వరాల గురించి మీరు తెలుసుకోవాలని నా కోరిక. 2 మీరు అన్యులుగా* ఉన్నప్పుడు పక్కదారి పట్టి మూగ విగ్రహాల్ని పూజిస్తూ ఉండేవాళ్లని మీకు తెలుసు. 3 మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను: దేవుని పవిత్రశక్తి ప్రేరణతో మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరూ “యేసు శపించబడిన వ్యక్తి” అని అనరు; అలాగే పవిత్రశక్తి ప్రేరణ ఉంటే తప్ప ఎవ్వరూ “యేసే ప్రభువు” అని అనలేరు.

4 వరాలు వివిధ రకాలు, కానీ పవిత్రశక్తి ఒక్కటే; 5 పరిచర్యలు వివిధ రకాలు, కానీ ప్రభువు ఒక్కడే; 6 కార్యకలాపాలు వివిధ రకాలు, కానీ అవన్నీ చేయడానికి ప్రతీ ఒక్కరికి సహాయం చేస్తున్న దేవుడు ఒక్కడే. 7 అయితే, ఇతరుల ప్రయోజనం కోసమే పవిత్రశక్తి ప్రతీ ఒక్కరి ద్వారా పనిచేస్తోందని స్పష్టమౌతుంది. 8 ఎందుకంటే పవిత్రశక్తి ఒకరికి తెలివితో మాట్లాడే* వరాన్ని ఇస్తోంది; అదే పవిత్రశక్తి మరొకరికి జ్ఞానంతో మాట్లాడే వరాన్ని ఇస్తోంది. 9 ఆ పవిత్రశక్తే ఒకరికి విశ్వాసాన్ని ఇస్తోంది; మరొకరికి రోగుల్ని బాగుచేసే వరాన్ని ఇస్తోంది; 10 అదే పవిత్రశక్తి ఒకరికి అద్భుతాలు* చేసే వరాన్ని, మరొకరికి ప్రవచించే వరాన్ని ఇస్తోంది; ఆ పవిత్రశక్తే ఒకరికి ప్రేరేపిత సందేశాన్ని గుర్తించే వరాన్ని, మరొకరికి వివిధ భాషల్లో మాట్లాడే వరాన్ని, ఇంకొకరికి భాషల్ని అనువదించే వరాన్ని ఇస్తోంది. 11 దాని ఇష్టప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో వరాన్ని ఇస్తూ ఆ పవిత్రశక్తే అవన్నీ చేస్తోంది.

12 శరీరం ఒక్కటే అయినా అవయవాలు చాలా ఉంటాయి; అవయవాలు చాలా ఉన్నా శరీరం ఒక్కటే. క్రీస్తు శరీరం కూడా అంతే. 13 యూదులమైనా గ్రీకువాళ్లమైనా, దాసులమైనా స్వతంత్రులమైనా అందరం ఒక్క శరీరంగా రూపొందడానికి ఒకే పవిత్రశక్తితో బాప్తిస్మం తీసుకున్నాం, అందరం అదే పవిత్రశక్తిని పొందాం.

14 నిజానికి, శరీరంలో ఒక్క అవయవమే ఉండదు, చాలా అవయవాలు ఉంటాయి. 15 పాదం, “నేను చెయ్యిని కాను కాబట్టి శరీరంలో భాగం కాదు” అని అన్నంతమాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 16 అలాగే చెవి, “నేను కన్ను కాదు కాబట్టి శరీరంలో భాగం కాదు” అని అన్నంతమాత్రాన అది శరీరంలో భాగం కాకుండా పోదు. 17 ఒకవేళ శరీరం మొత్తం కన్నే ఉంటే, దేనితో వింటాం? శరీరం మొత్తం చెవే ఉంటే, దేనితో వాసన చూస్తాం? 18 కానీ దేవుడు తనకు నచ్చినట్టు శరీరంలోని ప్రతీ అవయవాన్ని చక్కగా అమర్చాడు.

19 ఒకవేళ అన్ని అవయవాలు ఒకేలా ఉంటే, అది శరీరం అవుతుందా? 20 అవయవాలు చాలా ఉన్నాయి, కానీ శరీరం ఒక్కటే. 21 కన్ను చెయ్యితో, “నువ్వు నాకు అవసరం లేదు” అని అనలేదు. అలాగే తల పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 నిజానికి, శరీరంలో కాస్త బలహీనంగా ఉన్నట్టు కనిపించే అవయవాలు ముఖ్యమైనవి. 23 అంత ఘనమైనవి కావని మనకు అనిపించే అవయవాల్ని మనం ఎంతో ఘనంగా చూసుకుంటాం. అందుకే మనం అంత ఆకర్షణీయంకాని అవయవాలకు ఎక్కువ గౌరవం ఇస్తాం. 24 అదే ఆకర్షణీయమైన అవయవాలకైతే ఏమీ అవసరం లేదు. అయితే గౌరవం లేని వాటికి ఎక్కువ గౌరవం దక్కేలా దేవుడు శరీరాన్ని అమర్చాడు. 25 శరీరంలో చీలికలు ఉండకూడదని, అవయవాలు ఒకదాని మీద ఒకటి శ్రద్ధ చూపించుకోవాలని దేవుడు అలా అమర్చాడు. 26 ఒక అవయవం బాధపడితే, ఇతర అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి; ఒక అవయవం ఘనత పొందితే, మిగతా అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి.

27 మీరిప్పుడు క్రీస్తు శరీరంగా ఉన్నారు; మీలో ఒక్కొక్కరు ఒక్కో అవయవం. 28 సంఘంలో వేర్వేరు వ్యక్తుల్ని దేవుడు నియమించాడు. ముందు అపొస్తలుల్ని, తర్వాత ప్రవక్తల్ని, ఆ తర్వాత బోధకుల్ని, అలాగే అద్భుతాలు* చేసేవాళ్లను, రోగుల్ని బాగుచేసే వరం ఉన్నవాళ్లను, ఇతరులకు సేవలు అందించేవాళ్లను, నిర్దేశించే సామర్థ్యాలు ఉన్నవాళ్లను, వివిధ భాషలు మాట్లాడేవాళ్లను నియమించాడు. 29 అందరూ అపొస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? కాదు కదా. అందరూ అద్భుతాలు చేస్తున్నారా? లేదు కదా. 30 రోగుల్ని బాగుచేసే వరం అందరికీ ఉందా? అందరూ వివిధ భాషల్లో మాట్లాడుతున్నారా? లేదు కదా. అందరూ అనువాదకులా? కాదు కదా. 31 కానీ మీరు ఇంకా గొప్ప వరాల కోసం గట్టిగా* ప్రయత్నిస్తూ ఉండండి. అయితే, అన్నిటికన్నా గొప్ప మార్గాన్ని నేను మీకు చూపిస్తాను.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి