కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 5
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల విషయసూచిక

    • 5

      • అననీయ, సప్పీరా (1-11)

      • అపొస్తలులు ఎన్నో సూచనలు చేశారు (12-16)

      • చెరసాలలో వేయబడ్డారు, విడుదలయ్యారు (17-21ఎ)

      • మళ్లీ మహాసభ ముందుకు తీసుకొచ్చారు (21బి-32)

        • ‘దేవునికే లోబడాలి, మనుషులకు కాదు’ (29)

      • గమలీయేలు సలహా  (33-40)

      • ఇంటింటా ప్రకటించడం  (41, 42)

అపొస్తలుల కార్యాలు 5:1

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీలు 5-6

    6/15/2006, పేజీ 27

అపొస్తలుల కార్యాలు 5:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 35

    కావలికోట,

    10/15/2008, పేజీలు 5-6

    6/15/2006, పేజీ 27

    12/1/1990, పేజీ 28

అపొస్తలుల కార్యాలు 5:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1990, పేజీ 28

అపొస్తలుల కార్యాలు 5:9

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

అపొస్తలుల కార్యాలు 5:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 37-38

అపొస్తలుల కార్యాలు 5:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1990, పేజీ 28

అపొస్తలుల కార్యాలు 5:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1990, పేజీ 28

అపొస్తలుల కార్యాలు 5:16

అధస్సూచీలు

  • *

    పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.

అపొస్తలుల కార్యాలు 5:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 38

అపొస్తలుల కార్యాలు 5:19

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 38

అపొస్తలుల కార్యాలు 5:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 38

అపొస్తలుల కార్యాలు 5:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2020, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 5:26

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    3/2020, పేజీ 31

అపొస్తలుల కార్యాలు 5:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 36, 39

అపొస్తలుల కార్యాలు 5:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 37

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 21

అపొస్తలుల కార్యాలు 5:29

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 39

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 21

    కావలికోట,

    9/15/2006, పేజీలు 8-9

    12/15/2005, పేజీలు 19-20

    11/1/2002, పేజీలు 18-19

అపొస్తలుల కార్యాలు 5:30

అధస్సూచీలు

  • *

    లేదా “చెట్టుకు.”

అపొస్తలుల కార్యాలు 5:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1839

అపొస్తలుల కార్యాలు 5:32

అధస్సూచీలు

  • *

    అంటే, పరిపాలకునిగా తనకు లోబడే వాళ్లకు.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    రాజ్య పరిచర్య,

    3/2001, పేజీ 3

అపొస్తలుల కార్యాలు 5:34

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 40

    కావలికోట,

    5/15/2008, పేజీ 31

    9/15/2006, పేజీ 9

అపొస్తలుల కార్యాలు 5:38

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 40

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 21

అపొస్తలుల కార్యాలు 5:39

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 40

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 21

    కావలికోట,

    12/15/2005, పేజీలు 21-24

అపొస్తలుల కార్యాలు 5:41

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 40-41

    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, పేజీ 135

అపొస్తలుల కార్యాలు 5:42

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 41-42

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 18

    కావలికోట,

    2/1/1992, పేజీ 23

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 5:1-42

అపొస్తలుల కార్యాలు

5 అయితే అననీయ అనే ఒక వ్యక్తి, తన భార్య సప్పీరాతో కలిసి వాళ్ల ఆస్తిలో కొంత అమ్మాడు. 2 కానీ వచ్చిన దానిలో కొంత డబ్బును రహస్యంగా తన దగ్గరే పెట్టుకున్నాడు, ఈ విషయం అతని భార్యకు కూడా తెలుసు. అతను మిగతా డబ్బును తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. 3 అయితే పేతురు ఇలా అన్నాడు: “అననీయ, పవిత్రశక్తిని మోసం చేసేలా, పొలం డబ్బులో కొంత రహస్యంగా నీ దగ్గర పెట్టుకునేలా సాతాను నిన్ను ఎందుకు ప్రేరేపించాడు? 4 నువ్వు దాన్ని అమ్మకముందు ఆ భూమి నీదే కదా? దాన్ని అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ దగ్గరే ఉంది కదా? ఇలాంటి చెడ్డపని చేయాలని అసలు నీకెలా అనిపించింది? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధమాడావు.” 5 ఈ మాటలు వినగానే అననీయ కుప్పకూలి చనిపోయాడు. ఈ విషయం గురించి విన్న వాళ్లందరికీ చాలా భయమేసింది. 6 తర్వాత అక్కడున్న కొంతమంది యువకులు లేచి అతన్ని బట్టల్లో చుట్టి, మోసుకెళ్లి, పాతిపెట్టారు.

7 సుమారు మూడు గంటలు గడిచిన తర్వాత, జరిగింది తెలియక అతని భార్య అక్కడికి వచ్చింది. 8 పేతురు ఆమెను, “చెప్పు, మీరిద్దరు ఇంత మొత్తానికే పొలాన్ని అమ్మారా?” అని అడిగాడు. అందుకు ఆమె, “అవును, ఇంతకే అమ్మాం” అంది. 9 అప్పుడు పేతురు ఆమెతో ఇలా అన్నాడు: “యెహోవా* పవిత్రశక్తిని పరీక్షించాలని మీరిద్దరూ కలిసి ఎందుకు అనుకున్నారు? ఇదిగో! నీ భర్తను పాతిపెట్టినవాళ్లు తలుపు దగ్గరే ఉన్నారు, వాళ్లు నిన్ను కూడా మోసుకెళ్తారు.” 10 ఆ క్షణమే ఆమె పేతురు పాదాల దగ్గర కుప్పకూలి చనిపోయింది. ఆ యువకులు లోపలికి వచ్చినప్పుడు ఆమె చనిపోయి ఉండడం చూసి, ఆమెను బయటికి మోసుకెళ్లి, ఆమె భర్త పక్కనే ఆమెను పాతిపెట్టారు. 11 దాంతో సంఘమంతటికీ, ఈ విషయాల గురించి విన్నవాళ్లందరికీ చాలా భయమేసింది.

12 అంతేకాదు, అపొస్తలులు ప్రజల మధ్య ఎన్నో సూచనలు, అద్భుతాలు చేస్తూ వచ్చారు. వాళ్లంతా సొలొమోను మంటపంలో కలుసుకునేవాళ్లు. 13 వేరే ఎవ్వరికీ వాళ్లతో కలిసే ధైర్యం లేకపోయింది. అయినా, ప్రజలు వాళ్ల గురించి గొప్పగా మాట్లాడేవాళ్లు. 14 అంతేకాదు ఇంకా చాలామంది స్త్రీపురుషులు ప్రభువు మీద విశ్వాసముంచి శిష్యులయ్యారు. 15 చివరికి ప్రజలు రోగుల్ని ముఖ్య వీధుల్లోకి తీసుకొచ్చి చిన్న పరుపుల మీద, చాపల మీద పడుకోబెట్టారు; పేతురు అటువైపుగా వెళ్తున్నప్పుడు కనీసం అతని నీడైనా వాళ్లలో కొంతమంది మీద పడాలని అలా చేశారు. 16 పైగా, యెరూషలేము చుట్టుపక్కల నగరాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. వాళ్లు రోగుల్ని, అపవిత్ర దూతలు* పట్టినవాళ్లను మోసుకొని వచ్చారు. వాళ్లలో ప్రతీ ఒక్కరు బాగయ్యారు.

17 అయితే ఈర్ష్యతో నిండిపోయిన ప్రధానయాజకుడు, అతనితో ఉన్న వాళ్లందరూ అంటే సద్దూకయ్యుల తెగవాళ్లు కోపంతో లేచి 18 అపొస్తలుల్ని బంధించి చెరసాలలో వేశారు. 19 కానీ రాత్రిపూట యెహోవా* దూత ఆ చెరసాల తలుపులు తెరిచి, వాళ్లను బయటికి తీసుకొచ్చి, ఇలా చెప్పాడు: 20 “మీరు ఆలయానికి వెళ్లి, రాబోయే జీవితం గురించి ప్రజలతో మాట్లాడుతూ ఉండండి.” 21 ఆ మాటలు విన్నాక, వాళ్లు తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు.

ప్రధానయాజకుడు, అతనితో ఉన్నవాళ్లు వచ్చాక వాళ్లు మహాసభను, ఇశ్రాయేలీయుల పెద్దలందర్నీ సమావేశపర్చారు. అపొస్తలుల్ని తమ ముందుకు తీసుకురమ్మని అధికారుల్ని చెరసాలకు పంపించారు. 22 అయితే ఆ అధికారులు అక్కడికి వెళ్లినప్పుడు, వాళ్లకు చెరసాలలో అపొస్తలులు కనిపించలేదు. దాంతో వాళ్లు తిరిగొచ్చి ఆ విషయం గురించి చెప్పారు. 23 వాళ్లు ఇలా అన్నారు: “చెరసాల భద్రంగా తాళం వేసి ఉంది. భటులు తలుపుల దగ్గరే నిలబడి ఉన్నారు. కానీ దాన్ని తెరిచినప్పుడు లోపల ఎవరూ లేరు.” 24 ఆలయ పర్యవేక్షకుడు, ముఖ్య యాజకులు ఈ మాటలు విన్నప్పుడు, ఇది ఎక్కడికి దారితీస్తుందో అని కంగారుపడ్డారు. 25 అయితే ఒక వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చి, “ఇదిగో! మీరు చెరసాలలో వేసినవాళ్లు ఆలయంలో ఉన్నారు, వాళ్లు ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26 అప్పుడు ఆలయ పర్యవేక్షకుడు తన అధికారులతో పాటు వెళ్లి వాళ్లను తీసుకొచ్చాడు. కానీ వాళ్లమీద ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే ప్రజలు తమను రాళ్లతో కొట్టి చంపుతారేమో అని వాళ్లు భయపడ్డారు.

27 కాబట్టి వాళ్లు ఆ అపొస్తలుల్ని తీసుకొచ్చి మహాసభ ముందు నిలబెట్టారు. అప్పుడు ప్రధానయాజకుడు వాళ్లను ప్రశ్నిస్తూ 28 ఇలా అన్నాడు: “ఈ పేరు మీద ఇక బోధించవద్దని మేము మీకు గట్టిగా ఆజ్ఞాపించాం. అయినా సరే, మీరు మీ బోధతో యెరూషలేమును నింపేశారు. ఈ వ్యక్తి చావుకు మమ్మల్ని బాధ్యుల్ని చేయాలని మీరనుకుంటున్నారు.” 29 అప్పుడు పేతురు, మిగతా అపొస్తలులు ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు. 30 మీరు కొయ్యకు* వేలాడదీసి చంపిన యేసును మన పూర్వీకుల దేవుడు లేపాడు. 31 తన కుడి పక్కన కూర్చునేలా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ పొందేలా దేవుడు ఆయన్ని ముఖ్య ప్రతినిధిగా, రక్షకునిగా నియమించాడు. 32 ఈ విషయాలకు మేము సాక్షులం. తనకు లోబడేవాళ్లకు* దేవుడు ఇచ్చిన పవిత్రశక్తి కూడా వీటికి సాక్షిగా ఉంది.”

33 ఆ మాట విన్నప్పుడు వాళ్లకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో వాళ్లు అపొస్తలుల్ని చంపాలనుకున్నారు. 34 అయితే గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలబడ్డాడు. అతను ప్రజలందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడు. అతను, అపొస్తలుల్ని కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించాడు. 35 తర్వాత, అక్కడున్న వాళ్లతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వీళ్లకు విధించాలనుకుంటున్న శిక్ష విషయంలో జాగ్రత్తగా ఉండండి. 36 కొంతకాలం క్రితం, థూదా అనే వ్యక్తి తాను ఒక ప్రముఖుణ్ణని చెప్పుకున్నాడు. దాదాపు 400 మంది అతనితో చేరారు. అయితే అతను చంపబడ్డాడు. అప్పుడు అతని గుంపు చెల్లాచెదురైపోయింది, ఎక్కడా లేకుండా పోయింది. 37 ఆ తర్వాత, జనసంఖ్య తీసుకున్న రోజుల్లో గలిలయవాడైన యూదా బయల్దేరాడు. అతను ప్రజలు తనను అనుసరించేలా చేసుకున్నాడు. అతను కూడా లేకుండా పోయాడు, అతన్ని అనుసరించిన వాళ్లందరూ చెల్లాచెదురైపోయారు. 38 కాబట్టి నేను మీకు చెప్పేదేమిటంటే, ఈ మనుషుల జోలికి పోకండి, వాళ్ల దారిన వాళ్లను వదిలేయండి. ఈ ఆలోచన గానీ ఈ పని గానీ మనుషుల నుండి వచ్చినదైతే అది నాశనమైపోతుంది. 39 కానీ అది దేవుని నుండి వచ్చినదైతే, మీరు దాన్ని నాశనం చేయలేరు. చివరికి మీరు దేవునితోనే పోరాడేవాళ్లు అవుతారేమో.” 40 వాళ్లు అతని మాట విని అపొస్తలుల్ని పిలిపించి, వాళ్లను కొట్టించి, ఇక మీదట యేసు పేరున మాట్లాడవద్దని ఆజ్ఞాపించి వాళ్లను వెళ్లనిచ్చారు.

41 యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని సంతోషిస్తూ వాళ్లు మహాసభ నుండి వెళ్లిపోయారు. 42 వాళ్లు ప్రతీరోజు ఆలయంలో, అలాగే ఇంటింటా మానకుండా బోధిస్తూ, క్రీస్తు గురించిన అంటే యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి