కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 14
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

అపొస్తలుల విషయసూచిక

    • 14

      • ఈకొనియలో అభివృద్ధి, వ్యతిరేకత  (1-7)

      • లుస్త్రలో పౌలును, బర్నబాను దేవుళ్లు అనుకోవడం  (8-18)

      • పౌలును రాళ్లతో కొట్టినా బ్రతికాడు (19, 20)

      • సంఘాల్ని బలపర్చడం  (21-23)

      • సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం  (24-28)

అపొస్తలుల కార్యాలు 14:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1998, పేజీ 16

అపొస్తలుల కార్యాలు 14:3

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/1998, పేజీ 16

అపొస్తలుల కార్యాలు 14:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీ 21

అపొస్తలుల కార్యాలు 14:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 95-96

అపొస్తలుల కార్యాలు 14:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 95-96

    కావలికోట,

    6/1/1993, పేజీ 3

    1/1/1991, పేజీ 21

అపొస్తలుల కార్యాలు 14:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కొత్త లోక అనువాదం, పేజీ 1846

    కావలికోట,

    5/15/2008, పేజీ 32

    1/1/1991, పేజీలు 21-22

    5/1/1990, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 14:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/1/1990, పేజీ 30

అపొస్తలుల కార్యాలు 14:15

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 97-98

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:16

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీలు 97-98

    సన్నిహితమవండి, పేజీలు 271-272

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 7

    తేజరిల్లు!,

    No. 3 2021 పేజీ 14

    కావలికోట,

    1/1/1991, పేజీలు 21-22

అపొస్తలుల కార్యాలు 14:20

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/15/2013, పేజీలు 28-29

అపొస్తలుల కార్యాలు 14:22

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 124

    యువత అడిగే ప్రశ్నలు, ఆర్టికల్‌ 113

    కావలికోట,

    9/15/2014, పేజీ 13

అపొస్తలుల కార్యాలు 14:23

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 99

అపొస్తలుల కార్యాలు 14:27

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సాక్ష్యం ఇవ్వండి, పేజీ 101

అపొస్తలుల కార్యాలు 14:28

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2008, పేజీ 28

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
అపొస్తలుల కార్యాలు 14:1-28

అపొస్తలుల కార్యాలు

14 ఈకొనియలో పౌలు, బర్నబా యూదుల సభామందిరంలోకి వెళ్లారు. వాళ్లు అక్కడ ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులు, గ్రీసు దేశస్థులు విశ్వాసులయ్యారు. 2  అయితే విశ్వసించని యూదులు అన్యుల్ని ప్రేరేపించి పౌలును, బర్నబాను ద్వేషించేలా వాళ్ల మనసుల్ని చెడగొట్టారు. 3 అందుకే వాళ్లు యెహోవా* అధికారంతో ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. దేవుడు వాళ్ల ద్వారా సూచనలు, అద్భుతాలు జరిగేలా చేసి తన అపారదయ గురించిన సందేశాన్ని ధృవీకరించాడు. 4 అయితే ఆ నగరంలోని ప్రజలు రెండు భాగాలుగా విడిపోయారు. కొందరు యూదులకు, మిగతావాళ్లు ఆ ఇద్దరు అపొస్తలులకు మద్దతిచ్చారు. 5 అన్యులు, యూదులు, యూదుల పరిపాలకులు వాళ్లిద్దర్ని అవమానించాలని, రాళ్లతో కొట్టాలని అనుకున్నారు. 6 ఈ విషయం గురించి తెలిసినప్పుడు పౌలు, బర్నబా లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే నగరాలకు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు పారిపోయారు. 7 అక్కడ కూడా వాళ్లు మంచివార్త ప్రకటిస్తూనే ఉన్నారు.

8 లుస్త్రలో, పాదాలు చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను పుట్టుకతోనే కుంటివాడు, ఎప్పుడూ నడవలేదు. 9 పౌలు మాట్లాడుతుండగా అతను వింటున్నాడు. పౌలు అతని వైపే చూస్తూ, బాగవ్వడానికి కావాల్సిన విశ్వాసం అతనికి ఉందని గమనించి, 10 “నీ కాళ్ల మీద నిలబడు” అని బిగ్గరగా అన్నాడు. దాంతో అతను వెంటనే లేచి, నడవడం మొదలుపెట్టాడు. 11 పౌలు చేసింది చూసినప్పుడు ప్రజలు లుకయొనియ భాషలో ఇలా అరిచారు: “దేవుళ్లు మనుషుల రూపంలో మన దగ్గరికి దిగివచ్చారు!” 12 కాబట్టి వాళ్లు బర్నబాను ద్యుపతి అని, పౌలును హెర్మే అని పిలవడం మొదలుపెట్టారు. ఇద్దరిలో పౌలు ఎక్కువగా మాట్లాడాడు కాబట్టి అతన్ని హెర్మే అని పిలిచారు. 13 ఆ నగర ప్రవేశ ద్వారం దగ్గర ద్యుపతి ఆలయం ఉంది. దాని పూజారి ఎద్దుల్ని, పూలదండల్ని నగర గుమ్మాల దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలతో కలిసి బలులు అర్పించాలని అనుకున్నాడు.

14 అయితే అపొస్తలులైన బర్నబా, పౌలు దాని గురించి విన్నప్పుడు తమ వస్త్రాలు చింపుకొని ఆ గుంపుల్లోకి చొరబడి ఇలా అరిచారు: 15 “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే, మీకున్న లాంటి బలహీనతలే మాకూ ఉన్నాయి. మీరు ఉపయోగంలేని ఇలాంటివాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసిన జీవంగల దేవుని వైపుకు తిరగాలని మేము మీకు మంచివార్త ప్రకటిస్తున్నాం. 16 గతంలో ఆయన దేశాలన్నిటినీ తమకు నచ్చినట్లు చేయనిచ్చాడు. 17 అయినా, మంచి చేయడం ద్వారా ఆయన తన గురించి తాను సాక్ష్యమిచ్చాడు. ఎలాగంటే, ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ, ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.” 18 ఇంత చెప్పిన తర్వాత కూడా, బలి అర్పించకుండా ప్రజల్ని ఆపడానికి వాళ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

19 అయితే అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకున్నారు. దాంతో వాళ్లు పౌలును రాళ్లతో కొట్టి, అతను చనిపోయాడని అనుకొని నగరం బయటికి ఈడ్చుకెళ్లారు. 20 అయితే శిష్యులు పౌలు చుట్టూ చేరినప్పుడు అతను లేచి నగరంలోకి ప్రవేశించాడు. తర్వాతి రోజు అతను బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్లాడు. 21 ఆ నగరంలో మంచివార్త ప్రకటించి చాలామందిని శిష్యుల్ని చేసిన తర్వాత వాళ్లు లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయకు తిరిగివెళ్లారు. 22 అక్కడ పౌలు, బర్నబా విశ్వాసంలో స్థిరంగా ఉండమని శిష్యుల్ని ప్రోత్సహిస్తూ వాళ్లను బలపర్చారు. వాళ్లు శిష్యులతో ఇలా అన్నారు: “ఎన్నో శ్రమల్ని ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి.” 23 అంతేకాదు వాళ్లు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ఒక్కో సంఘంలో పెద్దల్ని నియమించారు; ఆ పెద్దల్ని వాళ్లు నమ్మిన యెహోవాకు* అప్పగించారు.

24 తర్వాత వాళ్లు పిసిదియ మీదుగా ప్రయాణించి పంఫూలియకు వచ్చారు. 25 పెర్గేలో వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్లు అత్తాలియకు వెళ్లారు. 26 అక్కడి నుండి వాళ్లు ఓడలో తిరిగి అంతియొకయకు బయల్దేరారు. ఇప్పుడు వాళ్లు ఏ పనైతే ముగించారో, ఆ పని కోసం సోదరులు వాళ్లను దేవుని అపారదయకు అప్పగించింది అక్కడే.

27 వాళ్లు అక్కడికి చేరుకున్నాక, అక్కడున్న సంఘాన్ని ఒకచోట సమావేశపర్చి, తమ ద్వారా దేవుడు చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు చెప్పారు. అలాగే, దేవుడు అన్యుల కోసం విశ్వాసమనే తలుపు తెరిచాడని కూడా వాళ్లకు చెప్పారు. 28 వాళ్లు ఆ శిష్యుల దగ్గర చాలాకాలం ఉన్నారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి