కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp16 No. 3 పేజీలు 5-6
  • బాధను తట్టుకోవడం ఎలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బాధను తట్టుకోవడం ఎలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • దుఃఖంతో నేనెలా జీవించగలను?
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
  • ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • మనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుంది?
    తేజరిల్లు!—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
wp16 No. 3 పేజీలు 5-6

పత్రిక ముఖ్యాంశం | ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .

బాధను తట్టుకోవడం ఎలా?

ఈ విషయంలో చాలా సలహాలు ఉన్నాయి. కానీ, ప్రతీ సలహా ఉపయోగపడదు. ఉదాహరణకు కొంతమంది అస్సలు ఏడవద్దు అంటారు, మీ భావాలు బయటపెట్టవద్దు అని సలహా ఇస్తారు. ఇంకొంతమంది మీకు అనిపించేవన్నీ బయటపెట్టేయాలని చెప్తారు. అయితే బైబిల్లో సరైన సలహాలు ఉన్నాయి. అవి నేడున్న పరిశోధనలతో కూడా ఏకీభవిస్తాయి.

కొన్ని సంస్కృతుల్లో పురుషులు ఏడవడం మగతనంకాదని అంటారు. మరి అందరి ముందు ఏడవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమా? బాధలో ఉన్నప్పుడు ఏడుపు రావడం మామూలే అని మానసిక ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలా ఏడిస్తే ఎంత బాధలో ఉన్నా మెల్లమెల్లగా కాలం గడిచే కొద్ది దుఃఖం తగ్గుతుంది. కానీ, ఏడవకుండా బాధను అణచుకోవడం మంచిది కాదు. బాధలో ఏడవడం తప్పని గానీ, మగతనం కాదని గానీ బైబిల్లో ఎక్కడా లేదు. యేసు గురించి ఆలోచించండి. ఆయన స్నేహితుడు లాజరు చనిపోయినప్పుడు యేసు అందరి ముందు ఏడ్చాడు. చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించే శక్తి ఉన్నా కూడా ఏడ్చాడు.—యోహాను 11:33-35.

బాధలో ఉన్నప్పుడు కోపం రావడం సహజమే. అనుకోకుండా, హఠాత్తుగా దగ్గరివాళ్లు చనిపోతే అలా జరుగుతుంది. బాధలో ఉన్నప్పుడు కోపం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు ఎవరైనా ఆలోచించకుండా ఏదైనా అనేస్తే కోపం వస్తుంది. దక్షిణ ఆఫ్రికాకు చెందిన మైక్‌ అనే అతను ఇలా చెప్తున్నాడు: “నాకు 14 సంవత్సరాలప్పుడు మా నాన్న చనిపోయారు. అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు మా చర్చి ఫాదర్‌ దేవునికి మంచివాళ్లు అవసరం కాబట్టి వాళ్లను తొందరగా పరలోకానికి తీసుకెళ్లిపోతాడనిa చెప్పాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే మాకు మా నాన్న చాలా అవసరం. 63 సంవత్సరాలు తర్వాత కూడా ఆ మాటలు నన్ను ఇంకా బాధిస్తున్నాయి.”

బాధలో ఉన్నప్పుడు మనల్ని మనం నిందించుకోవచ్చా? హఠాత్తుగా ఎవరైనా చనిపోతే, ‘నేను ఇలా చేసుంటే, ఇదంతా జరిగి ఉండేది కాదేమో’ అని తప్పుగా నిందించుకునే అవకాశం ఉంది. లేదా చనిపోయినవాళ్లతో చివరిసారి మాట్లాడినప్పుడు గొడవపడి ఉంటే ఎక్కువగా నిందించుకునే అవకాశం ఉంది.

కోపం గానీ, అపరాధ భావాలు గానీ ఉంటే వాటిని మనసులోనే ఉంచుకోకూడదు. ఒక స్నేహితునితో చెప్పుకుంటే మంచిది. మీరు చెప్పినవన్నీ ఓపిగ్గా విని, ఆ భావాలు ఉండడం సహజమేనని మీకు ధైర్యం చెప్పేవాళ్లతో మాట్లాడండి. బైబిలు ఇలా అంటుంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.

బాధలో ఉన్నవారికి మన సృష్టికర్తయైన యెహోవా దేవుని కంటే మంచి స్నేహితుడు ఇంకెవరూ ఉండరు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” కాబట్టి మీ మనసులో ఉన్నదంతా చెప్పేయండి. (1 పేతురు 5:7) అలా చెప్తే “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని కూడా ఆయన మాటిస్తున్నాడు. (ఫిలిప్పీయులు 4:6, 7) ఆయన వాక్యమైన బైబిలు ద్వారా మీకు ఉపశమనాన్ని ఇచ్చే అవకాశాన్ని దేవునికి ఇవ్వండి. ఓదార్పునిచ్చే కొన్ని లేఖనాలను రాసుకోండి. (కింద ఇచ్చిన బాక్సు చూడండి.) వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. రాత్రిపూట మీరు ఒక్కరే ఉన్నప్పుడు, నిద్ర పట్టడం కష్టంగా అనిపించినప్పుడు వాటి గురించి ఆలోచిస్తే ఎంతో సహాయకరంగా ఉంటుంది.—యెషయా 57:15.

40 సంవత్సరాల జాన్‌b అనే ఒకతని భార్య క్యాన్సర్‌ వల్ల చనిపోయింది. ఆయన ఆమెను ఎంతో ప్రేమించాడు. కొన్నిసార్లు చాలా ఒంటరిగా అనిపిస్తుందని ఆయన చెప్తున్నాడు. కానీ అతను ప్రార్థన వల్ల సహాయం పొందాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “నేను యెహోవాకు ప్రార్థించినప్పుడు, ఒంటరిగా అనిపించదు. చాలాసార్లు రాత్రులు మెలకువ వస్తుంది, మళ్లీ నిద్రపట్టదు. అప్పుడు బైబిల్లో కొన్ని వచనాలు చదివి, వాటి గురించి ఆలోచిస్తాను. తర్వాత, నా మనసులో ఉన్నవన్నీ ప్రార్థనలో దేవునికి చెప్తాను. అప్పుడు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు, హృదయం తేలికైపోయి నిద్ర వస్తుంది.”

వనెసా వాళ్ల అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. ఈమెకు కూడా ప్రార్థన ఎంతో సహాయం చేసింది. ఆమె ఇలా అంటుంది: “చాలా కష్టంగా ఉన్నప్పుడు, ఇంక దేవున్ని పిలుస్తూ ఏడ్చేసేదాన్ని. యెహోవా నా ప్రార్థనలు విని నాకు అవసరమైన బలాన్ని ఎప్పుడూ ఇచ్చాడు.”

బాధలో ఉన్నవాళ్లు ఇతరులకు సహాయం చేస్తే లేదా సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిదని కౌన్సిలర్లు సలహా ఇస్తున్నారు. అలాచేస్తే సంతోషంగా ఉంటుంది, దుఃఖం తగ్గుతుంది. (అపొస్తలుల కార్యములు 20:35) ఈ పరిస్థితిలో ఉన్న చాలామంది క్రైస్తవులు వేరేవాళ్లకు సహాయం చేయడం వల్ల ఎంతో ఓదార్పు పొందామని చెప్తున్నారు.—2 కొరింథీయులు 1:3, 4. (w16-E No. 3)

a బైబిల్లో అలా లేదు. మనుషులు ఎందుకు చనిపోతారో బైబిలు వివరిస్తుంది.—ప్రసంగి 9:11; యోహాను 8:44; రోమీయులు 5:12.

b అసలు పేరు కాదు

ఓదార్పునిచ్చే బైబిలు వచనాలు

  • మీరు బాధపడుతుంటే దేవునికి కూడా బాధగా ఉంటుంది.—కీర్తన 55:22; 1 పేతురు 5:7.

  • తన సేవకులు చేసే ప్రార్థనలను దేవుడు ఓపిగ్గా వింటాడు.—కీర్తన 86:5; 1 థెస్సలొనీకయులు 5:16–18.

  • చనిపోయినవాళ్లను జ్ఞాపకం చేసుకుని దేవుడు కూడా బాధపడతాడు.—యోబు 14:13-15.

  • చనిపోయినవాళ్లను బ్రతికిస్తానని దేవుడు మాటిస్తున్నాడు.—యెషయా 26:19; యోహాను 5:28, 29.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి