కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 5 పేజీలు 12-13
  • జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • నోవహు ఓడ
    నా బైబిలు పుస్తకం
  • భాగం 5
    దేవుడు చెప్పేది వినండి
  • నోవహు ఓడను నిర్మించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • ఆయన ‘దేవునితో నడిచాడు’
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 5 పేజీలు 12-13

భాగం 5

జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?

నోవహు కాలంలో ఎక్కువమంది చెడ్డ ప్రజలే ఉండేవాళ్లు. ఆదికాండం 6:5

చెడ్డదూతలు మనుషుల్లా వచ్చి స్త్రీలతో కలిశారు

ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టారు, భూమ్మీద ప్రజలు ఎక్కువయ్యారు. అప్పుడు కొంతమంది దేవదూతలు దేవునికి ఎదురుతిరిగి సాతానుతో చేరారు.

వాళ్లు స్త్రీలను పెళ్లి చేసుకోవడానికి మనుషుల్లా భూమ్మీదికి వచ్చారు. ఆ స్త్రీలకు పుట్టిన పిల్లలు మిగతావాళ్లలా కాకుండా భయంకరంగా, చాలా బలంగా ఉండేవాళ్లు.

ఒకామె బిడ్డను ఎత్తుకొనివుంటే ఒక అబ్బాయి ఆమెను కొడుతున్నాడు; చెడ్డదూతల కొడుకులైన నెఫీలీయులు క్రూరంగా ప్రవర్తించేవాళ్లు

భూమి చెడ్డ ప్రజలతో నిండిపోయింది. “భూమ్మీద మనుషుల దుష్టత్వం చాలా ఎక్కువగా ఉందని, వాళ్ల హృదయంలోని ఆలోచనలన్నీ ఎప్పుడూ చెడువైపే మొగ్గుచూపుతాయని” బైబిలు చెప్తుంది.

నోవహు దేవుడు చెప్పింది విని, ఓడ కట్టాడు. ఆదికాండం 6:13, 14, 18, 19, 22

నోవహు దేవుడు చెప్పేది వింటున్నాడు

నోవహు మంచివాడు. యెహోవా ఒక జలప్రళయం రప్పించి చెడ్డ వాళ్లందర్నీ నాశనం చేస్తానని ఆయనతో చెప్పాడు.

నోవహు, ఆయన కుటుంబం ఓడ కడుతున్నారు

ఒక పెద్ద ఓడ కట్టి తన కుటుంబాన్ని, అన్నిరకాల జంతువుల్ని దానిలోకి తీసుకెళ్లమని దేవుడు నోవహుకు చెప్పాడు.

జలప్రళయం రాబోతుందని నోవహు ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు, కానీ వాళ్లు హేళన చేస్తున్నారు

జలప్రళయం వస్తుందని నోవహు ప్రజల్ని హెచ్చరించాడు, కానీ వాళ్లు వినలేదు. కొంతమంది ఆయన్ని ఎగతాళి చేశారు, ఇంకొంతమంది అసహ్యించుకున్నారు.

ఓడలోకి ఎక్కించడానికి నోవహు, ఆయన కుటుంబం జంతువుల్ని తీసుకొస్తున్నారు

ఓడ కట్టడం పూర్తయిన తర్వాత నోవహు అందులోకి జంతువుల్ని తీసుకెళ్లాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి