కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 1 పేజీలు 14-15
  • ఒత్తిడిలేని జీవితం సాధ్యమే

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒత్తిడిలేని జీవితం సాధ్యమే
  • తేజరిల్లు!—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • విషయసూచిక
    తేజరిల్లు!—2020
  • దేవుని రాజ్యంలో ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది’
    తేజరిల్లు!—2019
  • ప్రయోజనకరమైన ఒత్తిడి, హానికరమైన ఒత్తిడి
    తేజరిల్లు!—1998
  • ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?
    తేజరిల్లు!—2020
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 1 పేజీలు 14-15
సముద్రపు అలల్లో తండ్రి కొడుకులు ఆడుకుంటున్నారు, తల్లి కూతుళ్లు ఒడ్డున నిలబడి వాళ్లను చూస్తూ ఆనందిస్తున్నారు.

ఒత్తిడి నుండి బయటపడండి

ఒత్తిడిలేని జీవితం సాధ్యమే

అనవసరమైన ఒత్తిడిని చాలావరకు తగ్గించుకోవడానికి బైబిల్లో ఉన్న తెలివి సహాయం చేస్తుంది. ఒత్తిడి కలిగించే వాటన్నిటిని తీసేయడం మనకు అసాధ్యం, కానీ సృష్టికర్తకు సాధ్యమే. ఈ విషయంలో మనకు సహాయం చేయడానికి ఆయన ఒక వ్యక్తిని నియమించాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసినవాటి కన్నా మరెన్నో గొప్ప సంగతుల్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా చేస్తాడు. ఉదాహరణకు:

యేసు ఒకప్పుడు చేసినట్టే, రోగుల్ని బాగుచేస్తాడు.

‘ప్రజలు రకరకాల జబ్బులతో బాధపడుతున్నవాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లను బాగుచేశాడు.’—మత్తయి 4:24.

యేసు అందరికీ ఇళ్లు, ఆహారం ఇస్తాడు.

“వాళ్లు [క్రీస్తు పరిపాలనలో ఉండే ప్రజలు] ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు. వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు, వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు.”—యెషయా 65:21, 22.

యేసు పరిపాలనలో భూమంతటా శాంతి, భద్రతలు ఉంటాయి.

‘ఆయన రోజుల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు, చంద్రుడు లేకుండా పోయేవరకు శాంతి విస్తరిస్తుంది. సముద్రం నుండి సముద్రం వరకు, నది నుండి భూమి అంచుల వరకు ఆయన పరిపాలిస్తాడు. ఆయన శత్రువులు మట్టి నాకుతారు.’—కీర్తన 72:7-9.

యేసు అన్యాయాన్ని అంతం చేస్తాడు.

“దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:13, 14.

యేసు బాధల్ని, మరణాన్ని కూడా తీసేస్తాడు.

“మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.

‘తీవ్రమైన ఒత్తిడి ఉండే ప్రమాదకరమైన కాలాలు’

“మనం ముందెన్నడూ చూడనంత తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, బాధ, వేదన నేడు లోకంలో ఉన్నాయి.”—మోహామద్‌ ఎస్‌. యూనిస్‌, గాలప్‌ మానేజింగ్‌ ఎడిటర్‌.

అందరూ ఒత్తిడికి ఎందుకు గురౌతున్నారు? దానికి జవాబు బైబిల్లో ఉంది. “చివరి రోజుల్లో . . . తీవ్రమైన ఒత్తిడి, కష్టాలు ఉండే ప్రమాదకరమైన కాలాలు వస్తాయి” అని 2 తిమోతి 3:1 (ది ఆంప్లిఫైడ్‌ బైబిల్‌ ) చెప్తుంది. ప్రజల చెడు లక్షణాల వల్ల అందరూ ఒత్తిడికి గురౌతారని కూడా బైబిలు చెప్తుంది. ఆ చెడు లక్షణాల్లో దురాశ, గర్వం, క్రూరత్వం, మతం పేరుతో మోసం చేయడం, మమకారం లేకపోవడం, ఆత్మనిగ్రహం లేకపోవడం వంటివి ఉన్నాయి. (2 తిమోతి 3:2-5) పరలోక ప్రభుత్వమైన దేవుని రాజ్యానికి రాజుగా, యేసుక్రీస్తు భూమ్మీద పూర్తి అధికారం పొందినప్పుడు చివరి రోజులు ముగుస్తాయి.—దానియేలు 2:44.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి