అధస్సూచి
a యేసుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు యోసేపు ఇంకా బ్రతికేవున్నాడని బైబిల్లో గమనిస్తాం. కానీ యేసు మొట్టమొదటి అద్భుతాన్ని చేస్తున్నప్పుడు అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడుగానీ ఆ తర్వాతగానీ బైబిల్లో యోసేపు ప్రస్తావన లేదు. బహుశా ఆ సమయానికల్లా యోసేపు చనిపోయివుంటాడు. అంతేకాదు యేసు హింసా కొయ్య మీద ఉన్నప్పుడు, తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని అపొస్తలుడైన యోహానుకు చెప్పాడు. ఒకవేళ యోసేపు ఆ సమయానికి బ్రతికే ఉంటే యేసు అలా చెప్పి ఉండేవాడు కాదు.—యోహా. 19:26, 27.