అధస్సూచి
c దేవుడు తీసుకొచ్చిన జలప్రళయం వల్ల, ఏదెను తోట జాడ కూడా లేకుండా పూర్తిగా నాశనమైపోయింది. యెహెజ్కేలు 31:18 చదివితే, క్రీ.పూ. ఏడవ శతాబ్దం కల్లా “ఏదెనులోని చెట్లు” నాశనమై అప్పటికే చాలాకాలం గడిచిందని తెలుస్తుంది. కాబట్టి, ఆ తర్వాతి కాలాల్లో ఏదెను తోట కోసం వెదికిన వాళ్లంతా తప్పుదారి పట్టారని తెలుస్తుంది.