అధస్సూచి
a బలిగా అర్పించబడే జంతువు రక్తానికి ప్రాయశ్చిత్త విలువ ఉంది, ఎందుకంటే యెహోవా రక్తాన్ని పరిశుద్ధమైనదిగా ఎంచుతాడు. (లేవీయకాండము 17:11) అలాగని, పేదవాళ్లు అర్పణగా తెచ్చే పిండి విలువలేనిదని అర్థమా? కాదు. అలాంటి అర్పణలను తెచ్చే ప్రజల వినయ మనస్సును, వారి ఇష్టపూర్వకమైన వైఖరిని యెహోవా విలువైనవిగా ఎంచాడు. అంతేకాదు పేదవాళ్లతోసహా ఇశ్రాయేలు జనాంగమంతటి పాపాలకు, ప్రాయశ్చిత్తార్థ దినాన అర్పించబడే జంతు బలుల రక్తంవల్లే ప్రాయశ్చిత్తం కలిగేది.—లేవీయకాండము 16:29, 30.