అధస్సూచి
a అతిగా తినాలనే కోరిక మనసులోనే పుడుతుంది. తిండిబోతులు అత్యాశతో అతిగా తింటారు. కాబట్టి ఒకరు చూడడానికి ఎలా ఉన్నారనే దాన్నిబట్టికాదు గానీ ఆహారం విషయంలో వారికున్న వైఖరినిబట్టే వారు తిండిబోతులా కాదా అన్నది చెప్పగలం. కొందరు మామూలుగా లేదా సన్నగా ఉన్నా వారు తిండిబోతులై ఉండొచ్చు. కొన్నిసార్లు, స్థూలకాయులు ఏదో అనారోగ్యం వల్లనో జన్యుకారణాల వల్లనో లావుగా ఉండొచ్చు. కాబట్టి ఒక వ్యక్తి బరువు ఎంతున్నా సరే ఆయన తిండి విషయంలో ఎంత అత్యాశతో ప్రవర్తిస్తున్నాడన్నదే మనం చూడాలి.—కావలికోట నవంబరు 1, 2004లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.