అధస్సూచి
a వారివురూ బైబిలు వ్రాయబడిన ఆదిమ భాషల అధ్యయనానికి ఎంతగానో తోడ్పడ్డారు. రోయ్‌క్లెన్ 1506లో హెబ్రీ వ్యాకరణ పుస్తకాన్ని ప్రచురించాడు, దానితో హెబ్రీ లేఖనాలను లోతుగా అధ్యయనం చేయడం సాధ్యమైంది. ఎరాస్మస్ అందుబాటులోవున్న క్రైస్తవ గ్రీకు లేఖనాల ప్రాచీన వ్రాతప్రతుల్లో నుండి ఎత్తివ్రాసిన గ్రీకు లేఖన సంకలనాన్ని 1516లో ప్రచురించాడు.