అధస్సూచి
a అర్మేనియన్‌లు తమ దేశానికి అరారాతు పర్వతానికి సంబంధం ఉందని చెప్పుకోవడానికి ఇదొక కారణం. ప్రాచీన కాలాల్లో అర్మేనియా ఎంతో సువిశాలమైన రాజ్యం, ఆ పర్వతాలు కూడా దాని క్షేత్రంలోనే ఉండేవి. అందుకే యెషయా 37:38వ వచనంలోని “ఆరారాతు దేశము” అనే పదబంధాన్ని గ్రీక్ సెప్టాజింట్ బైబిలు అనువాదము “అర్మేనియా” అని అనువదించింది. ప్రస్తుతం అరారాతు పర్వతం, టర్కీ దేశంలో తూర్పు సరిహద్దుకు దగ్గరలో ఉంది.