అధస్సూచి
a అపోక్రిఫా వ్రాతలు (అక్షరార్థంగా, “దాగివున్న”), స్యూడెపీగ్రాఫా వ్రాతలు (అక్షరార్థంగా, “బూటకపు వ్రాతలు”) సా.శ.పూ. మూడవ శతాబ్దం మొదలుకొని సా.శ. మొదటి శతాబ్ద కాలం వరకు ఉన్న యూదామత వ్రాతలు. రోమన్ క్యాథలిక్ చర్చి అపోక్రిఫాను దైవప్రేరేపిత బైబిలులో భాగంగా స్వీకరించింది, కానీ ఈ పుస్తకాల్ని యూదులు ప్రొటెస్టెంట్లు తిరస్కరించారు. బైబిల్లోని కథల్ని సాగదీసి వ్రాసి వాటికి ప్రసిద్ధిగాంచిన కొన్ని బైబిలు పాత్రల పేర్లు పెట్టిన వృత్తాంతాలు స్యూడెపీగ్రాఫా వ్రాతల్లో ఎక్కువగా ఉన్నాయి.