అధస్సూచి
a సి. టి. రస్సెల్ మరణం తర్వాత, యెహెజ్కేలు ప్రకటన గ్రంథాలపై వివరణను అందజేయాలనే ఉద్దేశంతో స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ యొక్క ఏడవ సంపుటిగా వ్యవహరించబడిన ప్రచురణ సిద్ధం చేయబడింది. ఆ సంపుటి కొంతమేరకు, ఆ బైబిలు పుస్తకాలపై రస్సెల్ చేసిన వ్యాఖ్యానాల ఆధారంగా తయారు చేయబడింది. అయితే, ఆ ప్రవచనాల భావాన్ని బయల్పరిచే సమయం అప్పటికింకా రాలేదు, అంతేగాక స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ అనే ఆ సంపుటిలో అందజేయబడిన వివరణ అంత స్పష్టంగా లేదు. తర్వాతి సంవత్సరాల్లో, యెహోవా కృపాబాహుళ్యము, ప్రపంచ సంఘటనల్లో జరిగిన అభివృద్ధులు ఆ ప్రవచన పుస్తకాల భావాన్ని క్రైస్తవులు మరింత కచ్చితంగా గ్రహించేలా చేశాయి.