అధస్సూచి
a అలక్సాండ్రియా, ఈజిప్ట్, వంటివాటిలో ఉన్నటువంటి యూదా సమాజంవారిలా, ఇశ్రాయేలుకు వెలుపల ఉన్న అనేకమంది యూదులు ఇక ఎంత మాత్రమూ హెబ్రీని ధారాళంగా చదివేవారు కాదు కనుక, బైబిలును ప్రాంతీయ భాషలోకి అనువదించాల్సిన అవసరతను గుర్తించారు. ఈ అవసరాన్ని పూరించేందుకు సా.శ.పూ. మూడవ శతాబ్దంలో గ్రీకు సెప్టుజిన్‌ట్ వర్షన్ తయారుచేయబడింది. ఈ అనువాదం మూలపాఠ విమర్శకు తర్వాత ఎంతో ప్రాముఖ్యమైన మూలమౌతుంది.