అధస్సూచి
c యెరూషలేముపై రోమా సైన్యం జరిపిన ప్రాథమిక దాడికి ఆ తర్వాత దాని నాశనానికి మధ్య కాలంలో జరిగిన విషయాలను గూర్చి యూదా చరిత్రకారుడైన జోసిఫస్ యిలా వ్రాశాడు: “రాత్రి సమయంలో విపత్కరమైన సుడిగాలి విసిరి, తుఫాను విరుచుకుపడింది, భూమి దద్దరిల్లుతూ భయంకరంగా కంపించింది, ఉరుములు మెరుపులతో ఎడతెరపి లేకుండ వర్షం కుండపోతగా కురిసింది. మొత్తం విధానం యిలా కుప్పకూలి పోవడం ద్వారా మానవజాతికి కలిగే విపత్తు స్పష్టంగా ఒక ముంగుర్తుగా చూపబడింది, ఆలాగే ఈ సూచనలన్ని రానైయున్న సాటిలేని వినాశనాన్ని గూర్చి తెలియజేశాయని ఎవరూ సందేహించలేరు.”