అధస్సూచి
e అనేకులు లూకా వ్రాసిన వృత్తాంతంలో లూకా 21:24 తర్వాత మరో విషయంపై అవధానమివ్వడాన్ని గమనిస్తారు. డా. లియాన్ మారిస్ యిలా అన్నారు: “యేసు అన్యరాజుల కాలాన్ని గూర్చి మాట్లాడసాగాడు. . . . అనేక విధ్వాంసుల ప్రకారం, మనుష్యకుమారుని రాకడవైపుకు అవధానం మారుతుంది.” ప్రొఫెసర్ ఆర్. జిన్స్ యిలా రాశాడు: “మనుష్యకుమారుని రాకడ—(మత్తయి 24:29-31; మార్కు 13:24-27). ‘అన్యరాజులకాలం’ యొక్క ప్రస్తావన యీ అంశానికి ఉపోద్ఘాతాన్ని అందిస్తుంది; యిప్పుడు [లూకా] దృష్టి యెరూషలేము వినాశనానికి ఎంతో ముందు భవిష్యత్తుకు కొనిపోబడింది.”