12 అంతేకాదు, అబ్రాహాము సున్నతి చేయించుకున్నవాళ్లకు కూడా తండ్రి అయ్యాడు; సున్నతి ఆచారాన్ని పాటించేవాళ్లకు మాత్రమే కాదు, సున్నతి చేయించుకోని స్థితిలో ఉన్నప్పుడు మన తండ్రి అబ్రాహాము+ చూపించిన విశ్వాసపు అడుగుజాడల్లో సక్రమంగా నడిచేవాళ్లకు కూడా అతను తండ్రి అయ్యాడు.