కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbv ఆర్టికల్‌ 1
  • మార్కు 1:15—“దేవుని రాజ్యం దగ్గరపడింది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్కు 1:15—“దేవుని రాజ్యం దగ్గరపడింది”
  • బైబిలు వచనాల వివరణ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మార్కు 1:15 అర్థమేంటి?
  • మార్కు 1:15 సందర్భం
  • దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుని రాజ్యం పరిపాలిస్తుంది
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
మరిన్ని
బైబిలు వచనాల వివరణ
ijwbv ఆర్టికల్‌ 1

బైబిలు వచనాల వివరణ

మార్కు 1:15—“దేవుని రాజ్యం దగ్గరపడింది”

“నిర్ణయించిన సమయం పూర్తయింది, దేవుని రాజ్యం దగ్గరపడింది. కాబట్టి పశ్చాత్తాపపడండి, మంచివార్త మీద విశ్వాసం ఉంచండి.”—మార్కు 1:15, కొత్త లోక అనువాదం.

“కాలం పూర్తి అయింది. దేవుని రాజ్యం దగ్గరగా ఉంది. పశ్చాత్తాపపడి శుభవార్త నమ్మండి.”—మార్కు 1:15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

మార్కు 1:15 అర్థమేంటి?

దేవుని రాజ్యంa “దగ్గరపడింది” లేదా “దగ్గరగా ఉంది” అని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన ఎందుకలా అన్నాడు? ఆ రాజ్యానికి కాబోయే రాజు ఆయనే, పైగా ఆయనే స్వయంగా వాళ్ల మధ్య ఉన్నాడు కాబట్టి అలా అన్నాడు.

ఆ రాజ్యం అప్పటికే పరిపాలించడం మొదలుపెట్టిందని యేసు ఉద్దేశం కాదు. నిజానికి ఆ తర్వాత ఆయనే, దేవుని రాజ్యం భవిష్యత్తులో వస్తుందని తన శిష్యులకు సూచించాడు. (అపొస్తలుల కార్యాలు 1:6, 7) ఏదేమైనా, భవిష్యత్‌ రాజుగాb యేసు ఎప్పుడు కనిపిస్తాడని బైబిలు ప్రవచించిందో సరిగ్గా ఆ సంవత్సరంలోనే ఆయన వచ్చాడు. అందుకే ఆయన, “నిర్ణయించిన సమయం పూర్తయింది” అని చెప్పగలిగాడు. రాజ్యం గురించిన సువార్తను లేదా మంచివార్తను ప్రకటించడం కోసం ఆయన బహిరంగ పరిచర్యను మొదలుపెట్టాల్సిన సమయం అదే.—లూకా 4:16-21, 43.

ఆ రాజ్యం గురించిన మంచివార్త నుండి ప్రజలు ప్రయోజనం పొందాలంటే వాళ్లు పశ్చాత్తాపపడాలి, అంటే గతంలో చేసిన పాపాల విషయంలో బాధపడాలి, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలి. అలా పశ్చాత్తాపపడిన ప్రజలు, రాబోయే ఆ రాజ్యం గురించిన మంచివార్త మీద తమకు విశ్వాసం ఉందని చూపించారు.

మార్కు 1:15 సందర్భం

గలిలయలో తన పరిచర్య మొదలుపెట్టిన కొత్తలో యేసు ఆ మాట అన్నాడు. మత్తయి 4:17 అదే సందర్భం గురించి మాట్లాడుతూ యేసు “అప్పటినుండి” దేవుని రాజ్యం గురించి ప్రకటించాడని చెప్తోంది. ఆ రాజ్యమే యేసు పరిచర్య ముఖ్యాంశం. నిజానికి నాలుగు సువార్తల్లోc 100 కన్నా ఎక్కువసార్లు ఆ రాజ్యం గురించిన ప్రస్తావన ఉంది; వాటిలో ఎక్కువశాతం యేసు ప్రస్తావించినవే. బైబిల్లో నమోదైన వివరాల్ని గమనిస్తే, యేసు వేరే ఏ విషయం కన్నా దేవుని రాజ్యం గురించే ఎక్కువగా మాట్లాడాడు.

మార్కు 1వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.

a దేవుని రాజ్యం అనేది పరలోక ప్రభుత్వం, భూమ్మీద తన ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు దాన్ని స్థాపించాడు. (దానియేలు 2:44; మత్తయి 6:10) మరిన్ని వివరాల కోసం, “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.

b ప్రవచించబడిన మెస్సీయగా అంటే దేవుని ప్రత్యేక ప్రతినిధిగా తనకున్న పాత్రల్లో ఒకదాన్ని పోషించడానికి ఆయన రాజవ్వాల్సి ఉంది. ఆయన ఏ సంవత్సరంలో మెస్సీయగా కనిపిస్తాడని బైబిలు కాలపట్టిక సూచించిందో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ చూడండి: “యేసే మెస్సీయ అని మెస్సీయ గురించిన ప్రవచనాలు నిరూపిస్తున్నాయా?”

c సువార్తలు అనేవి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని మొదటి నాలుగు పుస్తకాలు; చాలామంది వాటిని ‘కొత్త నిబంధన’ అని అంటారు; వాటిలో యేసు జీవితం, పరిచర్య గురించిన వివరాలు ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి