కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 102
  • జూదమాడడం పాపమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జూదమాడడం పాపమా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • జూదం క్రైస్తవులకు తగునా?
    తేజరిల్లు!—1994
  • జూదానికి క్రొత్తగా అలవాటుపడినవారు—యౌవనులు!
    తేజరిల్లు!—1995
  • జూదమాడడాన్ని బైబిలు ఖండిస్తోందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • పేకాట, జూదం
    తేజరిల్లు!—2015
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 102
టీవీలో వస్తున్న లాటరీ ఫలితాలు చూస్తూ, తన లాటరీ టికెట్‌ చెక్‌ చేసుకుంటున్న ఓ జూదగాడు

జూదమాడడం పాపమా?

బైబిలు ఇచ్చే జవాబు

జూదమాడడం గురించి బైబిలు ఎక్కువగా చెప్పడం లేదు, కానీ దానిలోని సూత్రాల్ని బట్టి, జూదం దేవుని దృష్టిలో పాపమని మనం అర్థం చేసుకోవచ్చు.—ఎఫెసీయులు 5:17.a

  • జూదమాడేవాళ్లు పేరాశతోనే ఆ పని చేస్తారు. దేవుడు పేరాశను (లోభత్వాన్ని) ద్వేషిస్తాడు. (1 కొరింథీయులు 6:9, 10; ఎఫెసీయులు 5:3, 5) ఎదుటివాళ్లు నష్టపోగా వచ్చే డబ్బు కోసం వాళ్లు ఆశపడతారు. కానీ, ఇతరుల వస్తువులను లేదా డబ్బును ఆశించడం తప్పని బైబిలు చెప్తుంది.—నిర్గమకాండము 20:17; రోమీయులు 7:7; 13:9, 10.

  • తక్కువ డబ్బు కోసమే జూదమాడినా, దానివల్ల మనలో డబ్బు మీద ప్రేమ కలుగుతుంది. అది చివరికి నాశనానికి నడిపిస్తుంది.—1 తిమోతి 6:9, 10.

  • జూదమాడేవాళ్లు చాలావరకు మూఢనమ్మకాల మీద, అదృష్టం మీద ఆధారపడతారు. కానీ యెహోవా అలాంటివాటిని విగ్రహారాధనగా దృష్టిస్తాడు. అలాంటి విగ్రహారాధనకు దేవుని ఆరాధనతో పోటీపడే అర్హత లేదు.—యెషయా 65:11.

  • ఏమాత్రం కష్టపడకుండా, తిని కూర్చోవడాన్ని బైబిలు సమర్థించడం లేదు, కష్టపడి పనిచేయమని అది మనల్ని ప్రోత్సహిస్తోంది. (ప్రసంగి 2:24; ఎఫెసీయులు 4:27, 28) ఆ సలహాను పాటించేవాళ్లు ‘సొంతగా సంపాదించుకున్న ఆహారం’ భుజించగలుగుతారు.—2 థెస్సలొనీకయులు 3:10, 12.

  • జూదమాడడం వల్ల మనలో పోటీతత్వం పెరుగుతుంది. బైబిలు పోటీతత్వాన్ని ఖండిస్తోంది.—గలతీయులు 5:26.

a  రోమా సైనికులు యేసు వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారని లేదా ‘జూదమాడారని’ బైబిలు చెప్తుంది. ఆ ఒక్క సందర్భంలోనే, జూదమాడడం గురించి బైబిలు ప్రత్యేకంగా ప్రస్తావించింది.—మత్తయి 27:35; యోహాను 19:23, 24; కాంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌; గుడ్‌ న్యూస్‌ ట్రాన్స్‌లేషన్‌.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి