కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 36
  • యేసు ఎప్పుడు పుట్టాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు ఎప్పుడు పుట్టాడు?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • క్రిస్టమస్‌ను డిసెంబరు 25న ఎందుకు జరుపుకుంటున్నారు?
  • మంచుకురిసే కాలంలో యేసు జన్మించెనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • క్రిస్మస్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • యేసుక్రీస్తును ఎలా జ్ఞాపకం చేసుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • క్రిస్టమస్‌—నిజంగా క్రైస్తవత్వానికి సంబంధించినదేనా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 36

యేసు ఎప్పుడు పుట్టాడు?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు ఫలానా తేదీన పుట్టాడని బైబిలు ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఈ కిందున్న రెఫరెన్సులను పరిశీలించండి:

  • “యేసు ఖచ్చితంగా ఏ తేదీన పుట్టాడో ఎవ్వరికీ తెలియదు.”—న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా.

  • “యేసు ఖచ్ఛితంగా ఏ తేదీన పుట్టాడో తెలీదు.”—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఎర్లీ క్రిస్టియానిటీ.

‘యేసు ఎప్పుడు పుట్టాడు?’ అనే ప్రశ్నకు బైబిలు సూటిగా సమాధానం చెప్పకపోయినా, ఆయన పుట్టినప్పుడు జరిగిన రెండు సంఘటనల గురించి అది వివరిస్తుంది. వాటి ఆధారంగా, ఆయన డిసెంబరు 25న పుట్టలేదనే నిర్ధారణకు చాలామంది రాగలిగారు.

చలికాలంలో కాదు

  1. వివరాలు నమోదు చేయించుకోవడం. యేసు పుట్టడానికి కొంచెం ముందు కైసరు ఔగుస్తు “సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని” ఆజ్ఞ జారీ చేశాడు. అందుకోసం అందరూ “తమతమ పట్టణములకు” ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చింది. (లూకా 2:1-3) పన్నులు విధించడానికి, సైన్యంలో చేర్చుకోవడానికి అవసరమైన సమాచారం కోసం కైసరు బహుశా ఆ ఆజ్ఞను జారీ చేసి ఉంటాడు. కానీ అలా ప్రయాణం చేసి వివరాలు నమోదు చేయించుకోవడం ప్రజలకు చాలా కష్టమైన పని. తీవ్రమైన చలికాలంలో అంతంత దూరం ప్రయాణం చేయమని ఔగుస్తు ప్రజలను బలవంతం చేయడమంటే వాళ్లకు కోపం రేపడమే అవుతుంది. కాబట్టి ఔగుస్తు అలాంటి పొరపాటు చేయడు.

  2. గొర్రెలు. ‘గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు.’ (లూకా 2:8) గొర్రెల మందలు “పస్కాకు ఒక వారం ముందు [మార్చి చివర]” నుండి నవంబరు నెల మధ్య వరకు ఆరుబయట ఉండేవని డైలీ లైఫ్‌ ఇన్‌ ద టైమ్‌ ఆఫ్‌ జీసస్‌ అనే పుస్తకం చెప్తుంది. దాంట్లో ఇంకా ఇలా ఉంది, “చలికాలంలో గొర్రెలను పాకలో ఉంచేవాళ్లు; అయితే యేసు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు పొలములో తమ మందలను కాచుకుంటున్నారని బైబిలు చెప్తుంది. కాబట్టి యేసు పుట్టినరోజుగా జరుపుకునే క్రిస్మస్‌ చలికాలంలో రాదని మనం చెప్పవచ్చు.”

శరదృతువు తొలిభాగంలో పుట్టాడు

సా.శ. 33 వసంత ఋతువులో, నీసాను నెల 14 పస్కా పండుగ రోజున యేసు చనిపోయాడు. ఆయన చనిపోయిన రోజు నుండి వెనక్కి లెక్కేయడం ద్వారా యేసు ఎప్పుడు పుట్టి ఉంటాడో మనం అంచనా వేయవచ్చు. (యోహాను 19:14-16) యేసు తన మూడున్నర సంవత్సరాల పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయనకు 30 ఏళ్లు. కాబట్టి ఆయన సా.శ.పూ. 2వ శతాబ్దం శరదృతువు తొలిభాగంలో పుట్టాడని మనకు అర్థమౌతుంది.—లూకా 3:23.

క్రిస్టమస్‌ను డిసెంబరు 25న ఎందుకు జరుపుకుంటున్నారు?

యేసుక్రీస్తు డిసెంబరు 25న పుట్టాడనడానికి ఏ రుజువూ లేనప్పుడు మరి ఆ రోజున క్రిస్మస్‌ ఎందుకు జరుపుకుంటున్నారు? బహుశా చర్చి నాయకులు “అన్యజనులైన రోమన్లు, శీతాకాలపు పండుగగా జరుపుకునే ‘అజేయుడైన సూర్యుని పుట్టిన రోజుతో’ ” ఈ తేదీ కలవాలని ఉద్దేశించి ఆ రోజును ఎంపిక చేసుకొని ఉంటారని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తుంది. అలాగే ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా ప్రకారం, “క్రైస్తవులుగా మారే అన్యులకు క్రైస్తవత్వం మరింత అర్థవంతంగా కనిపించేలా చేయడానికి” అలా చేసి ఉంటారని చాలామంది మేధావులు నమ్ముతున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి