కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 102
  • ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఏం చెప్తుంది
  • ఫ్రెండ్స్‌తో ఒంటరితనానికి చెక్‌ పెట్టండి—బైబిలు ఎలా సహాయం చేస్తుంది
    అదనపు అంశాలు
  • ఒంటరితనం కారుమబ్బుల్లా కమ్మేస్తోంది—మీరు దాన్ని ఎలా తప్పించుకోవచ్చు?
    అదనపు అంశాలు
  • ఒంటరితనం మీ జీవితాన్ని హానికరంగా ప్రభావితం చేయనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఒంటరితనం—దీనితో పోరాడి విజయం సాధించాలని నీవు నిశ్చయించుకున్నావా?
    తేజరిల్లు!—1994
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 102
మిగతా కాగితపు బొమ్మలకు దూరంగా నిలబడ్డ ఒక కాగితపు బొమ్మ.

Francesco Carta fotografo/Moment via Getty Images

ఒంటరితనం గుప్పిట్లో ప్రపంచం—బైబిలు ఏం చెప్తుంది

ప్రతీ నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని ఈ మధ్య ప్రపంచమంతటా జరిగిన ఒక సర్వేలోa తేలింది.

  • “వయసుతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవ్వరినైనా ఒంటరితనం పీడించవచ్చు.”​—చీడో పెంబ, ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సోషల్‌ కనెక్షన్‌ కమిషన్‌ సహ-అధ్యక్షుడు.

ముసలివాళ్లు లేదా సమాజానికి దూరంగా బ్రతికేవాళ్లు మాత్రమే ఒంటరితనంతో బాధపడతారని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు! ఒంటరితనం పిల్లల్ని, యౌవనుల్ని, ఆరోగ్యంగా ఉన్నవాళ్లను, జీవితంలో ఎన్నో సాధించినవాళ్లను, పెళ్లయిన వాళ్లను ఇలా ఎవ్వరినైనా తన గుప్పిట్లోకి తీసుకోగలదు. నలుగురికి దూరంగా ఉంటూ ఒంటరితనంలో మగ్గిపోతున్నవాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, మనసుకు మానని గాయాలు అవుతాయి.

  • ‘ఒంటరితనం అనేది కేవలం మనసు బాలేకపోవడం కాదు. ఒక రోజులో 15 సిగరెట్లు తాగే వ్యక్తి చావుకు ఎంత దగ్గర్లో ఉంటాడో ఒంటరితనంతో బాధపడేవాళ్లు కూడా చావుకు అంతే దగ్గరగా ఉంటారు’ అని U.S. సర్జన్‌ జనరల్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి అన్నాడు.

బైబిలు ఏం చెప్తుంది

మనం నలుగురికి దూరంగా బ్రతకడం మన సృష్టికర్తకు ఇష్టం లేదు. మనసుకు హాయినిచ్చే స్నేహితులతో సంతోషంగా సమయం గడపాలన్నదే దేవుని ఉద్దేశం.

  • బైబిలు సూత్రం: “దేవుడు ఇలా అన్నాడు: ‘మనిషి ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు.’”​—ఆదికాండం 2:18.

మనం తనతో కూడా స్నేహం చేయాలన్నది దేవుని కోరిక. మనం ఆయనకు దగ్గరవ్వడానికి అడుగులు వేస్తే, ఆయన కూడా మనకు దగ్గరౌతానని మాటిస్తున్నాడు.—యాకోబు 4:8.

  • బైబిలు సూత్రం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.”—మత్తయి 5:3.

మనం వేరేవాళ్లతో కలిసి తనను ఆరాధించడం దేవునికి నచ్చుతుంది. చెప్పాలంటే, అలా నలుగురితో కలిసి దేవున్ని ఆరాధించడం మన మనసుకు మందు.

  • బైబిలు సూత్రం: “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు … మానేయకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం.”—హెబ్రీయులు 10:24, 25.

ఒంటరితనానికి ఎదురీదడం ఎందుకు చాలా అవసరమో తెలుసుకోవడానికి “నలుగురితో కలవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా ఎందుకీ ఒంటరితనం?” అనే ఇంగ్లీష్‌ ఆర్టికల్‌ చదవండి.

ఇదే మా ఆహ్వానం!

మన సృష్టికర్తతో స్నేహం అలాగే మన సమాజంలో మంచి బంధాలు పెంచుకోవడానికి యెహోవాసాక్షులు వారంలో రెండుసార్లు కలుసుకుంటారు. మాతో స్నేహం చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం!

  •  మీకు దగ్గర్లో ఉన్న ప్రాంతాన్ని కనుక్కోండి.

  •  మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి.

a The Global State of Social Connections, by Meta and Gallup, 2023.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి