కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mrt ఆర్టికల్‌ 55
  • పాడౌతున్న భూమి—బైబిలు ఏం చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాడౌతున్న భూమి—బైబిలు ఏం చెప్తుంది?
  • అదనపు అంశాలు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పర్యావరణ హాని గురించి బైబిలు ముందే చెప్పింది
  • మన గ్రహానికి ఏమీ కాదు, అది భద్రంగా ఉంటుంది
  • కలవరపెడుతున్న వాతావరణ మార్పుల్ని ప్రభుత్వాలన్నీ కలిసి ఆపగలవా?—బైబిలు ఏం చెప్తోంది?
    అదనపు అంశాలు
  • వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?
    అదనపు అంశాలు
  • ప్రపంచమంతటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు—బైబిలు ఏం చెప్తుంది?
    అదనపు అంశాలు
  • మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు
    తేజరిల్లు!—2023
మరిన్ని
అదనపు అంశాలు
mrt ఆర్టికల్‌ 55
అంతరిక్షంలో నుండి చూస్తే కనిపించే భూగ్రహం. అందులో సగం బాగుంది, మిగతా సగం కాలిపోయినట్టు, పాడైనట్టు కనిపిస్తోంది.

అప్రమత్తంగా ఉండండి!

పాడౌతున్న భూమి—బైబిలు ఏం చెప్తుంది?

“మనం వాతావరణానికి సంబంధించిన వినాశనం వైపు శరవేగంగా దూసుకెళ్తున్నాం. త్వరలో చాలా నగరాలు నీట మునుగుతాయి. ముందెన్నడూ లేనంతగా వడగాలులు వీస్తాయి. భీభత్సమైన తుఫానులు వస్తాయి. చాలా చోట్ల నీటి కొరత ఏర్పడుతుంది. మొక్కల్లో, జంతువుల్లో లక్షల జాతులు అంతరించిపోతాయి. దీన్ని తక్కువచేసి చెప్పట్లేదు, ఎక్కువచేసి చెప్పట్లేదు. ప్రస్తుతం మనం ఇంధనాన్ని లేదా శక్తిని వాడే తీరును బట్టి, రేపు జరగబోయేది ఇదే అని సైన్స్‌ చెప్తోంది.“ —2022, ఏప్రిల్‌ 4న వాతావరణ మార్పులపై ఇంటర్‌గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఇచ్చిన నివేదికను ఉద్దేశించి, ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ-జనరల్‌ ఆంటోన్యో గ్యూటేరెష్‌ ప్రసంగం.

“రాబోయే సంవత్సరాల్లో, వాతావరణ మార్పుల కారణంగా జరిగే వినాశనం దాదాపు [అమెరికాలో ఉన్న] 423 జాతీయ పార్కులన్నిటినీ తాకబోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎక్కువగా పాడయ్యేది ఈ పార్కులే. జరగబోయే విపత్తులు, ఇంచుమించు బైబిల్లో చదివిన వినాశనాల్లాగే ఉన్నాయి: అగ్ని కురవడం, జలప్రళయం, కరిగే మంచు పొరలు, పొంగే సముద్రాలు అలాగే వడగాలులు.”—“ఎల్లోస్టోన్‌లో వరద భీభత్సం, రాబోయే సంక్షోభాలకు సంకేతం,” ద న్యూయార్క్‌ టైమ్స్‌, జూన్‌ 15, 2022.

పర్యావరణ సమస్యలు ఎప్పటికైనా పరిష్కారం అవుతాయా? అలాగైతే, ఎవరు వాటిని పరిష్కరిస్తారు? అసలు బైబిలు ఏం చెప్తుందో చూడండి.

పర్యావరణ హాని గురించి బైబిలు ముందే చెప్పింది

దేవుడు ‘భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేస్తాడని’ బైబిలు చెప్తుంది. (ప్రకటన 11:18) ఈ వచనం నుండి మనం మూడు విషయాలు నేర్చుకోవచ్చు:

  1. 1. మనుషుల పనులు భూమికి ఎంతో హాని చేస్తాయి.

  2. 2. ఆ హానికి లేదా వినాశనానికి ఓ ముగింపు ఉంది.

  3. 3. పర్యావరణ సమస్యల్ని పరిష్కరించేది మనుషులు కాదు, దేవుడే.

మన గ్రహానికి ఏమీ కాదు, అది భద్రంగా ఉంటుంది

“భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది” అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 1:4) దానిమీద మనుషులు ఎప్పుడూ నివాసం ఉంటారు.

  • “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:29.

దేవుడు మన భూగ్రహాన్ని పూర్తిగా బాగుచేస్తాడు.

  • “ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి, ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.”—యెషయా 35:1.

దేవుడు మన భూగ్రహాన్ని కాపాడతాడని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవడానికి, “భూమిని ఎవరు కాపాడతారు?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చదవండి.

వాతావరణం ఇంతగా పాడౌతున్నా మన భవిష్యత్తు బాగుంటుందని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చో తెలుసుకోవడానికి, “వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

పర్యావరణ సమస్యల్ని తట్టుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేయగలదో తెలుసుకోవడానికి, “విపరీత వాతావరణంతో తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదా?” అనే ఆర్టికల్‌ చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి