కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 1 పేజీలు 8-9
  • దేవుడు అన్నీ ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు అన్నీ ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • ప్రార్థన చేయడం ఏమైనా మంచిని చేకూర్చగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 1 పేజీలు 8-9

దేవుడు అన్నీ ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వడు?

మన పరలోక తండ్రైన యెహోవా దేవునికి మనం మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు వినడమంటే ఎంతో ఇష్టం. అవి ఆయనకు సంతోషాన్నిస్తాయి. కానీ దేవుడు అన్నీ ప్రార్థనలకు జవాబివ్వడు, ఎందుకలా? మనం ప్రార్థించేటప్పుడు ఏ విషయాల్ని మనసులో పెట్టుకోవాలి? ఇప్పుడు బైబిలిచ్చే కొన్ని సలహాల్ని చూద్దాం.

చర్చి సభ్యులు ఒక ప్రార్థన పుస్తకం చూస్తూ ప్రార్థనను బయటికి చదువుతున్నారు.

“నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, . . . చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు.”—మత్తయి 6:7.

మనం కంఠస్థం చేసి ప్రార్థన చేయడం లేదా పుస్తకాన్ని చూస్తూ ప్రార్థనను చదవడం లాంటిది చేస్తే యెహోవాకు ఇష్టం ఉండదు. బదులుగా, మనం హృదయంలో నుండి మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి ఇలా ఊహించుకోండి, మీ స్నేహితుడు మీ దగ్గరకు వచ్చి ప్రతీరోజు ఒకేలాంటి మాటల్ని పదేపదే చెప్తూ ఉంటే మీకెలా అనిపిస్తుంది? చిరాకొస్తుంది కదా! మంచి స్నేహితులు నిజాయితీగా మనసువిప్పి మాట్లాడుకుంటారు. అలాగే, మనం సొంత మాటల్లో ప్రార్థించినప్పుడు మన పరలోక తండ్రిని ఒక స్నేహితునిలా భావిస్తున్నామని చూపిస్తాం.

లాటరీ టికెట్‌ గీకుతూ పైకి చూస్తున్న ఒక వ్యక్తి.

“ఒకవేళ మీరు అడిగినా, మీరు వాటిని పొందట్లేదు. ఎందుకంటే, మీరు . . . దురుద్దేశంతో అడుగుతున్నారు.”—యాకోబు 4:3.

దేవుడు వద్దన్న వాటిని చేయడం గానీ కోరుకోవడం గానీ చేస్తూ, వాటిని దీవించమని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలకు ఆయన జవాబివ్వడని మనకు తెలుసు. ఉదాహరణకు, అత్యాశ చూపించడం లేదా అదృష్టాన్ని నమ్మడం తప్పని యెహోవా చెప్తున్నాడు. అలాంటప్పుడు జూదం ఆడే ఒక వ్యక్తి, డబ్బును గెలుచుకునే అదృష్టాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తే, దానికి ఆయన జవాబిస్తాడా? (యెషయా 65:11; లూకా 12:15) అలాంటి ప్రార్థనలకు యెహోవా జవాబివ్వాలని కోరుకోవడం అస్సలు సరైనది కాదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబివ్వాలంటే, మనం అడిగేవి బైబిల్లో ఆయన కోరేవాటికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

సైనికుల గుంపు కోసం ప్రార్థిస్తున్న ఒక మతనాయకుడు.

“ధర్మశాస్త్రాన్ని వినడానికి ఇష్టపడనివాళ్ల ప్రార్థన అసహ్యం.”—సామెతలు 28:9.

బైబిలు కాలాల్లో, కొంతమంది దేవుని నీతి ప్రమాణాలకు లోబడలేదు. అలాంటి వాళ్లు చేసే ప్రార్థనలకు ఆయన జవాబివ్వలేదు. (యెషయా 1:15, 16) ఆయన ఇప్పటికి అలాగే ఆలోచిస్తున్నాడు. (మలాకీ 3:6) దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వాలంటే ఆయనిచ్చిన ఆజ్ఞలకు ఎప్పుడూ లోబడడానికి కృషి చేయాలి. మనం గతంలో తప్పులు చేస్తే అప్పుడేంటి? యెహోవా మన ప్రార్థనల్ని ఇంకెప్పుడూ వినడా? అస్సలు కాదు! మనం మన జీవితాన్ని మార్చుకుని దేవుణ్ణి సంతోషపెట్టడానికి కృషి చేస్తే ఆయన ప్రేమతో మనల్ని క్షమిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 3:19.

“దేవుని దగ్గరికి వచ్చేవాళ్లు ఆయన ఉన్నాడని, తనను మనస్ఫూర్తిగా వెదికేవాళ్లకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని తప్పకుండా నమ్మాలి.”—హెబ్రీయులు 11:6.

ఒకామె బైబిలు చదువుతుంది.

ప్రార్థన కేవలం మన ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసేది కాదు. బదులుగా, దేవుణ్ణి నమ్ముతున్నామని, ఆయన పట్ల ప్రేమ గౌరవాలు ఉన్నాయని చూపించడానికి ప్రార్థిస్తాం. యాకోబు అనే ఒక శిష్యుడు బైబిల్లో ఏం చెప్పాడంటే, మనం విశ్వాసంతో అడుగుతూ ఉండకపోతే “యెహోవా నుండి ఏదైనా దొరుకుతుందని ఆశపడకూడదు.” (యాకోబు 1:6, 7) దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి, అందుకోసం సమయాన్ని, శక్తిని వెచ్చించి బైబిల్ని అధ్యయనం చేయాలి. అలా చేసినప్పుడు ఆయన ఇష్టాన్ని తెలుసుకోగలుగుతాం అలాగే మరింత నమ్మకంతో ఆయనకు ప్రార్థించగలుగుతాం.

ఆశ వదులుకోకండి!

దేవుడు అన్నీ ప్రార్థనలకు జవాబివ్వడు అనేది నిజమే అయినా, లక్షలమంది నిజాయితీగా చేసే ప్రార్థనల్ని మాత్రం ఆయన వింటున్నాడు, వాటికి జవాబిస్తున్నాడు. దేవుడు ఇష్టపడేవిధంగా ప్రార్థించాలంటే మీరేం చేయాలో తెలుసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది. దాని గురించి తర్వాత చూద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి