కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w20 మే పేజీలు 8-11
  • అంత్యకాలంలో శత్రు రాజులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అంత్యకాలంలో శత్రు రాజులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • అంత్యకాలంలో “ఉత్తర రాజు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • “త్వరలో సంభవింపనైయున్న” వాటిని యెహోవా బయలుపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • నేడు “ఉత్తర రాజు” ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • ప్రపంచ మహాధిపత్యముల దీర్ఘకాల ప్రభావము అంతమగుటకు సమీపించినది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
w20 మే పేజీలు 8-11

అంత్యకాలంలో శత్రు రాజులు

ఈ చార్టులోని కొన్ని ప్రవచనాలు ఒకే కాలంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతున్నాయి. ఆ సంఘటనలన్నీ, మనం ‘అంత్యకాలంలో’ జీవిస్తున్నామని నిరూపిస్తున్నాయి.—దాని. 12:4.

వివిధ ప్రవచనాల్ని, అలాగే 1870 నుండి నేటి వరకు తెర మీదికి వచ్చిన ఉత్తర, దక్షిణ రాజుల వివరాల్ని తెలిపే చార్టు.
  • చార్టులోని మొదటి భాగంలో, అంత్యకాలంలో నెరవేరే కొన్ని ప్రవచనాలు, అంటే 1870-1918 మధ్యకాలంలో నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి. 1914 నుండి అంత్యకాలం మొదలైందని మనం అర్థం చేసుకున్నాం. 1వ ప్రవచనం: చార్టులో సూచించిన కాలం కన్నా ముందు నుండే ఉనికిలో ఉన్న ఏడు తలల క్రూరమృగం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో దాని ఏడో తలకు చావు దెబ్బ తగిలింది. 1917 నుండి ఆ దెబ్బ మానిపోయి, క్రూరమృగం కోలుకుంది. 2వ ప్రవచనం: ఉత్తర రాజును 1871లో, దక్షిణ రాజును 1870 లో గుర్తించగలిగాం. 1871 లో ఉనికిలోకి వచ్చిన కొత్త ఉత్తర రాజు జర్మనీ. మొదట్లో దక్షిణ రాజుగా గ్రేట్‌ బ్రిటన్‌ ఉన్నప్పటికీ, 1917 నుండి ఆ పాత్రను ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం పోషించింది. 3వ ప్రవచనం: 1870 నుండి సి. టి. రస్సెల్‌, ఆయన సహచరులు బైబిలు ప్రవచించిన ‘సందేశకునిగా’ పనిచేశారు. 1881 నుండి ‘జాయన్స్‌ వాచ్‌ టవర్‌’ మంచివార్త ప్రకటించమని పాఠకుల్ని ప్రోత్సహించింది. 4వ ప్రవచనం: 1914 నుండి కోతకాలం మొదలైంది. గోధుమల నుండి గురుగులు వేరుచేయబడ్డాయి. 5వ ప్రవచనం: 1917 నుండి ఇనుము, బంకమట్టి కలిసిన పాదాలు సూచిస్తున్న రాజ్యం తెర మీదికి వచ్చింది. చార్టులో ఈ వివరాలు కూడా ఉన్నాయి: 1914-1918 మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. యెహోవా ప్రజలపై ప్రభావం చూపించిన సంఘటనలు: 1914-1918 మధ్యకాలంలో బ్రిటన్‌, జర్మనీ దేశాల్లో బైబిలు విద్యార్థుల్ని జైల్లో వేశారు. 1918 లో, అమెరికాలో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని బాధ్యతగల సహోదరుల్ని జైల్లో వేశారు.
    1వ ప్రవచనం.

    లేఖనాలు: ప్రక. 11:7; 12:13, 17; 13:1-8, 12

    ప్రవచనం: “క్రూరమృగం” ఎన్నో శతాబ్దాల పాటు ప్రజల్ని పరిపాలిస్తుంది. అంత్యకాలంలో దాని ఏడో తలకు చావు దెబ్బ తగులుతుంది. తర్వాత ఆ దెబ్బ మానిపోతుంది, “భూమ్మీదున్న ప్రజలందరూ” ఆ క్రూరమృగాన్ని అనుసరిస్తారు. ‘స్త్రీ సంతానంలో మిగిలినవాళ్లతో యుద్ధం చేయడానికి’ సాతాను ఆ క్రూరమృగాన్ని ఉపయోగించుకుంటాడు.

    నెరవేర్పు: జలప్రళయం తర్వాత, యెహోవాను వ్యతిరేకించే ప్రభుత్వాలు మనుషుల్ని పరిపాలించాయి. చాలా శతాబ్దాల తర్వాత, అంటే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్‌ సామ్రాజ్యానికి చావుదెబ్బ తగిలి అధికారాన్ని చాలామట్టుకు కోల్పోయింది. అమెరికాతో చేతులు కలిపాక అది మళ్లీ బలం పుంజుకుంది. సాతాను మరిముఖ్యంగా ఈ అంత్యకాలంలో, దేవుని ప్రజల్ని హింసించడానికి తన గుప్పిట్లో ఉన్న రాజకీయ వ్యవస్థ అంతటినీ ఉపయోగించుకుంటున్నాడు.

  • 2వ ప్రవచనం.

    లేఖనాలు: దాని. 11:25-45

    ప్రవచనం: అంత్యకాలంలో ఉత్తర రాజుకు, దక్షిణ రాజుకు మధ్య పోరాటం జరుగుతుంది.

    నెరవేర్పు: జర్మనీ, ఆంగ్లో-అమెరికా మధ్య యుద్ధం జరిగింది. 1945 లో సోవియట్‌ యూనియన్‌-దానికి మద్దతిచ్చిన దేశాలు ఉత్తర రాజు అయ్యాయి. 1991 లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అయ్యింది. కొంతకాలానికి రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు ఉత్తర రాజు అయ్యాయి.

  • 3వ ప్రవచనం.

    లేఖనాలు: యెష. 61:1; మలా. 3:1; లూకా 4:18

    ప్రవచనం: మెస్సీయ రాజ్యం స్థాపించబడడానికి ముందు యెహోవా ఒక “సందేశకుణ్ణి” పంపి, “మార్గాన్ని సిద్ధం చేస్తాడు.” ఆ సందేశకుడు ‘సాత్వికులకు మంచివార్త ప్రకటిస్తాడు.’

    నెరవేర్పు: 1870 మొదలుకొని సి. టి. రస్సెల్‌, ఆయన సహచరులు దేవుని వాక్యంలోని సత్యాల్ని కనుగొనడానికి బైబిల్ని లోతుగా అధ్యయనం చేశారు. దేవుని సేవకులందరూ ప్రకటనా పని చేయడం చాలా ముఖ్యమని వాళ్లు 1881 లో గుర్తించారు. “1000 మంది సువార్తికులు కావాలి,” “ప్రకటించడానికి అభిషేకించబడ్డాం” వంటి ఆర్టికల్స్‌ను వాళ్లు ప్రచురించారు.

  • 4వ ప్రవచనం

    లేఖనాలు: మత్త. 13:24-30, 36-43

    ప్రవచనం: ఒక మనిషి పొలంలో గోధుమల్ని విత్తుతాడు. తర్వాత శత్రువు వచ్చి ఆ పొలంలో గురుగుల్ని నాటుతాడు. ఆ గురుగులు విపరీతంగా పెరిగిపోయి, గోధుమల్ని కప్పేస్తాయి. కోత కాలంలో గోధుమలు, గురుగులు వేరుచేయబడతాయి.

    నెరవేర్పు: 1870 నుండి నిజ క్రైస్తవులకు, అబద్ధ క్రైస్తవులకు మధ్య తేడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. అంత్యకాలంలో, అబద్ధ క్రైస్తవుల మధ్య నుండి నిజ క్రైస్తవులు వేరుచేయబడి ఒక సంఘంగా సమకూర్చబడ్డారు.

  • 5వ ప్రవచనం.

    లేఖనాలు: దాని. 2:31-33, 41-43

    ప్రవచనం: వేర్వేరు లోహాలు గల భారీ ప్రతిమ పాదాలు కొంతభాగం ఇనుపవి, కొంతభాగం బంకమట్టివి.

    నెరవేర్పు: బంకమట్టి, ఆంగ్లో-అమెరికా పరిపాలన కిందున్న సామాన్య ప్రజల్ని సూచిస్తుంది. అయితే ప్రజలు ఎదురుతిరగడం వల్ల ఈ ప్రపంచాధిపత్యానికి ఇనుముకు ఉండాల్సినంత బలం ఉండదు.

  • చార్టులోని రెండో భాగంలో, అంత్యకాలంలో నెరవేరే కొన్ని ప్రవచనాలు, అంటే 1919-1945 మధ్యకాలంలో నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి. 1945 వరకు జర్మనీ ఉత్తర రాజుగా ఉంది. ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం దక్షిణ రాజుగా ఉంది. 6వ ప్రవచనం: 1919 లో శుద్ధీకరించబడిన సంఘంలోకి అభిషిక్త క్రైస్తవులు సమకూర్చబడ్డారు. 1919 నుండి ప్రకటనా పని ఊపందుకుంది. 7వ ప్రవచనం: 1920 లో నానాజాతి సమితి స్థాపించబడింది, అది రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే వరకు చురుగ్గా పనిచేసింది. చార్టులో ఈ వివరాలు కూడా ఉన్నాయి: 1వ ప్రవచనంలో చెప్పబడిన ఏడు తలల క్రూరమృగం ఇంకా సజీవంగా ఉంది. 5వ ప్రవచనంలో చెప్పబడిన ఇనుము, బంకమట్టి కలిసిన పాదాలను సూచిస్తున్న రాజ్యం ఇంకా అధికారంలో ఉంది. 1939-1945 మధ్యకాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. యెహోవా ప్రజలపై ప్రభావం చూపించిన సంఘటనలు: 1939-1945 మధ్యకాలంలో, జర్మనీలో 11,000 కన్నా ఎక్కువమంది సాక్షుల్ని జైల్లో వేశారు. 1939-1945 మధ్యకాలంలో, బ్రిటన్‌లో దాదాపు 1,600 మంది సాక్షుల్ని జైల్లో వేశారు. 1940-1944 మధ్యకాలంలో, అమెరికాలో సాక్షుల మీద 2,500 కన్నా ఎక్కువ దాడులు జరిగాయి.
    6వ ప్రవచనం.

    లేఖనాలు: మత్త. 13:30; 24:14, 45; 28:19, 20

    ప్రవచనం: ‘గోధుమలు గోదాములోకి సమకూర్చబడతాయి;’ ‘ఇంట్లోని సేవకుల మీద నమ్మకమైన, బుద్ధిగల దాసుడు’ నియమించబడతాడు. “రాజ్య సువార్త భూమంతటా” ప్రకటించబడడం మొదలౌతుంది.

    నెరవేర్పు: 1919 లో దేవుని ప్రజల మీద నమ్మకమైన దాసుడు నియమించబడ్డాడు. అప్పటినుండి బైబిలు విద్యార్థులు ప్రకటనా పనిని మరింత విస్తృతంగా చేస్తున్నారు. నేడు యెహోవాసాక్షులు 200 కన్నా ఎక్కువ దేశాల్లో ప్రకటిస్తున్నారు; 1,000 కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు ప్రచురణలు తయారు చేస్తున్నారు.

  • 7వ ప్రవచనం.

    లేఖనాలు: దాని. 12:11; ప్రక. 13:11, 14, 15

    ప్రవచనం: రెండు కొమ్ములు గల క్రూరమృగం, “మొదటి క్రూరమృగపు ప్రతిమను” తయారు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత అది ఆ ప్రతిమకు ‘ఊపిరి పోస్తుంది.’

    నెరవేర్పు: ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం నానాజాతి సమితిని స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. మిగతా దేశాలు కూడా నానాజాతి సమితికి మద్దతిచ్చాయి. 1926-1933 వరకు ఉత్తర రాజు కూడా నానాజాతి సమితికి మద్దతిచ్చాడు. దేవుని రాజ్యం మాత్రమే తీసుకురాగల ప్రపంచ శాంతిని నానాజాతి సమితి తీసుకొస్తుందని ప్రజలు నమ్మారు. నానాజాతి సమితి స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి విషయంలో కూడా ప్రజలు అదే నమ్మకంతో ఉన్నారు.

  • చార్టులోని మూడో భాగంలో, అంత్యకాలంలో నెరవేరే కొన్ని ప్రవచనాలు, అంటే 1945-1991 మధ్యకాలంలో నెరవేరిన ప్రవచనాలు ఉన్నాయి. 1991 వరకు, సోవియట్‌ యూనియన్‌-దానికి మద్దతిచ్చిన దేశాలు ఉత్తర రాజుగా ఉన్నాయి. ఆ తర్వాత, రష్యా-దానికి మద్దతిచ్చిన దేశాలు ఉత్తర రాజుగా మారాయి. ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం దక్షిణ రాజుగా ఉంది. 8వ ప్రవచనం: అణు బాంబు పేలడం వల్ల పుట్టగొడుగు ఆకారంలో ఏర్పడిన మేఘం. అది ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం వల్ల కలిగిన ఘోరమైన నాశనాన్ని సూచిస్తుంది. 9వ ప్రవచనం: నానాజాతి సమితి స్థానంలో 1945 లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. చార్టులో ఈ వివరాలు కూడా ఉన్నాయి: 1వ ప్రవచనంలో చెప్పబడిన ఏడు తలల క్రూరమృగం ఇంకా సజీవంగా ఉంది. 5వ ప్రవచనంలో చెప్పబడిన ఇనుము, బంకమట్టి కలిసిన పాదాలను సూచిస్తున్న రాజ్యం ఇంకా అధికారంలో ఉంది. 6వ ప్రవచనంలో చెప్పబడినట్టు ప్రచారకుల సంఖ్య ఎక్కువైంది. 1945 నాటికి ఆ సంఖ్య 1,56,000 దాటింది. 1991 నాటికి ఆ సంఖ్య 42,78,000 దాటింది. యెహోవా ప్రజలపై ప్రభావం చూపించిన సంఘటనలు: 1945-1951 మధ్యకాలంలో, సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం వేలమంది సాక్షుల్ని సైబీరియాకు బందీలుగా పంపింది.
    8వ ప్రవచనం.

    లేఖనాలు: దాని. 8:23, 24

    ప్రవచనం: భీకరంగా కనిపించే ఒక రాజు ‘ఘోరమైన నాశనాన్ని కలగజేస్తాడు.’

    నెరవేర్పు: ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం ఎంతోమంది ప్రాణాల్ని బలి తీసుకుంది, చాలా విధ్వంసాన్ని సృష్టించింది. ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, బ్రిటన్‌-అమెరికాల శత్రుదేశం మీద అమెరికా రెండు అణు బాంబులు వేసింది. దానివల్ల ఘోరమైన నాశనం కలిగింది.

  • 9వ ప్రవచనం.

    లేఖనాలు: దాని. 11:31; ప్రక. 17:3, 7-11

    ప్రవచనం: పది కొమ్ములు ఉన్న ఎర్రని క్రూరమృగం అగాధం నుండి పైకి వస్తుంది, అది ఎనిమిదో రాజు అవుతుంది. దానియేలు పుస్తకం ఈ ఎనిమిదో రాజును “నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు” అని వర్ణిస్తోంది.

    నెరవేర్పు: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నానాజాతి సమితి నిష్క్రియా స్థితిలోకి వెళ్లిపోయింది. యుద్ధం తర్వాత దాని స్థానంలో ఐక్యరాజ్య సమితి ‘నిలబెట్టబడింది.’ నానాజాతి సమితి స్థానంలో వచ్చిన ఐక్యరాజ్య సమితి, దేవుని రాజ్యం మాత్రమే తీసుకురాగల ప్రపంచ శాంతిని తీసుకొస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఐక్యరాజ్య సమితి మతం మీద దాడిచేస్తుంది.

  • చార్టులోని నాలుగో భాగంలో, అంత్యకాలంలో నెరవేరే ప్రవచనాలు, అంటే ఇప్పటి నుండి హార్‌మెగిద్దోను యుద్ధం జరిగేవరకు నెరవేరే ప్రవచనాలు ఉన్నాయి. రష్యా-దానికి మద్దతిచ్చే దేశాలు ఉత్తర రాజుగా ఉన్నాయి. ఆంగ్లో-అమెరికన్‌ ప్రపంచాధిపత్యం దక్షిణ రాజుగా ఉంది. 10వ ప్రవచనం: “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని ప్రపంచ నాయకులు ప్రకటన చేస్తారు. తర్వాత మహాశ్రమ మొదలౌతుంది. 11వ ప్రవచనం: ఐక్యరాజ్య సమితి అబద్ధమత సామ్రాజ్యం మీద దాడిచేస్తుంది. 12వ ప్రవచనం: ప్రభుత్వాలు దేవుని ప్రజల మీద దాడిచేస్తాయి. మిగిలిన అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి సమకూర్చబడతారు. 13వ ప్రవచనం: హార్‌మెగిద్దోను. తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి తన విజయాన్ని పూర్తిచేస్తాడు. ఏడు తలల క్రూరమృగం నాశనం చేయబడుతుంది; ఆ భారీ ప్రతిమకున్న ఇనుము, బంకమట్టి కలిసిన పాదాలు నలగ్గొట్టబడతాయి. చార్టులో ఈ వివరాలు కూడా ఉన్నాయి: 1వ ప్రవచనంలో చెప్పబడిన ఏడు తలల క్రూరమృగం హార్‌మెగిద్దోను వరకు సజీవంగా ఉంటుంది. 5వ ప్రవచనంలో చెప్పబడిన ఇనుము, బంకమట్టి కలిసిన పాదాలను సూచిస్తున్న రాజ్యం హార్‌మెగిద్దోను వరకు అధికారంలో ఉంటుంది. 6వ ప్రవచనం చెప్తున్నట్టు ప్రచారకుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. నేడు ప్రచారకుల సంఖ్య 86,80,000 దాటింది. యెహోవా ప్రజలపై ప్రభావం చూపించిన సంఘటనలు: 2017 లో రష్యాలో, అధికారులు సాక్షుల్ని జైల్లో వేశారు, బ్రాంచి భవనాల్ని స్వాధీనం చేసుకున్నారు.
    10, 11 ప్రవచనాలు.

    లేఖనాలు: 1 థెస్స. 5:3; ప్రక. 17:16

    ప్రవచనం: “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని దేశాలు ప్రకటన చేస్తాయి. “పది కొమ్ములు,” అలాగే “క్రూరమృగం” కలిసి “వేశ్య” మీద దాడిచేసి, దాన్ని నాశనం చేస్తాయి. తర్వాత దేశాలు నాశనం చేయబడతాయి.

    నెరవేర్పు: ప్రపంచమంతటా శాంతి, భద్రతలు నెలకొల్పామని దేశాలు చెప్పుకుంటాయి. తర్వాత, ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న దేశాలు అబద్ధమత సంస్థల్ని నాశనం చేస్తాయి. మహాశ్రమ మొదలైంది అనడానికి అది ఒక సూచన. యేసు హార్‌మెగిద్దోనులో, సాతాను వ్యవస్థలోని మిగతా భాగాన్ని నాశనం చేసినప్పుడు ఆ మహాశ్రమ ముగుస్తుంది.

  • 12వ ప్రవచనం.

    లేఖనాలు: యెహె. 38:11, 14-17; మత్త. 24:31

    ప్రవచనం: దేవుని ప్రజల దేశం మీద గోగు దాడి చేస్తాడు. తర్వాత, “ఎంచుకున్న వాళ్లను” దూతలు సమకూరుస్తారు.

    నెరవేర్పు: ఉత్తర రాజు, మిగతా దేశాల ప్రభుత్వాలతో కలిసి దేవుని ప్రజల మీద దాడి చేస్తాడు. ఈ దాడి మొదలైన తర్వాత, మిగిలిన అభిషిక్త క్రైస్తవులు పరలోకానికి సమకూర్చబడతారు.

  • 13వ ప్రవచనం.

    లేఖనాలు: యెహె. 38:18-23; దాని. 2:34, 35, 44, 45; ప్రక. 6:2; 16:14, 16; 17:14; 19:20

    ప్రవచనం: ‘తెల్లని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి’ గోగును, అతని సైన్యాన్ని నాశనం చేయడం ద్వారా “తన విజయాన్ని” పూర్తి చేస్తాడు. ‘ఆ క్రూరమృగం అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడుతుంది.’ ఒక రాయి భారీ ప్రతిమను నాశనం చేస్తుంది.

    నెరవేర్పు: దేవుని ప్రజల్ని కాపాడడానికి దేవుని రాజ్యానికి రాజైన యేసు వస్తాడు. 1,44,000 మంది సహపరిపాలకులతో, పరలోక సైన్యంతో కలిసి యేసు గోగును, అంటే దేశాల గుంపును నాశనం చేస్తాడు. దాంతో సాతాను లోకం అంతమౌతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి