కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb20 జూలై పేజీ 7
  • యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఏం చెప్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • మారణహోమానికి ప్రత్యక్ష నిదర్శనం
    తేజరిల్లు!—1994
  • మీరు “అదృశ్యుడైనవానిని” చూస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • దేవుని వాక్యాన్ని భద్రపర్చడానికి చేసిన ప్రయత్నాల్ని చూపించే బెల్జియం బ్రాంచి బైబిలు మ్యూజియం
    అదనపు అంశాలు
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
mwb20 జూలై పేజీ 7

మన క్రైస్తవ జీవితం

యెహోవా తన ప్రజల్ని కాపాడతాడు

ఇశ్రాయేలీయుడైన ఒక తండ్రి తన కొడుకుతో కలిసి రక్తాన్ని తమ ఇంటి ద్వారాలకు పూస్తున్నాడు.

మొదటి పస్కా, చాలా ప్రాముఖ్యమైన ఒక సంఘటన. ఆ రోజు రాత్రి తన మొదటి సంతానం చనిపోయిందని ఫరో తెలుసుకున్నప్పుడు మోషేతో ఇలా అన్నాడు: “లెండి, మీరూ మిగతా ఇశ్రాయేలీయులూ నా ప్రజల మధ్య నుండి వెళ్లిపోండి. మీరు అడిగినట్టే వెళ్లి యెహోవాను సేవించండి.” (నిర్గ 12:31) తన ప్రజల్ని కాపాడతానని యెహోవా అప్పుడు రుజువు చేశాడు.

యెహోవా తన ప్రజల్ని ఇంకా నిర్దేశిస్తూ, కాపాడుతూ ఉన్నాడని వాళ్ల ఆధునికకాల చరిత్ర స్పష్టం చేస్తుంది. ఆ విషయాన్నే ప్రపంచ ప్రధాన కార్యాలయంలోని “యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలు” అనే అంశం ఉన్న మ్యూజియంలో చూడవచ్చు.

వార్విక్‌ మ్యూజియం టూర్‌లు: “యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలు” వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ‘ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌’ పోస్టరు అలాగే స్లైడ్లు

    బైబిలు మీద విశ్వాసం పెంచడానికి బైబిలు విద్యార్థులు 1914 మొదలుకొని ఏ కొత్త పరికరాన్ని ఉపయోగించారు? దానివల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?

  • 1918 లో అరెస్టు అయ్యి, జైలుపాలైన సహోదరుల చిన్న ఫోటోలు.

    1916 లో అలాగే 1918 లో ఏ పరీక్షలు వచ్చాయి? యెహోవా తన సంస్థను నిర్దేశిస్తున్నాడు అనడానికి ఎలాంటి రుజువులు కనిపించాయి?

  • తమ విశ్వాసం కారణంగా జైలుపాలైన చాలామంది ఫోటోల్ని ప్రదర్శిస్తున్న ఒక మ్యూజియం గ్యాలరీ. తలుపులు తెరుచుకొని పరదైసును తలపించే గదిలోకి దారి చూపిస్తున్నాయి.

    వ్యతిరేకత వచ్చినా యెహోవా ప్రజలు తమ విశ్వాసంలో ఎలా స్థిరంగా నిలబడ్డారు?

  • 1930ల్లో అలాగే 1940ల్లో ప్రీచింగ్‌ చేయడానికి ఉపయోగించిన కొన్ని వస్తువుల్ని చూపిస్తున్న ఒక మ్యూజియం గ్యాలరీ.

    1935 లో యెహోవా ప్రజలు ఏ కొత్త అవగాహన పొందారు? అది వాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపించింది?

  • ఈ వీడియోలో చూసిన ఏ విషయాన్ని బట్టి యెహోవా తన ప్రజల్ని నిర్దేశిస్తున్నాడనే, కాపాడుతున్నాడనే మీ నమ్మకం బలపడింది?

ఈ మ్యూజియంకు వెళ్లాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి, jw.org® వెబ్‌సైట్‌లో “మా గురించి” కింద “కార్యాలయాలు & టూర్‌లు” మీద క్లిక్‌ చేయండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి