అశ్వికదళం చేసే దాడిలో మీరూ ఉన్నారు
1, 2. ప్రకటన 9:13-19లో నమోదు చేయబడిన ప్రవచనార్థక దర్శన నెరవేర్పులో నేడు దేవుని సేవకులు ఎలా భాగమై ఉన్నారు?
1 ‘ఆరవ దూత తన బూర ఊదాడు.’ ఆ వెంటనే ‘ఇరువది కోట్ల గుఱ్ఱపురౌతుల సైన్యాలు’ ముందుకు ఉరికాయి. ఇది సామాన్య సైనిక దళం కాదు. “ఆ గుఱ్ఱముల తలలు సింహపు తలలవంటివి.” వాటి నోళ్లలోనుండి అగ్ని ధూమగంధకములు బయలువెడలుతున్నాయి, “వాటి తోకలు పాములవలె” ఉన్నాయి. ఈ సూచనార్థక అశ్వికదళం దాడివల్ల విధ్వంసం కలుగుతుంది. (ప్రక. 9:13-19) గగుర్పాటు కలిగించే ఈ ప్రవచనార్థక దర్శన నెరవేర్పులో మీరెలా భాగమై ఉన్నారో మీకు తెలుసా?
2 అభిషిక్తుల శేషం, వారి సహవాసులైన వేరే గొర్రెలు ఐక్యంగా దేవుని తీర్పులు ప్రకటిస్తున్నారు. దీని ఫలితంగా క్రైస్తవమత సామ్రాజ్య ఆధ్యాత్మిక మృత స్థితి పూర్తిగా వెల్లడైంది. దేవుని సేవకుల పరిచర్య ఎందుకంత ప్రభావవంతంగా ఉందో నొక్కిచెప్పే ప్రవచనార్థక దర్శనానికి సంబంధించిన రెండు అంశాలను మనం పరిశీలిద్దాం.
3. దేవుని సందేశం గురించి సమర్థవంతంగా మాట్లాడేందుకు మీరెలాంటి శిక్షణ పొందారు?
3 దేవుని సందేశం ప్రకటించడానికి శిక్షణ ఇవ్వబడి సన్నద్ధం చేయబడ్డారు: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, ఇతర సంఘ కూటాల ద్వారా దేవుని పరిచారకులు దేవుని సందేశాన్ని అధికారపూర్వకంగా మాట్లాడేందుకు శిక్షణ పొందారు. వారు యేసును, ఆయన అనుచరులను అనుకరిస్తూ ప్రజలెక్కడ ఉంటే అక్కడ ప్రకటిస్తూ సరైన మనోవైఖరిగల వారి కోసం అన్వేషించడానికి వెళ్తున్నారు. (మత్త. 10:11; మార్కు 1:16; లూకా 4:15; అపొ. 20:18-20, NW) ఈ బైబిలు ఆధారిత ప్రకటనా విధానం ఎంత ఫలవంతమైనదిగా నిరూపించబడిందో గదా!
4. తమ సేవ కొనసాగించడానికి అనేకమంది ప్రచారకులకు ఎలాంటి సామగ్రి అందుబాటులో ఉంది?
4 ప్రకటించే ఈ దైవిక ఆజ్ఞను నెరవేర్చడంలో క్రైస్తవ పరిచారకులు కోట్లకొలది బైబిళ్లను, పుస్తకాలను, బ్రోషుర్లను, పత్రికలను అందించారు. అనేక విధాలైన అంశాలతో, వివిధ రకాల ప్రజలను ఆకట్టుకునే పద్ధతులు ఉపయోగిస్తూ తయారు చేయబడిన ఈ సాహిత్యాలు దాదాపు 400 భాషల్లో అందించబడ్డాయి. ఈ ఉపకరణాలను మీరు ఫలవంతంగా ఉపయోగిస్తున్నారా?
5, 6. యెహోవా ప్రజలకు పరలోక మద్దతు ఉందని ఏది సూచిస్తోంది?
5 పరలోక నిర్దేశం మరియు మద్దతు: సూచనార్థక అశ్వికదళపు దాడికి ప్రతీకగా ఉన్న కార్యకలాపానికి దైవిక మద్దతు ఉందని కూడా ఆ ప్రవచనార్థక దర్శనం స్పష్టం చేసింది. (ప్రక. 9:13-15) ఈ భౌగోళిక ప్రకటనా పని మానవ జ్ఞానంతో లేదా శక్తితో కాదుగానీ దేవుని ఆత్మచేతనే నెరవేర్చబడుతోంది. (జెక. 4:6) ఈ పనిని నిర్దేశించడానికి యెహోవా దేవదూతలను ఉపయోగిస్తున్నాడు. (ప్రక. 14:6) ఆ విధంగా, మానవ సాక్షుల కృషితో దీనులను తనవైపు ఆకర్షించుకునేందుకు యెహోవా పరలోక మద్దతు అనుగ్రహిస్తున్నాడు.—యోహా. 6:45, 65.
6 దేవుని సందేశం ప్రకటించడానికి శిక్షణ పొంది సన్నద్ధం చేయబడిన, అలాగే దేవదూతల నిర్దేశం క్రింద పనిచేస్తున్న యెహోవా ప్రజలకు తిరుగులేదు. ఈ ఉత్కంఠభరితమైన ప్రవచన దర్శన నెరవేర్పులో మనం నిరంతరం మనవంతు మనం చేద్దాము.