సృష్టికర్త పుస్తకాన్ని మనం ప్రతిపాదిద్దామా?
మీపట్ల శ్రద్ధవహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) పుస్తకాన్ని పొందినందుకు గత సంవత్సరం మనమందరం ఆనందించాము. ఈ పుస్తకం, లౌకిక విషయాల్లో ఎంతో విద్యావంతులైనా దేవుని యందు నమ్మకముంచని వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పుస్తకం, అంతకంతకూ పెరుగుతున్న అవసరాలన్నీ తీరుస్తుంది.
ఆచరణాత్మక కారణాలను బట్టి నెలసరి సాహిత్య ప్రతిపాదనలో, అందరినీ ఆకట్టుకొనే ప్రచురణలను సాధారణంగా ఉన్నతపరుస్తుంది. దానర్థం మనం సృష్టికర్త పుస్తకాన్ని ప్రతిపాదించకుండా ఉండాలనా? ఎంతమాత్రం కాదు! దేవుని యందు నమ్మకాన్ని ఉంచని వ్యక్తులకు గానీ, ఆ పుస్తకాన్నుండి ప్రయోజనాన్ని పొందగల వ్యక్తులకు గానీ దాన్ని సంవత్సరం అంతటిలో ఎప్పుడైనాసరే ప్రతిపాదించవచ్చు. దేవునియందు నమ్మకమున్నా ఆయన ఎవరు, ఆయన లక్షణాలు ఏమిటి, సంకల్పాలు ఏమిటి అనే విషయాలపై సరియైన అవగాహన లేని వ్యక్తులకు కూడా ఆ పుస్తకాన్ని ప్రతిపాదించవచ్చు. కాబట్టి, ఆ పుస్తక ప్రతిని మీరు సాక్ష్యమివ్వడానికి తీసుకువెళ్ళే బ్యాగ్లో పెట్టుకొని దాన్ని చదవడానికి ఆసక్తి చూపిస్తారని మీరు తలంచిన ఏ వ్యక్తికైనా దాన్ని ప్రతిపాదించడానికి సిద్ధంగా ఉండమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.