బైబిలు—సర్వమానవాళికి దేవుడిచ్చిన మార్గదర్శిని
1 బైబిలు యొక్క దాదాపు 400 కోట్ల ప్రతులు, 2,100 కన్నా ఎక్కువ భాషల్లోనూ మాండలికాల్లోనూ ముద్రించబడ్డాయి. దీనితో దేవుని వాక్యం భూమ్మీదనున్న 90 శాతంకన్నా ఎక్కువమంది ప్రజలకు అందుబాటులో ఉంది. అయినా, లోకంలో “యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామము” ఉంది. (ఆమో. 8:11) బైబిలు ఉన్న చాలామంది ప్రజలు దాన్ని చదవరు, చదివినా దానిలోని విషయాన్ని అర్థం చేసుకోరు. తమ జీవితాల్లో ఒక ఆచరణయోగ్యమైన మార్గదర్శినిగా ఉపయోగించేందుకు వారిని మనం ఎలా ప్రేరేపించగలము?
2 డిసెంబరులో మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు, నా బైబిలు కథల పుస్తకము, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాలను, లేక జూలై మన రాజ్య పరిచర్యలో ఉన్న స్పెషల్ రేట్ పుస్తకాలను మనం ప్రతిపాదిస్తాము. ఆసక్తి ఉన్నచోట, గత 47 సంవత్సరాలుగా మనకెంతో ప్రయోజనాన్ని కలుగజేసిన బైబిలు అనువాదమైన—నూతన లోక అనువాదము యొక్క ఇంగ్లీషు ప్రతిని కూడా మనం ప్రతిపాదించవచ్చు. దాని స్పష్టతను, దాని ఆధునిక భాషను వివరిస్తూ దాన్ని ప్రతిపాదించవచ్చు. (“అన్ని లేఖనములు” [ఆంగ్లం] పుస్తకంలో 328 పేజీ, 6వ పేరా చూడండి.) సర్వ మానవాళి కొరకైన దైవ నిర్దేశకంగా బైబిలును అంగీకరించేందుకు ఉత్సాహంగా సహాయపడడం ద్వారా యెహోవా నుండి వచ్చిన ఈ బహుమానం పట్ల మన ప్రగాఢమైన మెప్పుదలను ప్రదర్శిస్తాము.
3 “బైబిలును మీరెందుకు నమ్మవచ్చును?” అనే ట్రాక్టును ఉపయోగిస్తూ మీరు ఇలా ప్రారంభించవచ్చు:
◼ “ప్రపంచ జనాభాలో 90 శాతంకంటే ఎక్కువ ప్రజలకు బైబిలు అందుబాటులో ఉన్నప్పటికీ, దాన్ని క్రమంగా చదివేవారు చాలా కొద్దిమందే. కారణమేమిటని మీరనుకుంటారు?” ట్రాక్టులోని మొదటి రెండు పేరాలను చదవండి, 2 తిమోతి 3:16, 17 కూడా చదవండి. పైన పేర్కొనబడిన పుస్తకాల్లో ఏదైనా ఒకదాని నుండి యుక్తమైన విషయాన్ని ప్రస్తావించి దాన్ని ప్రతిపాదించండి. ఆ పుస్తకాన్ని తీసుకోకపోతే, ట్రాక్టులోని మిగతా భాగాన్ని కూడా చదవమని గృహస్థుడిని అడగండి. “భవిష్యత్తును ప్రవచించుట” అనే చివరి ఉపశీర్షికను ఉన్నతపర్చండి.
4 “బైబిలును మీరెందుకు నమ్మవచ్చును” అనే ట్రాక్టును ఇచ్చిన వ్యక్తుల దగ్గరికి మీరు తిరిగి వెళ్లినప్పుడు మీరు ఇలా చెప్పి ప్రయత్నించవచ్చు:
◼ మిమ్మల్ని మీరు మళ్లీ పరిచయం చేసుకున్న తర్వాత, ట్రాక్టులోని చివరి రెండు పేరాలను చదవండి. భూమిపై నిరంతరము జీవించే సాధ్యతను గూర్చి ఆ గృహస్థుడు ఎప్పుడైనా ఆలోచించాడేమో అడగండి. ఆయన ప్రతిస్పందించిన తర్వాత ఇలా అనండి: “బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరుతాయని యెహోవా సాక్షులు దృఢ నిశ్చయంతో ఉన్నారు, దేవుని కట్టడలను అనుసరించే ప్రజలందరికీ అద్భుతమైన భవిష్యత్తు ఉన్నదని చెప్పే ప్రవచనాలు కూడా నెరవేరుతాయన్నది వారి దృఢ నమ్మకం.” దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులో 13వ పేజీలోని చిత్రాన్ని చూపించి, పేజీలు వెనక్కి త్రిప్పి 5వ పాఠానికి వచ్చి అక్కడ మొదట్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలను చర్చిస్తామని చెప్పండి, ఆ విధంగా ఒక పఠనాన్ని ప్రారంభించండి.
5 ఆధ్యాత్మిక చింతనగల ప్రజలున్న ప్రాంతంలో మీరు మొదటిగా ఇలా చెప్పి ప్రయత్నించండి:
◼ “బైబిలుపట్ల ఎక్కువ గౌరవాన్ని కలిగివుండాలని మేము ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాము. చాలా కుటుంబాల్లో బైబిలు ఉన్నా, గంభీరమైన సమస్యలు తలెత్తినప్పుడు కూడా దాన్ని సంప్రదించడం మాత్రం జరగదు. మీరు అది గమనించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు నేటి అవసరాలకు తగ్గది కాదని బహుశ వారు భావిస్తుండవచ్చు. ఈ పుస్తకము, (ఈ నెల కొరకైన ప్రతిపాదిత పుస్తకాల్లో ఒకటి తీసి,) సైన్సుపరంగా బైబిలు కచ్చితంగా ఉందనడానికి నమ్మదగ్గ ఋజువులను ఇస్తుంది. ఎంతో ఒత్తిడిని కలుగజేసే నేటి సమస్యలకు ఆచరణయోగ్యమైన పరిష్కారాలను కూడా ఇస్తుంది.” పుస్తకంలో నుండి కొన్ని విషయాల్ని ఉన్నతపర్చి దాన్ని అందించండి.
6 పుస్తకం ఇచ్చిన చోటికి తిరిగి వెళ్లినప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “నేను మిమ్మల్ని క్రితంసారి కలిసినప్పుడు, నేటి క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో మీతో చర్చించాను. దాన్ని దేవుని వాక్యంగా స్వీకరించినవారు మరింత ఆనందదాయకమైన, మరింత సంతుష్టిసహితమైన జీవితాల్ని గడపడానికి కూడా సహాయాన్ని పొందారు. నేను మీకిచ్చిన పుస్తకంలో వివరించిన ఆచరణయోగ్యమైన బైబిలు సూత్రాల్లో ఒకదాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను.” మీరిచ్చిన పుస్తకంలో నుండి ఒక లేఖనాధార సూత్రాన్ని చర్చించండి. ఆసక్తి చూపిస్తే జ్ఞానము పుస్తకంలోనో లేక దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులోనో పఠనం చేయవచ్చని చెప్పండి.
7 ఈ క్రింది మాటలు వృద్ధుల్లో ఆసక్తిని రేకెత్తించవచ్చు:
◼ “ఒకప్పుడు చాలా కుటుంబాల్లోనివారు బైబిలును చదివేవారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వాటి సూత్రాలకు అనుగుణంగా జీవించేవారు. మీ కుటుంబంలో కూడా అలాగే ఉండేదా? [ప్రతిస్పందించనివ్వండి.] ఇప్పుడు చూస్తే, అనేకమందికి బైబిలు చదవడానికి సమయమే దొరకడం లేదన్నంతగా ఇతర విషయాల్లో మునిగిపోయారు. దాని నైతిక సూత్రాలు పాతకాలం నాటివని భావిస్తున్నట్లు ఉంది. అయితే, బైబిలును పఠించిన తర్వాత తమ జీవితాల్లో మంచి మార్పులు చేసుకున్నవారు అనేకమంది ఉన్నారు. దేవునివాక్య శక్తి వారికి ఎలా సహాయం చేసిందో చదవాలని మీరు ఇష్టపడితే నేనీ పుస్తకాన్ని మీకిచ్చి వెళ్తాను.” ఈ నెలలో అందించాల్సిన పుస్తకాల్లో ఒకదాన్ని ఇవ్వండి.
8 పునర్దర్శనంలో మీరిలా చెప్పవచ్చు:
◼ “మనం పోయినసారి మాట్లాడుకున్నప్పుడు, బైబిలు నైతిక సూత్రాల్ని నేటి సమాజంలో నిర్లక్ష్యం చేస్తున్నారని గమనించాము. ఈ నిర్లక్ష్యం మనల్ని కలతపర్చాలా? [ప్రతిస్పందించనివ్వండి.] యేసుక్రీస్తు బైబిలు జ్ఞానాన్ని పొందడంపైన చాలా ప్రాముఖ్యతనుంచాడు.” యోహాను 17:3 చదవండి. జ్ఞానము పుస్తకంలోని మొదటి అధ్యాయంలోని 5వ పేరాలోని సమాచారాన్ని పంచుకోండి. మన ఉచిత బైబిలు పఠన కార్యక్రమాన్ని గురించి వివరించండి, దాన్ని ఎలా చేస్తామో చూపిస్తామని చెప్పండి.
9 సర్వమానవాళికి దేవుడిచ్చిన మార్గదర్శిని అయిన బైబిలువైపుకు అవధానాన్ని మళ్లించడానికి మీరు చేసే ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థించండి.