కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం గురించి సమతూకమైన దృష్టిని కల్గివుండడం
1 “కాలము సంకుచితమై” ఉన్నందున, పరధ్యానానికి గురికావద్దని మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్ని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించాడు. (1 కొరిం. 7:29) ఈ పాత విధానం యొక్క అంతం సమీపిస్తుండగా, ‘దేవుని రాజ్యాన్ని నీతిని మొదట’ వెదకడం, ‘అనుకూల సమయాన్ని కొనడం’ మనకెంత అవశ్యమో కదా! సమయం అమూల్యమైంది.—మత్త. 6:33; ఎఫె. 5:15, 16.
2 సమయాన్ని ఎక్కువగా ఆదా చేసేదిగా సాంకేతిక పరిజ్ఞానం కొనియాడబడుతోంది. ఉదాహరణకు, కంప్యూటర్ బటన్ని నొక్కగానే వినియోక్త వెంటనే సమాచారాన్ని పెద్దమొత్తంలో పొందగలడు. ఇతర మాధ్యమాలచే చేయడాన్కి గంటలు లేదా వారాల కొద్దీ పట్టే పనిని కంప్యూటర్లు తరచూ క్షణాల్లో చేయగలవు. సరియైన రీతిలో ఉపయోగించినప్పుడు, అవి సహాయకరమైన పరికరాలే.
3 అది నిజంగా సమయాన్ని ఆదా చేస్తుందా?: మరోరీత్యా చూస్తే, అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యామ్నాయ ధరలైన ధనం, కాలం రూపంలో చెల్లించకుండా వినియోక్తకు రాదు. కొన్ని టాస్క్‌లను (పనుల్ని) కంప్యూటర్చేత ఎలా చేయించాలో నేర్చుకోవడానికి గంటల కొద్దీ సమయం అవసరం కావచ్చు. అంతేకాకుండా, సాంకేతిక పరిజ్ఞానంచే మరులుగొల్పబడిన వ్యక్తి, శ్రేష్ఠమైనరీతిలో వెచ్చించగల సమయాన్ని వ్యర్థం చేస్తుండవచ్చు. ‘మీ కొరకు సౌలభ్యమౌతున్న సమయాన్ని కొనడం ద్వారా జ్ఞానంగల వ్యక్తులుగా’ నడుచుకొనుమని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉపదేశంలో ఇమిడివున్న సూత్రాన్ని మనస్సునందుంచుకోవడం ద్వారా మనం ఓ సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండాలి.—1 కొరిం. 7:31, చూడండి.
4 సదుద్దేశంగల అనేకమంది వ్యక్తులు, సంఘ రికార్డుల్ని భద్రపర్చడానికి కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను రూపొందించారు. అయినా, ఒకరు తమ కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకుంటారనేది వారి వ్యక్తిగత నిర్ణయం. అయితే, ఫారమ్‌లు సంఘ రికార్డులకొరకు ఇవ్వబడితే, ఆ రికార్డులను కంప్యూటర్లో ఉంచకూడదు, ఎందుకంటే పిల్లలు లేక ఇతర అనధికారక వ్యక్తులు వాటిని చేరగలరు. సంఘ రికార్డులన్నీ అంటే అక్కౌంట్ రికార్డులు, సంఘ ప్రచారకుల రికార్డు కార్డులు మొదలైన వాటిని సొసైటీచే ఇవ్వబడిన ఫారమ్‌లలోనే భద్రపర్చాలి, ఈ సంఘ ఫారమ్లపైనున్న సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపర్చకూడదు. ఈ విధంగా, సంఘం యొక్క రహస్య రికార్డులు కాపాడబడ్తాయి.
5 దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూట కార్యక్రమం కొరకు అసైన్మెంట్లను తయారు చేయడంలో బాధ్యతగల అధ్యక్షులు వివేచన చూపాలి. ఓ ప్రత్యేకమైన భాగాన్ని పూర్తి చేసేందుకు మనస్సునందు సమాచారాన్ని కల్గివుండాల్సిన అవసరం వారికి ఉంది. ఉదాహరణకు, పాఠశాలలో ఏ విద్యార్థియైనా నిర్వహించడానికి కొంత సమాచారం తగినదిగా ఉండకపోవచ్చు. ప్రసంగాన్ని ఇవ్వడంలోగల సంకల్పం అలాగే ఆ వ్యక్తి అర్హతలు, సమాచారం యొక్క స్వభావం పరిగణలోనికి తీసుకోవాలి. దానిని నిర్ణయించడాన్ని కంప్యూటర్‌కే విడిచి పెట్టకూడదు.
6 సంఘ కూటాల్లో అందించబడే ఒక భాగం కొరకు నియమింపబడిన ఓ సహోదరుడు మరొకరిచే సిద్ధపర్చబడిన సమాచారంపై ఆధారపడకూడదు. కేవలం ఒక సహోదరునికి కంప్యూటర్ ఉంది గనుక పరిశోధన చేయడానికి మరియు సంక్షిప్త ప్రతిని త్వరగానూ చక్కగానూ టైపు చేయడానికి ఆయన దాన్ని ఉపయోగించగలడు గనుక ఇతరులు తమ స్వంత నియమకాల్ని సిద్ధం చేసుకోవడానికి పట్టే సమయాన్ని ప్రయాసను ఆదా చేసుకోవడానికి తమ కొరకు కూటాల్లోని భాగాల్ని సిద్ధం చేయమని అడగరాదు. సంఘంలోని ఇతరులకు లేక ఇతర సంఘాల్లోని వారికి, బైబిలు ప్రసంగాలు లేక కూటాల్లోని భాగాల్ని సిద్ధపర్చేందుకు బాధ్యతగల క్రైస్తవులు దుర్వినియోగం చేయరాదు. అయినా కంప్యూటర్ మరియు సిడి-రామ్లోవున్న సొసైటీ యొక్క వాచ్‌టవర్ లైబ్రరీ అందుబాటులోవున్న పరిమితమైన సమయంలో ప్రభావవంతంగా పరిశోధన చేయడానికి తోడ్పడే విలువైన పరికరాలవ్వవచ్చు.—మే 1, 1994 తేజరిల్లు! నందలి 27వ పేజీలోని బాక్సు చూడండి.
7 మన సహోదరుల మధ్య కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను, లిస్ట్‌లను మరి సంబంధిత ముద్రిత సమాచారాన్ని పునరుత్పత్తి చేయడం మరియు పంపిణీ చేయడం అలాగే ఎలక్ట్రానిక్ లేక ఇతర మాధ్యమాల ద్వారా సేవా కూటంలోని, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని భాగాల్ని సిద్ధం చేయడం, పంచిపెట్టడం వంటి వాటికి సంబంధించినంత వరకూ స్థానిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని తమ స్వంత సమాచారాన్ని సహోదరులు సిద్ధపడడం సర్వసాధారణంగా మంచిది. (1 తిమో. 4:13, 15) సంఘంలోని వ్యక్తులతోగల సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికపరమైన లాభం కొరకు వినియోగించుకోకూడదు.
8 కావలికోట పఠనమందు లేక సంఘ పుస్తక పఠనమందు ఉపయోగింపబడిన లేఖనాల్ని కంప్యూటర్ ప్రింటౌట్లు తీసి పంచిపెట్టడం విషయం ఏమిటి? ప్రచారకులు తమ వ్యక్తిగత నోట్సులను తయారు చేసుకోవడం, బైబిలులోను మరియు పఠిస్తున్న సాహిత్యాల్లోను గుర్తులు పెట్టుకోవడం కోరదగినదై ఉండవచ్చు. సాహిత్యాల్లో ఎత్తి వ్రాయబడని లేఖనాల యొక్క కంప్యూటర్ ప్రింటౌట్లను కూటంలో ఉపయోగించడమనేది లేఖనాల్ని కనుగొనడంలో బైబిల్ని ఉపయోగించడాన్ని నిరుత్సాహపర్చగలదు. కాని బైబిలు పఠన సమయంలో లేక సంఘ కూటమందైనా లేఖన భాగాల్ని చూడడమనేది ప్రాంతీయ పరిచర్యలో బైబిల్ని ప్రభావవంతంగా ఉపయోగించడం కొరకు మనల్ని సంసిద్ధుల్ని చేసే తర్ఫీదును పొందడంలోని భాగమే. అనేక సందర్భాల్లో, మరి విశేషంగా పెద్ద పెద్ద ఉటంకాల్ని బైబిలు నుండి సూటిగా చదవడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ప్రాముఖ్యంగా చదువుతుండగా బైబిల్లో చూసుకోమని ప్రేక్షకులు ప్రోత్సహించబడినప్పుడు ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
9 గంభీరమైన ఇతర అవరోధాలు: కంప్యూటర్ని నెట్వర్కుకి కనెక్టు చేయడం గంభీరమైన ఆత్మీయ అపాయాలకు మార్గాన్ని తెరవగలదని ఆగస్టు 1, 1993 కావలికోట సంచికలో 17వ పేజీనందు తెలియజేయబడింది. నీతి విచక్షణల్లేని వాడొకడు నెట్వర్కు ద్వారా ఒక వైరస్‌ను అంటే కంప్యూటర్ ఫైళ్లను పాడుచేయడానికి లేక నాశనం చేయడానికి రూపొందింపబడిన ఒక ప్రోగ్రామ్‌ను ఎలా పంపగలడో, అలాగే భ్రష్టులు, మతగురువులు మరియు నైతికంగా ఇతరుల్ని భ్రష్టుల్ని చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు తమ విషపూరితమైన అభిప్రాయాల్ని అలాంటి నెట్వర్కుల ద్వారా స్వేచ్ఛగా వ్యాపింప చేయగలరు. వీరు క్రైస్తవ వినియోక్తలను “దుష్ట సాంగత్యము”నకు గురిచెయ్యగలరు. (1 కొరిం. 15:33) ఆత్మీయ విషయాల గురించి ఊహించడానికేగాక చెడు సలహా ఇవ్వడానికి, వృథాప్రసంగాన్ని, అబద్ధ సమాచారాన్ని వ్యాపింపజేయడానికి, ప్రతికూలమైన అభిప్రాయాల్ని నాటడాన్కి, కొందరి విశ్వాసాన్ని పాడుచేసే ప్రశ్నల్ని సందేహాల్ని రేకెత్తించడాన్కి మరియు బైబిలు యొక్క వ్యక్తిగత భావాంతరీకరణలను విస్తరింపజేయడానికి కంప్యూటర్ నెట్వర్కులు ఉపయోగించబడినట్లు సొసైటీకి నివేదికలు అందాయి. భ్రష్టులు, మత గురువులు వ్రాసిన సాహిత్యాలు, పత్రికలు దానిని చేయడానికే ప్రయత్నిస్తాయి. కొంత సమాచారం ఆసక్తికరమైనదిగానూ బోధనాత్మకమైనదిగానూ పైకి కన్పించవచ్చు, కాని అది విషపూరితమైన మూలకాలతో మిళితమై ఉండవచ్చు. క్రైస్తవులు సమయానుకూలమైన ఆత్మీయ ఆహారం కొరకు, సందేహ నివృత్తి కొరకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”ని వైపు చూస్తారు. (జూలై 1, 1994 కావలికోటలోని 9-11 పేజీలను చూడండి.) భ్రష్టపర్చే ప్రభావాలన్నింటికి వ్యతిరేకంగా తన విశ్వాసాన్ని కాపాడుకొనే గంభీరమైన బాధ్యత ఒక క్రైస్తవునికి ఉంది మరియు ఆ బాధ్యతకు సంబంధించి తాను ఎవరితో సహవసిస్తున్నాడో అన్ని వేళలా తెల్సుకోవాలి.—మత్త. 24:45-47; 2 యోహా. 10, 11.
10 అదే కావలికోట శీర్షిక కాపీరైట్ చట్టాల్ని గౌరవించే ప్రాముఖ్యతను ఉద్ఘాటించింది. కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను సిద్ధంచేసి విక్రయించే అనేక కంపెనీలు వీటిని కాపీరైట్ చేసి మరియు చట్టపరంగా ప్రోగ్రామ్‌లను ఎలా ఉపయోగించాలో తెలియజేసే ఒక లైసెన్సు అవి ఇస్తాయి. ప్రోగ్రామ్ యొక్క కాపీలను యజమాని ఇతరులకు ఇవ్వకూడదని ఆ లైసెన్స్ తెలియజేస్తుంది; నిజానికి అంతర్జాతీయ కాపీరైట్ల చట్టం అలా చేయడాన్ని చట్టవిరుద్ధమైనదిగా చేస్తుంది. అనేకమంది అత్యాశపరులైన ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడం విషయంలో న్యాయాన్యాయాలను పట్టించుకోరు. అయినా కైసరువి కైసరుకి చెల్లించే చట్టపరమైన విషయాల్లో క్రైస్తవులు మనస్సాక్షిని కల్గివుండాలి.—మత్త. 22:21; రోమా. 13:1.
11 ఏ సాంకేతిక అన్వయింపు యొక్క విలువైనా దాని వినియోగంలో సహజంగావున్న సంభవనీయమైన అపాయాలతో తూచి చూడాలి. దూరదర్శిని సత్ ప్రయోజనానికి ఉపయోగపడగలిగినప్పటికీ, నేడు మానవజాతిపై అది కల్గివున్న అనారోగ్యకరమైన ప్రభావం ప్రాపంచిక మూలాలు సహితం గంభీరమైన వ్యాకులతను వ్యక్తపర్చడానికి కారణమైంది. కంప్యూటర్ నెట్వర్కులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి మరియు గృహంలోకి లేక పనిస్థలంలోకి అపరిమితమైన విలువగల సమాచారాన్ని తేగలవు. వ్యాపారస్థులకు, సంస్థలకు అలాగే మనం జీవిస్తున్న వేగంగా కదులుతున్న ఈ సమాజంలో వ్యక్తిగతమైన లేక వ్యాపార ఆసక్తులతో దీటుగా నిలబడే అవసరతగల వ్యక్తులకు అవి ఎంతో అత్యవసరమైన సేవల్ని అందిస్తాయి. అదే సమయంలో, కంప్యూటర్ నెట్వర్కులు అశ్లీలతతోనూ విభజించే ద్వేషభరితమైన ప్రచారాలతోనూ నీచమైన, దుష్ట క్రియల్ని ఎలా చెయ్యాలో అనే దానిపై వివరణాత్మకమైన సమాచారంవంటి సమస్యలతో కలుషితం చేయబడ్డాయి.
12 కాబట్టి, కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం గురించి సమతూకమైన దృష్టిని క్రైస్తవుడు ఎందుకు కల్గివుండాలనే దానికి అనేక ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కంప్యూటర్ డిస్కెట్లలో సొసైటీ లభ్యమయ్యేలా చేసిన నూతన లోక అనువాదము, అంతర్దృష్టి సంపుటిలు, గెట్వెర్స్ ప్రోగ్రామ్‌లను అనేకమంది వ్యక్తులు ఆనందిస్తున్నారు. వాటిని సొసైటీ ఇండియాలో ఇంకా పంపిణీ చేయక పోయినప్పటికీ అధిక పరిశోధనా సామర్థ్యాలు చేర్చబడిన సిడి-రామ్లోనున్న వాచ్‌టవర్ లైబ్రరీని విదేశాల నుండి ఇతరులు వ్యక్తిగతంగా పొందగల్గుతున్నారు. ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞాన విలువను గుర్తించినప్పటికీ, ప్రయోజనకరమైన ఉద్దేశాల కొరకు అటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఒక వ్యక్తి, తనను తాను మరియు ఇతరుల్ని ఏవిధమైన ప్రతికూల దృక్పథాల నుండైనా కాపాడుకోవడానికి కూడా జాగ్రత్త వహించాలి. హానికరంకాని సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా మన సమర్పిత కాలాన్ని అతిగా తీసేసుకోకుండా లేక మన ప్రధానమైన పని, లక్ష్యాల నుండి పరధ్యానం కల్గించకుండా, మనం సమతూకాన్ని కల్గివుండాల్సిన అవసరత ఉంది.—మత్త. 6:22; 28:19, 20.