సువార్తనందించుట—తరచుగా పనిచేసిన ప్రాంతములో
1 తరచుగా పనిచేసిన ప్రాంతములో ప్రకటించుట ప్రత్యేకమైన సవాలునుంచును. వర్తమానమును మీరెట్లు తాజాగా ఆమోదయోగ్యముగా ఉంచుదురు? ఖచ్చితముగా ఆసక్తిలేనివారని తీర్మానించుకొనిన వారిగా కన్పించు కొందరిని ఎట్లు సమీపించవలెను? మనము తరచుగా వచ్చెదమని చెప్పువారితో మనమేమి చెప్పగలము? తరచుగా పనిచేసిన ప్రాంతములో సులభతరము చేయబడిన ప్రచురణ అందింపు ఏర్పాటును ఎట్లు చేపట్టగలము?
అనుకూలతను కలిగియుండుము
2 కొందరు ఆలోచించు దానికి భిన్నముగా, మనము తరచుగా పనిచేయని ప్రాంతముకంటె తరచుగా, ఎక్కువగా పనిచేసిన ప్రాంతము సాధారణముగా మంచి ఫలితములను తెచ్చును. మొదట అధికమించవలసిన అడ్డంకు ఏదనగా చేసిన ఇండ్లనే క్రమముగా దర్శించుట విషయమైవున్న అననుకూల స్వభావము. రాజ్యవర్తమానమును విను ప్రతి అవకాశమును ప్రజలకిచ్చుట అవసరము. మనమనేకసార్లు దర్శించినను అనుకూలముగా ప్రత్యుత్తరమివ్వని వారిని అనర్హులుగా యెహోవా తీర్పుతీర్చియున్నాడని తీర్మానించుకొనుట మన పక్షమై తప్పిదమైయున్నది.
3 తరచుగా పనిచేసిన ప్రాంతములో ఇతరుల స్థానమును అర్థము చేసికొనుట ప్రత్యేకముగా ప్రాముఖ్యమైయున్నది. సమీప ప్రాంతమందలి ప్రజలను ప్రభావితం చేసిన విషయమును గూర్చిన విశేషమైన వర్తమానమును, మరొకరకముగా వినని వారిలో అనుకూల ప్రతిస్పందనను కలుగజేయవచ్చును. జరుగుచున్న సంఘటనలు ఎప్పటికప్పుడు ఎరిగియున్నవారై, ప్రజలెదుర్కొను సమస్యలతో వ్యవహరించుటకు వారికి బైబిలు వర్తమానమెట్లు సహాయము చేయగలదో చూపించుటకు మీరు సిద్ధపడియున్నారా?
సమీపించు విధమును మార్చుము
4 తరచుగా పనిచేసిన ప్రాంతములో మీరు సమీపించు విధానమును మార్చవలెను. ఒక సమయములో మీరు పరిచయములో భాగముగా ఒక కరపత్రమును ఉపయోగించవచ్చును. మరొక సమయములో రీజనింగ్ పుస్తకములో 9-15 పేజీలలోగల 40కి పైగాగల ఉపోద్ఘాతములను ప్రాంతీయ విషయశ్రద్ధలకు ముడిపెట్టి చెప్పవచ్చును. మీరు మరలా వచ్చుటను అభ్యంతరపెట్టుటను తగ్గించుటకు, ఇరుగుపొరుగులను పోయినసారి మీరు దర్శించిరని సూచించుటకు మీరు ఇష్టపడవచ్చును. పోయినసారి మీరు వచ్చినప్పుడు గృహస్థుడు చేసిన అర్థవంతమైన వ్యాఖ్యానమును మీరు వ్రాసియుంచినకొనినట్లయిన, మరింత ఆసక్తిదాయకమైన సంభాషణను ప్రారంభించుటకు దానిని ఒక మెట్టుగా ఉపయోగించవచ్చును.
5 యెహోవా దృష్టించునట్లు ప్రజలను దృష్టించుము. మరియు ఖచ్చితముగా ఆసక్తిలేదని మనకు చెప్పినవారియెడల ఎడతెగక శ్రద్ధచూపించుము. తన ప్రాచీనకాల ప్రజలు తన వార్తహరులయెడల లెక్కలేనితనముగా ఉండినను, యెహోవా మరలా మరలా విన్నపములు చేసెను. (2 దిన. 36:15; యిర్మీ. 7:13) ఒకప్పుడు తాము ఆసక్తిలేనివారమని తలంచిన అనేకులు ఈనాడు మన సహోదర సహోదరీలువుతున్నారు. తీవ్రముగా వ్యతిరేకించిన వారిని సహితము సత్యము జయించినది. ఎవరోఒకరు ఓపికతో సువార్తను ఎడతెగక తమకు అందించినందుకు వారిప్పుడు కృతజ్ఞతను కలిగియున్నారు.
మంచి రికార్డులను కలిగియుండుము
6 ఇంటింటి రికార్డు పత్రమును సరియైన రీతిలో ఉంచుట ఎంతో ప్రాముఖ్యము. ఇంటలేని వారిని దర్శించుట మనము ప్రాంతములో పూర్తిగా పనిచేయుటకు దోహదపడుటయే గాకుండ ఒకసారి దర్శించిన వారిని మరలా దర్శించుటకు మధ్యలో తగినంత కాలనిడివిని వృద్ధిచేయును. ఇంటిలో లేనివారిని గూర్చిన వివరములను వారము మధ్యలో పనిచేయువారినుండి వారాంతములో పనిచేయువారికి అందజేయుటను మంచిదిగా కనుగొనిరి. దినములోని కొన్ని సమయములలో మరియు వారములోని కొన్ని దినములు ఇంటిలో ఉండని ప్రజలను వేరే సమయములో దర్శించు సాధ్యతను ఇది ప్రభావవంతముగా వృద్ధిచేయును. మరిన్ని సలహాలను మనము 1988 జూలై 15, ది వాచ్‌టవర్ పుటలు 15-20లలో కనుగొనవచ్చును.
7 వినువారందరిని చేరు ప్రయత్నము ఎప్పుడు సంతృప్తికరముగా జరిగింపబడినదో యెహోవాకు తెలుసు. ఇవ్వబడిన సమయములోనే పని జరిగింపబడునను నమ్మకముతో, క్రీస్తు నాయకత్వము క్రింద ఆయనకు ఎడతెగక లోబడియుందుము.—యెహె. 9:11.