కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 ఫిబ్రవరి పేజీలు 8-12
  • విమోచన క్రయధనం — తండ్రి ఇచ్చిన “పరిపూర్ణ వరం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విమోచన క్రయధనం — తండ్రి ఇచ్చిన “పరిపూర్ణ వరం”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నీ పేరు పవిత్రపర్చబడాలి”
  • “నీ రాజ్యం రావాలి”
  • ‘నీ ఇష్టం నెరవేరాలి’
  • విమోచన క్రయధనం పట్ల మీకున్న కృతజ్ఞతను చూపించండి
  • విమోచన క్రయధనం యెహోవా ఇచ్చే దీవెనల్ని తెస్తుంది
  • దేవుని గొప్ప బహుమానం—విమోచన క్రయధనం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • విమోచన క్రయధనం మీద కృతజ్ఞత చూపిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యెహోవా “ఎంతోమంది కోసం విమోచన క్రయధనం” ఏర్పాటు చేశాడు
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 ఫిబ్రవరి పేజీలు 8-12
ఓ గుంపుకు బోధిస్తున్న యేసు

విమోచన క్రయధనం —తండ్రి ఇచ్చిన “పరిపూర్ణ వరం”

‘ప్రతీ మంచి బహుమానం, ప్రతీ పరిపూర్ణ వరం తండ్రి నుండే వస్తాయి.’ —యాకో. 1:17.

పాటలు: 20, 15

విమోచన క్రయధనం . . .

  • యెహోవా పేరును ఎలా పవిత్రపరుస్తుంది?

  • దేవుని రాజ్యంలో పొందబోయే ఆశీర్వాదాల్ని ఎలా తీసుకొస్తుంది?

  • దేవుని సంకల్పం నెరవేరడానికి ఎలా సహాయం చేస్తుంది?

1. విమోచన క్రయధనం మనకు ఎలాంటి ఆశీర్వాదాల్ని తీసుకొస్తుంది?

మనం ప్రతీ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకుంటాం. విమోచన క్రయధనం ఆధారంగా వేరే గొర్రెలందరూ ఏదోక రోజు దేవుని కుటుంబంలో భాగమౌతారనే విషయాన్ని ఆ ఆచరణ మనకు గుర్తుచేస్తుంది. మనం నిరంతరం సంతోషంగా జీవించే రోజు కోసం ఎదురుచూసే అవకాశాన్ని కూడా ఆ విమోచన క్రయధనం ఇస్తుంది. అంతేకాదు అటు పరలోకంలో ఇటు భూమ్మీద ఉన్న ప్రతీఒక్కరికి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు, యేసు చెల్లించిన విమోచన క్రయధనంతో ముడిపడి ఉన్నాయి.—హెబ్రీ. 1:8, 9.

2. (ఎ) పరలోకంలో, భూమ్మీద ఉన్న ప్రతీఒక్కరికి సంబంధించిన ఏ ప్రాముఖ్యమైన విషయాల గురించి యేసు ప్రార్థించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

2 యేసు చనిపోవడానికి దాదాపు రెండేళ్ల ముందు, ఆయన తన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు, “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి.” (మత్త. 6:9, 10) అయితే యెహోవా పేరు పవిత్రపర్చబడడం, దేవుని రాజ్యం పరిపాలించడం, దేవుని ఇష్టం నెరవేరడం అనే మూడు విషయాలు విమోచన క్రయధనంతో ఎలా ముడిపడి ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

“నీ పేరు పవిత్రపర్చబడాలి”

3. యెహోవా పేరు దేన్ని సూచిస్తుంది? యెహోవా పేరును అపవిత్రపర్చడానికి సాతాను ఏమి చేశాడు?

3 అన్నిటికన్నా ముందు, యెహోవా పేరు పవిత్రపర్చబడాలని లేదా దాన్ని అందరూ పవిత్రంగా ఎంచాలని యేసు ప్రార్థించాడు. యెహోవా పేరు ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన విశ్వంలో అందరికన్నా శక్తిమంతుడు, నీతిమంతుడు. యేసు ఆయన్ని “పవిత్రుడవైన తండ్రీ” అని కూడా పిలిచాడు. (యోహా. 17:11) యెహోవా పవిత్రుడు కాబట్టి ఆయన చేసేవన్నీ, ఆయన పెట్టే నియమాలన్నీ పవిత్రమైనవి. కానీ మనుషుల కోసం ప్రమాణాలు ఏర్పాటు చేసే హక్కు యెహోవాకు లేదని ఏదెను తోటలో సాతాను సవాలు చేశాడు. సాతాను యెహోవా గురించి అబద్ధాలు చెప్పి ఆయన పేరును అపవిత్రపర్చాడు.—ఆది. 3:1-5.

4. యెహోవా పేరును యేసు ఎలా పవిత్రపర్చాడు?

4 యేసు మాత్రం యెహోవా పేరును ఎంతో ప్రేమించి, దాన్ని పవిత్రపర్చడానికి చేయగలిగినదంతా చేశాడు. (యోహా. 17:25, 26) యెహోవా ప్రమాణాలు సరైనవని, ఆయన చేయమని చెప్పేవన్నీ మన మంచికేనని ఇతరులు అర్థంచేసుకునేలా యేసు తన ప్రవర్తన ద్వారా, బోధల ద్వారా సహాయం చేశాడు. ఆ విధంగా ఆయన యెహోవా పేరును పవిత్రపర్చాడు. (కీర్తన 40:8-10 చదవండి.) అంతేకాదు సాతాను ఎన్నో రకాలుగా శోధించినా, బాధ అనుభవిస్తూ చనిపోయేలా చేసినా యేసు యెహోవాకు నమ్మకంగానే ఉన్నాడు. అలా ఓ పరిపూర్ణ మనిషి యెహోవాకు పూర్తిగా లోబడడం సాధ్యమేనని యేసు నిరూపించాడు.

5. యెహోవా పేరును మనం ఏవిధంగా పవిత్రపర్చవచ్చు?

5 మరి యెహోవా పేరును మనం ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు? మన ప్రవర్తన ద్వారా. అవును, మనం పవిత్రంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 పేతురు 1:15, 16 చదవండి.) అంటే మనం ఆయన్ను మాత్రమే ఆరాధించాలని, ఆయన చెప్పేవాటన్నిటినీ మనస్ఫూర్తిగా పాటించాలని దానర్థం. కాబట్టి హింసలు ఎదురైనప్పుడు కూడా, మనం యెహోవా నీతి సూత్రాలు-నియమాలు ప్రకారం జీవించడానికి చేయగలిగినదంతా చేస్తాం. అలా జీవించడం ద్వారా యెహోవా పేరును మహిమపరుస్తాం. (మత్త. 5:14-16) అంతేకాదు యెహోవా నియమాలు సరైనవని, సాతాను అబద్ధాలకోరని నిరూపిస్తాం. అయితే మనం అపరిపూర్ణులం కాబట్టి పొరపాట్లు చేస్తుంటాం. అలా పొరపాట్లు చేసినప్పుడు మనం పశ్చాత్తాపపడతాం. యెహోవా పేరుకు మచ్చ తీసుకొచ్చే ఎలాంటి పనులనైనా మానుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తాం.—కీర్త. 79:9.

6. మనం అపరిపూర్ణులమైనప్పటికీ, దేని ఆధారంగా యెహోవా మనల్ని నీతిమంతులుగా చూడగలడు?

6 మనం అభిషిక్తులమైనా లేదా ‘వేరే గొర్రెలమైనా,’ విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచితే యెహోవా మన పాపాల్ని క్షమిస్తాడు. తనకు సమర్పించుకునే వాళ్లందర్నీ, తనను ఆరాధించే ప్రజలు ఉన్న కుటుంబంలోకి ఆహ్వానిస్తాడు. ఆయన అభిషిక్త క్రైస్తవుల్ని నీతిమంతులుగా తీర్పుతీర్చి వాళ్లను తన కుమారులుగా అంగీకరిస్తాడు. అంతేకాదు ‘వేరేగొర్రెలను’ కూడా నీతిమంతులుగా తీర్పుతీర్చి వాళ్లను తన స్నేహితులుగా చేసుకుంటాడు. (యోహా. 10:16; రోమా. 5:1, 2; యాకో. 2:21-25) అంతేకాదు విమోచన క్రయధనం ఆధారంగా మనం ఇప్పుడు కూడా తండ్రితో స్నేహం చేయగలుగుతున్నాం, ఆయన పేరును పవిత్రపర్చగలుగుతున్నాం.

“నీ రాజ్యం రావాలి”

7. విమోచన క్రయధనం వల్ల మనం ఏ ఆశీర్వాదాలు పొందుతాం?

7 “నీ రాజ్యం రావాలి” అని ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. అయితే దేవుని రాజ్యం విమోచన క్రయధనంతో ఎలా ముడిపడి ఉంది? దేవుని రాజ్యంలో లేదా దేవుని ప్రభుత్వంలో యేసు అలాగే మనుషుల నుండి ఎంచుకోబడిన 1,44,000 మంది పరిపాలకులుగా ఉంటారు. ఈ 1,44,000 మంది పరలోకానికి పునరుత్థానం అవ్వాలంటే విమోచన క్రయధనం అవసరం. (ప్రక. 5:9, 10; 14:1) వాళ్లు యేసుతో కలిసి వెయ్యి సంవత్సరాలపాటు రాజులుగా, యాజకులుగా ఈ భూమిని పరిపాలిస్తారు. ఆ సంవత్సరాల్లో యెహోవా తన రాజ్యం ద్వారా ఈ భూమిని పరదైసుగా మారుస్తాడు, మనుషులు పరిపూర్ణులుగా అవ్వడానికి సహాయం చేస్తాడు. చివరికి పరలోకంలో అలాగే భూమ్మీద ఉన్న యెహోవా సేవకులందరూ ఒకే కుటుంబం అవుతారు. (ప్రక. 5:13; 20:6) యేసు సాతానును నాశనం చేసి, అతను సృష్టించిన సమస్యలన్నిటినీ లేకుండా చేస్తాడు.—ఆది. 3:15.

8. (ఎ) దేవుని రాజ్యం ఎందుకు ముఖ్యమైనదో అర్థంచేసుకోవడానికి యేసు తన శిష్యులకు ఎలా సహాయం చేశాడు? (బి) రాజ్యానికి నమ్మకమైన పౌరులుగా ఉన్నామని మనమెలా చూపించవచ్చు?

8 దేవుని రాజ్యం ఎందుకు ప్రాముఖ్యమైనదో అర్థంచేసుకోవడానికి యేసు తన శిష్యులకు సహాయం చేశాడు. ఏవిధంగా? బాప్తిస్మం తీసుకున్న వెంటనే, ఆయన వెళ్లిన ప్రతీచోట “దేవుని రాజ్యం గురించిన మంచివార్తను” ప్రకటించడం మొదలుపెట్టాడు. (లూకా 4:43) అంతేకాదు శిష్యులు “భూమంతటా” తనకు సాక్షులుగా ఉండాలని ఆయన చెప్పాడు. (అపొ. 1:6-8) నేడు రాజ్య ప్రకటనాపని వల్ల, ప్రజలు విమోచన క్రయధనం గురించి తెలుసుకోగలుగుతున్నారు, దేవుని రాజ్యపౌరులు అవ్వగలుగుతున్నారు. మంచివార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడంలో అభిషిక్తులకు మద్దతివ్వడం ద్వారా మనం రాజ్యానికి నమ్మకమైన పౌరులుగా ఉన్నామని చూపిస్తాం.—మత్త. 24:14; 25:40.

‘నీ ఇష్టం నెరవేరాలి’

9. మనుషుల విషయంలో యెహోవా ఇష్టం ఖచ్చితంగా నెరవేరుతుందని మనమెందుకు నమ్మవచ్చు?

9 ‘నీ ఇష్టం నెరవేరాలి’ అని యేసు అన్న మాటలకు అర్థమేమిటి? ఏదైనా జరుగుతుందని యెహోవా చెప్తే అది జరిగి తీరుతుంది. (యెష. 55:11) సాతాను తిరుగుబాటు యెహోవాను ఆపలేదు. ఇంతకీ భూమి విషయంలో యెహోవా ఇష్టమేంటి? ఆదాముహవ్వల నుండి వచ్చిన పరిపూర్ణులైన పిల్లలతో ఈ భూమి నిండాలని ఆయన కోరుకున్నాడు. (ఆది. 1:28) ఒకవేళ ఆదాముహవ్వలు పిల్లలు లేకుండానే చనిపోయుంటే, వాళ్ల పిల్లలతో భూమి నిండాలనే యెహోవా సంకల్పం నెరవేరేది కాదు. అందుకే వాళ్లు పిల్లల్ని కనేందుకు యెహోవా అనుమతించాడు. విశ్వాసం చూపించే ప్రతీఒక్కరు విమోచన క్రయధనం ఆధారంగా పరిపూర్ణులై, నిరంతరం జీవించవచ్చు. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన ఏర్పాటు చేసిన అద్భుతమైన జీవితాన్ని మనం ఆనందించాలని కోరుకుంటున్నాడు.

10. చనిపోయినవాళ్లు విమోచన క్రయధనం నుండి ఎలా ప్రయోజనం పొందుతారు?

10 మరి యెహోవా గురించి తెలుసుకోకుండా చనిపోయిన కోట్లమంది విషయమేంటి? ప్రజలు జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు కాబట్టి చనిపోయినవాళ్లను కూడా ఆయన తిరిగి బ్రతికిస్తాడు. విమోచన క్రయధనం ఆధారంగా వాళ్లు తిరిగి బ్రతుకుతారు. అప్పుడు వాళ్లకు యెహోవా గురించి తెలుసుకుని, నిరంతరం జీవించే అవకాశం దొరుకుతుంది. (అపొ. 24:15) యెహోవాయే జీవానికి మూలం కాబట్టి చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించినప్పుడు ఆయన వాళ్లకు తండ్రి అవుతాడు. (కీర్త. 36:9) యేసు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో, యెహోవాను “పరలోకంలో ఉన్న మా తండ్రీ” అని పిలిచాడు. (మత్త. 6:9) చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికించే పనిలో యెహోవా యేసుకు చాలా ప్రాముఖ్యమైన బాధ్యతను అప్పగించాడు. అందుకే యేసు ఇలా అన్నాడు, “పునరుత్థానాన్ని, జీవాన్ని నేనే.”—యోహా. 6:40, 44; 11:25.

11. “గొప్పసమూహం” విషయంలో దేవుని ఇష్టం ఏమిటి?

11 యెహోవా ప్రతీఒక్కరిని తన కుటుంబంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. యేసు ఇలా అన్నాడు, “దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తే నా తమ్ముడు, నా చెల్లి, మా అమ్మ.” (మార్కు 3:35) అన్నీ దేశాలకు, తెగలకు, భాషలకు చెందిన ఎంతోమంది తన ఆరాధకులు అవ్వాలనేది యెహోవా ఇష్టం. వాళ్లని “ఏ మనిషీ లెక్కపెట్టలేని ఒక గొప్పసమూహం” అని బైబిలు వర్ణిస్తుంది. వాళ్లు విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచుతారు, దేవునికి లోబడతారు. అంతేకాదు యెహోవాను స్తుతిస్తూ వాళ్లు ఇలా అంటారు, “సింహాసనం మీద కూర్చున్న మన దేవుని నుండి, గొర్రెపిల్ల నుండి మా రక్షణ వస్తుంది.”—ప్రక. 7:9, 10.

12. మనుషుల విషయంలో యెహోవా సంకల్పం గురించి యేసు నేర్పించిన ప్రార్థన మనకేమి తెలియజేస్తుంది?

12 యేసు నేర్పించిన ప్రార్థన సహాయంతో యెహోవా గురించి, విధేయులైన మనుషుల విషయంలో ఆయన సంకల్పం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అవేంటంటే: మొదటిది, యెహోవా పేరును పవిత్రపర్చడానికి, ఆయన్ను మహిమపర్చడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. (యెష. 8:13) మన రక్షణకు కారణమైన యేసు విమోచన క్రయధనం కూడా దేవుని పేరును మహిమపరుస్తుంది. నిజానికి యేసు అనే పేరుకు, “యెహోవాయే రక్షణ” అని అర్థం. రెండవది, విమోచన క్రయధనం వల్ల వచ్చే ఆశీర్వాదాలన్నిటినీ యెహోవా తన రాజ్యం ద్వారా మనుషులకు ఇస్తాడు. మూడవది, యెహోవా తన ఇష్టాన్ని నెరవేర్చకుండా ఏదీ ఆయన్ని ఆపలేదనే నమ్మకం మనకుంది.—కీర్త. 135:6; యెష. 46:9, 10.

విమోచన క్రయధనం పట్ల మీకున్న కృతజ్ఞతను చూపించండి

13. బాప్తిస్మం దేన్ని సూచిస్తుంది?

13 విమోచన క్రయధనంపట్ల కృతజ్ఞత చూపించడానికి ఒక మార్గమేమిటంటే, యేసు బలిపై విశ్వాసం ఉంచి యెహోవాకు మన జీవితాన్ని సమర్పించి, బాప్తిస్మం తీసుకోవడం. మనం “యెహోవాకు చెందుతాం” అని బాప్తిస్మం స్పష్టం చేస్తుంది. (రోమా. 14:8) అంతేకాదు “మంచి మనస్సాక్షి” ఇవ్వమని మనం చేసే విన్నపానికి కూడా అది సూచనగా ఉంటుంది. (1 పేతు. 3:21) ఆ విన్నపానికి జవాబుగా క్రీస్తు బలి విలువ ఆధారంగా యెహోవా మనల్ని తన స్నేహితులుగా అంగీకరిస్తాడు. దీన్నిబట్టి ఆయన మాటిచ్చినవన్నీ మనకిస్తాడనే పూర్తి నమ్మకం మనకుంది.—రోమా. 8:32.

ఓ వ్యక్తి బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అవుతున్నాడు, ప్రీచింగ్‌లో పాల్గొంటున్నాడు

విమోచన క్రయధనం పట్ల మనకు కృతజ్ఞత ఉందని ఏయే విధాలుగా చూపిస్తాం? (13, 14 పేరాలు చూడండి)

14. ఇతరుల్ని ప్రేమించమని యెహోవా ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు?

14 యెహోవా ఏమి చేసినా అమితమైన ప్రేమతోనే చేస్తాడు. తన ఆరాధకుల్లో ప్రతీఒక్కరు అలాంటి ప్రేమనే చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 యోహా. 4:8-11) కాబట్టి మనం ప్రజల్ని, మరిముఖ్యంగా మన తోటి విశ్వాసుల్ని ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు విమోచన క్రయధనం పట్ల మనకు కృతజ్ఞత ఉందని, యెహోవా దేవుని కుటుంబంలో భాగమవ్వాలని కోరుకుంటున్నామని చూపిస్తాం. (మత్త. 5:43-48) ముఖ్యమైన రెండు ఆజ్ఞల్లో మొదటిదేమిటంటే, యెహోవాను ప్రేమించడం. రెండవది ఇతరుల్ని ప్రేమించడం. (మత్త. 22:37-40) ప్రజల్ని ప్రేమిస్తున్నామని చూపించడానికి ఒక మార్గమేమిటంటే, వాళ్లకు దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడం. ఇతరుల్ని ప్రేమించాలనే యెహోవా ఆజ్ఞను పాటిస్తే, ఆయనపై మన ప్రేమను “పూర్తిస్థాయిలో” చూపించినట్లు అవుతుంది.—1 యోహా. 4:12, 20.

విమోచన క్రయధనం యెహోవా ఇచ్చే దీవెనల్ని తెస్తుంది

15. (ఎ) యెహోవా నుండి ఇప్పుడు మనం ఏ దీవెనలు పొందుతున్నాం? (బి) భవిష్యత్తులో ఏ దీవెనలు పొందుతాం?

15 విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనం చేసే పాపాల్ని ‘క్షమిస్తాననే’ భరోసాను యెహోవా ఇస్తున్నాడు. అవును ఆయన మన పాపాల్ని పూర్తిగా క్షమిస్తాడు. (అపొస్తలుల కార్యములు 3:19-21 చదవండి.) మనం మొదట్లో చర్చించుకున్నట్లు, విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా అభిషిక్త క్రైస్తవుల్ని పరలోకంలో తనకు కుమారులుగా ఉండడానికి దత్తత తీసుకున్నాడు. (రోమా. 8:15-17) ‘వేరేగొర్రెలను’ భూమ్మీద తన కుటుంబంలో భాగంగా ఉండమని ఆహ్వానిస్తున్నాడు. వేరేగొర్రెలమైన మనం పరిపూర్ణులమయ్యాక చివరిసారిగా పరీక్షించబడతాం. అప్పుడు యెహోవాకు నమ్మకంగా ఉంటే, మనల్ని కూడా తన పిల్లలుగా దత్తత తీసుకుంటాడు. (రోమా. 8:20, 21; ప్రక. 20:7-9) యెహోవా ఎప్పటికీ తన పిల్లలందర్నీ ప్రేమిస్తాడు. విమోచన క్రయధనం వల్ల వచ్చే దీవెనల్ని మనం నిరంతరం ఆనందిస్తాం. (హెబ్రీ. 9:12) ఆ అమూల్యమైన బహుమానాన్ని యెహోవా మనకిచ్చాడు, దాన్ని మననుండి ఎవ్వరూ తీసివేయలేరు.

16. విమోచన క్రయధనం మనకు ఏవిధంగా విడుదల తెస్తుంది?

16 మనం నిజంగా పశ్చాత్తాపపడితే యెహోవా కుటుంబంలో భాగం అవ్వకుండా సాతాను ఏవిధంగానూ ఆపలేడు. యేసు “ఒక్కసారే” చనిపోయాడు, ఆ క్రయధనం శాశ్వతంగా చెల్లించబడింది. (హెబ్రీ. 9:24-26) ఆదాము మనకు మరణాన్ని వారసత్వంగా ఇచ్చాడు. కానీ యేసు బలి మనకు నిత్యజీవాన్ని ఇస్తుంది. విమోచన క్రయధనం మనల్ని సాతాను గుప్పిట్లో ఉన్న లోకం నుండి, మరణ భయం నుండి విడుదల చేస్తుంది.—హెబ్రీ. 2:14, 15.

17. యెహోవా ప్రేమ గురించి మీకేమనిపిస్తుంది?

17 ఇచ్చిన మాటను దేవుడు ఎల్లప్పుడూ నిలబెట్టుకుంటాడు. ప్రకృతిలో యెహోవా పెట్టిన నియమాలు ఎలాగైతే ఎప్పటికీ మారవో, అలాగే యెహోవా కూడా ఎప్పటికీ మారడు. ఆయన మన ఆశల్ని ఎప్పటికీ నీరుగార్చడు. (మలా. 3:6) యెహోవా కేవలం నిత్యజీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, తన ప్రేమను కూడా పంచుతున్నాడు. “దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం తెలుసుకున్నాం, దాన్ని బలంగా నమ్ముతున్నాం. దేవుడు ప్రేమ.” (1 యోహా. 4:16) ఆయన మాటిచ్చినవన్నీ ఎప్పుడూ నిజమౌతాయి. త్వరలోనే ఈ భూమి అందమైన పరదైసుగా మారుతుంది. ప్రతీఒక్కరు యెహోవాను అనుకరిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అప్పుడు పరలోకంలో, భూమ్మీద ఉన్న ఆయన సేవకులందరూ ఇలా అంటారు, “యుగయుగాలు మన దేవునికి స్తుతి, మహిమ, తెలివి, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, బలం చెందాలి. ఆమేన్‌.”—ప్రక. 7:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి