కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w16 డిసెంబరు పేజీ 18
  • మీకు జ్ఞాపకమున్నాయా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు జ్ఞాపకమున్నాయా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఆందోళన పడడం మానేయండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • మీ అమ్మానాన్నలు యెహోవాను ఆరాధించకపోయినా మీరు ఆరాధించవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
w16 డిసెంబరు పేజీ 18

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

మత్తయి 18:15-17 వచనాల్లో ఎలాంటి తప్పిదము గురించి యేసు మాట్లాడుతున్నాడు?

ఈ లేఖనాల్లో యేసు చెప్తున్న “తప్పిదము” క్రైస్తవుల మధ్య వచ్చే చిన్న అభిప్రాయభేదం కాదు. అది మనకెలా తెలుసు? ఎందుకంటే సహోదరులు, సాక్షులు, పెద్దలు మాట్లాడిన తర్వాత కూడా తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడకపోతే అతన్ని అన్యున్ని, సుంకరిని చూసినట్లు చూడాలని యేసు చెప్పాడు. అంటే మనకాలంలోనైతే అతన్ని సంఘం నుండి బహిష్కరించాలని అర్థం. అయితే ఆ తప్పిదాల్లో మోసం చేయడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కూడా ఉండవచ్చు.—w16.05, 7వ పేజీ.

బైబిల్ని చదవడంవల్ల వచ్చే ప్రయోజనాలు పొందాలంటే మీరేమి చేయవచ్చు?

మీరిలా చేయవచ్చు: బైబిలు చదువుతున్నప్పుడు అందులో మనకు ఏ పాఠాలు ఉన్నాయో ఆలోచించాలి. అంతేకాదు బైబిలు చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేసుకోండి: ‘ఇతరులకు సహాయం చేయడానికి నేను దీన్నెలా ఉపయోగించవచ్చు?’ అలాగే మీకు అందుబాటులో ఉన్న ఉపకరణాల్ని ఉపయోగించుకుని మీరు చదువుతున్న విషయాల గురించి పరిశోధన చేయండి.—w16.05, 24-26 పేజీలు.

పునరుత్థానం ఉందని నమ్మే వ్యక్తి, తన ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు దుఃఖించడం తప్పా?

ఓ క్రైస్తవునికి పునరుత్థానం పై విశ్వాసం ఉన్నంతమాత్రాన, అతని ప్రియమైనవాళ్లు చనిపోవడం వల్ల కలిగే లోటు పోదు. తన భార్య శారా చనిపోయినప్పుడు అబ్రాహాము దుఃఖించాడు. (ఆది. 23:2) కాలం గడుస్తుండగా ఆ దుఃఖం మెల్లమెల్లగా తగ్గుతుంది.—wp16.3, 4వ పేజీ.

యెహెజ్కేలు 9వ అధ్యాయంలోని, లేఖకుని సిరాబుడ్డి ఉన్న వ్యక్తి అలాగే హతముచేసే ఆయుధాలు ఉన్న ఆరుగురు వ్యక్తులు ఎవర్ని సూచిస్తున్నారు?

వాళ్లు యెరూషలేమును నాశనం చేయడంలో భాగంవహించిన పరలోక సైన్యాలను సూచిస్తున్నారు. ఆ సైన్యాలే హార్‌మెగిద్దోను సమయంలో సాతాను దుష్టలోకాన్ని నాశనం చేయడంలో కూడా భాగం వహిస్తాయి. ఆధునిక కాల నెరవేర్పులో, సిరాబుడ్డి ఉన్న వ్యక్తి యేసును సూచిస్తున్నాడు. ఆయన రక్షించబడేవాళ్ల నొసళ్ల పై గుర్తు వేస్తాడు.—w16.06, 16-17 పేజీలు.

ఓ క్రైస్తవుడు సాదాసీదాగా ఎలా జీవించవచ్చు?

మీకు ఏమేమి అవసరమో వాటి లిస్టు రాసుకోండి, మీకు అవసరంలేని వస్తువుల్ని కొనడానికి డబ్బులు ఖర్చుపెట్టకండి. ప్రతీవారం లేదా ప్రతీనెల ఏమేమి కొనాలో, వాటికోసం ఎంత డబ్బు ఖర్చుపెట్టగలరో నిర్ణయించుకోండి. మీరు ఉపయోగించని వస్తువుల్ని అమ్మేయండి లేదా ఎవరికైనా ఇచ్చేయండి లేదా పడేయండి. అప్పుల్ని వీలైనంత త్వరగా తీర్చేయండి. ఉద్యోగం కోసం తక్కువ సమయం వెచ్చించేలా చూసుకోండి. పరిచర్యలో ఎక్కువ సమయం గడిపేలా ప్రణాళిక వేసుకోండి.—w16.07, 10వ పేజీ.

బైబిలు దేన్ని బంగారం లేదా వెండి కన్నా విలువైనదానిగా ఎంచుతోంది?

యోబు 28:12, 15 వచనాల ప్రకారం, దేవుని గురించిన జ్ఞానం బంగారం లేదా వెండి కన్నా విలువైనదని తెలుస్తోంది. దాన్ని పొందడానికి మీరు కృషి చేస్తుండగా వినయంగా ఉంటూ, బలమైన విశ్వాసం కలిగివుండడానికి ప్రయత్నించండి.—w16.08, 18-19 పేజీలు.

మనకాలంలో, సహోదరులు గడ్డం పెంచుకోవచ్చా?

కొన్ని సంస్కృతుల్లో, గడ్డం ట్రిమ్‌ చేసుకోవడం ఆనవాయితీ. ప్రజలు అలాంటివాళ్లను గౌరవిస్తారు, రాజ్యసువార్తను వినడానికి కూడా అభ్యంతరపడరు. అయినప్పటికీ కొంతమంది సహోదరులు గడ్డం పూర్తిగా తీసేసుకోవాలని నిర్ణయించుకోవచ్చు. (1 కొరిం. 8:9) మిగతా సంస్కృతుల్లో లేదా ప్రాంతాల్లో గడ్డం పెంచుకోవడం ఆనవాయితీగా ఉండదు, యెహోవాసాక్షులకు కూడా అది మర్యాదపూర్వకంగా ఉండదు.—w16.09, 21వ పేజీ.

దావీదు గొల్యాతుల మధ్య యుద్ధం నిజంగా జరిగిందని మనం ఎందుకు నమ్మవచ్చు?

ఈ మధ్యకాలంలో నమోదైన అతి పొడవైన వ్యక్తి కన్నా గొల్యాతు కేవలం ఆరు అంగుళాల (15 సెం.మీ) ఎక్కువ ఎత్తు ఉంటాడని చెప్పబడింది. దావీదు ఇల్లు గురించి ప్రాచీన రాయిపై రాసి ఉన్న విషయం, అలాగే దావీదు గురించి యేసు చెప్పిన మాటలు, ఒకప్పుడు దావీదు నిజంగా జీవించాడనడానికి రుజువులుగా ఉన్నాయి. నమోదు చేయబడిన భౌగోళిక వివరాలు ఈ వాస్తవాలకు సరిపోతున్నాయి.—wp16.4, 13వ పేజీ.

జ్ఞానానికి, అవగాహనకు, తెలివికి ఉన్న తేడా ఏమిటి?

జ్ఞానం ఉన్న వ్యక్తి సమాచారాన్ని లేదా వాస్తవాలను సేకరిస్తాడు. అవగాహన ఉన్న వ్యక్తి వాస్తవాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూస్తాడు. తెలివి ఉన్న వ్యక్తి జ్ఞానాన్ని, అవగాహనను జత చేసి వాటిని తన పనిలో ఉపయోగించుకుంటాడు.—w16.10, 18వ పేజీ.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి