కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 2/15 పేజీ 30
  • ఆమె కయప వంశస్థురాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆమె కయప వంశస్థురాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు జీవించాడనేందుకు పురావస్తుశాస్త్ర రుజువులా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • యేసును అన్న దగ్గరికి, తర్వాత కయప దగ్గరికి తీసుకెళ్లారు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • లాజరు పునరుత్థానము చేయబడినప్పుడు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 2/15 పేజీ 30

ఆమె కయప వంశస్థురాలు

[30వ పేజీలోని చిత్రం]

కొన్నిసార్లు పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాల్లో కనుగొన్నవి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బైబిల్లోని ఓ వ్యక్తి ఉనికిని నిర్ధారిస్తాయి. శాస్త్రజ్ఞులు కనుగొన్న అలాంటి ఒక వస్తువుకు సంబంధించిన వివరాలను 2011లో ఇజ్రాయేల్‌ విద్వాంసులు ప్రచురించారు. రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ఓ సున్నపు రాయి శవపేటిక అది. శవం పూర్తిగా కుళ్లిపోయిన తర్వాత మిగిలిన ఎముకలను అందంగా ముస్తాబు చేసిన ఆ పెట్టెలో పెట్టారు.

[30వ పేజీలోని చిత్రం]

అయితే ఆ శవపేటిక మీద “బెత్‌ ఇమ్రీకి చెందిన మయజ్యా యాజక గుంపులోని కయప కుమారుడైన యెషూవ కుమార్తె అయిన మిర్యాము” అని రాసి ఉంది. యేసుక్రీస్తును విచారణ చేసిన వారిలో ప్రధాన యాజకుడైన కయప కూడా ఉన్నాడు. (యోహా. 11:48-50) చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ ఆయనను “కయప అని పిలువబడిన యోసేపు” అని సంబోధించాడు. అయితే వెలికి తీసిన ఆ శవపేటిక కయప బంధువుల్లో ఒకరిది అయ్యుండవచ్చని తెలుస్తోంది. అంతకుముందు కనుగొన్న ఓ శవపేటిక మీది రాతలను బట్టి, అది ప్రధాన యాజకుడైన యెహోసెఫ్‌ బార్‌ కెయిఫాది, లేదా కయప కుమారుడైన యోసేపుదిa అని శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. కాబట్టి మిర్యాము ఏదోవిధంగా కయపకు బంధువు.

ఇజ్రాయేల్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ (IAA) వాళ్ల దగ్గరున్న సమాచారం ప్రకారం, పురాతన సమాధులను దోచుకున్న దొంగల వద్ద నుండి మిర్యాము శవపేటికను స్వాధీనపరచుకున్నారు. ఆ శవపేటికను, దానిమీద ఉన్న రాతలను విశ్లేషించి చూస్తే ఆమె కయప వంశస్థురాలని స్పష్టంగా తెలుస్తోంది.

ఆ శవపేటిక మరో కొత్త విషయాన్ని కూడా తెలియజేస్తోంది. యెరూషలేము దేవాలయంలో వంతుల వారీగా సేవచేసే 24 యాజక గుంపుల్లో చివరి గుంపువాడైన “మయజ్యా” పేరును అది పేర్కొంటోంది. (1 దిన. 24:18) “కయప కుటుంబం మయజ్యా గుంపుకు చెందినది” అని ఆ శవపేటిక మీదున్న రాతలు వెల్లడిస్తున్నాయని ఇజ్రాయేల్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ (IAA) వాళ్లు తెలిపారు.

శవపేటిక మీద బెత్‌ ఇమ్రీ అని కూడా రాసి ఉంది. ఆ పేరుకు సంబంధించి రెండు రకాలైన వివరణలు ఉన్నాయి. “మొదటిది, బెత్‌ ఇమ్రీ అనే పేరు మయజ్యా యాజకత్వపు గుంపుకు చెందిన ఇమ్మేరు వంశస్థులను (ఎజ్రా 2:36, 37; నెహె. 7:39-42) సూచిస్తుండవచ్చు. రెండవది, [బెత్‌ ఇమ్రీ] అనేది మిర్యాము లేదా ఆమె కుటుంబ సభ్యులందరూ జన్మించిన ఊరు పేరు అయ్యుండాలి” అని ఇజ్రాయేల్‌ యాంటిక్విటీస్‌ అథారిటీ (IAA) వాళ్లు చెప్పారు. ఏ విధంగా చూసినా, ఒకప్పుడు నిజంగా జీవించిన వ్యక్తుల గురించి బైబిలు మాట్లాడుతోందని ఆ శవపేటిక రుజువు చేస్తోంది.

a కయప శవపేటిక గురించి కావలికోట జనవరి 15, 2006 సంచికలోని 10-13 పేజీల్లో ఉన్న “యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడు” అనే ఆర్టికల్‌ను చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి