కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 4/1 పేజీ 3
  • జవాబుల కోసం అన్వేషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జవాబుల కోసం అన్వేషణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • తల్లిదండ్రులకు సహాయం
    తేజరిల్లు!—2019
  • మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?
    మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా?
  • మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2025
  • కుటుంబాలకు సహాయం
    తేజరిల్లు!—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 4/1 పేజీ 3

జవాబుల కోసం అన్వేషణ

“జీవితాన్ని ‘ఎలా’ నెట్టుకురావాలనేది మనకిప్పుడు పెద్ద సమస్యేమీ కాదు, ఒకప్పుడు ఊహకందని విలాసవంతమైన ఏసీ సౌకర్యం, స్టీరియోల వంటివి మనకున్నాయి, . . . అయితే మనం ‘ఎందుకు’ జీవిస్తున్నాం అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకడం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితం ఎందుకు? జీవిత సంకల్పమేమిటి?”​—డేవిడ్‌ జి. మాయర్స్‌, అమెరికాలోని, మిచిగాన్‌లో ఉన్న హాలెండ్‌లోని హోప్‌ కళాశాలలో మనోవిజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్‌.

ప్రొఫెసర్‌ లేవదీసిన ఆ ప్రశ్నలకు మీరైతే ఎలా జవాబిస్తారు? వాటి జవాబుల కోసం సమయం వెచ్చించడం అంత ప్రాముఖ్యమా అని కొందరు అనుకోవచ్చు. అయితే, అలాంటి ప్రశ్నలను పట్టించుకోకుండా వదిలివేయడమంటే, మీ చెప్పులో రాయిని పట్టించుకోనట్లుగా ఉంటుంది, మీరు నడుస్తారు కానీ ఇబ్బందిగా నడుస్తారు.

జీవితానికి అసలు ఒక సంకల్పమంటూ ఉందా అని మీరెప్పుడైనా ఆలోచించారా? అలాగైతే అలా ఆలోచించేది మీరొక్కరే కాదు. మానవ విలువలపై అత్యంత విస్తృతంగా చేయబడిన అధ్యయనమైన వరల్డ్‌ వాల్యూస్‌ సర్వే, అనేక దేశాల్లో “జీవిత పరమార్థం, సంకల్పం” గురించి ఆలోచించే ప్రజలు అంతకంతకు ఎక్కువవుతున్నారు అని చెబుతోంది.

మీకు నిజమైన మనశ్శాంతి కావాలంటే, మీరు ప్రాముఖ్యమైన ఈ మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి.

మనమెలా ఉనికిలోకి వచ్చాము?

జీవిత సంకల్పమేమిటి?

మన భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ప్రాముఖ్యమైన ఈ ప్రశ్నలకు సరైన జవాబులు మీకెక్కడ దొరుకుతాయి? తర్వాతి పేజీల్లో మీకు, ఊహించో, తత్వజ్ఞానం ఆధారంగానో రాసినవికాక, దేవుని వాక్యమైన బైబిలు ఆధారంగా ఇవ్వబడిన జవాబులు లభిస్తాయి. మీ దగ్గర ఒకవేళ బైబిలుంటే దాన్ని తెరిచి అదేమి చెబుతుందో స్వయంగా మీరే పరిశీలించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. (w08 2/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి