కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w01 6/1 పేజీలు 3-4
  • దిగజారిన నైతిక ప్రమాణాలు, నమ్మకద్రోహం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దిగజారిన నైతిక ప్రమాణాలు, నమ్మకద్రోహం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబ ప్రమాణాలు, నైతిక ప్రమాణాలు
  • యెహోవా ఉన్నత ప్రమాణాలకు తగ్గట్లు ఆయనను సేవించండి
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • ఎవరి ప్రమాణాలను మీరు నమ్మగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • మంచి చెడుల విషయంలో యెహోవా ప్రమాణాలను ఉన్నతపర్చండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఏది తప్పు? ఏది ఒప్పు? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
w01 6/1 పేజీలు 3-4

దిగజారిన నైతిక ప్రమాణాలు, నమ్మకద్రోహం

హెన్రీ I ఇంగ్లాడుకు రాజుగా ఉన్న రోజుల్లో (1100-1135), “రాజు ముక్కు చివరినుండి ముందుకు చాచిన ఆయన చేతి బొటనవేలి చివరివరకు” ఉన్న నిడివిని ఒక గజంగా పరిగణించేవారు. హెన్రీ రాజు పరిపాలనలోని ప్రజల దగ్గరున్న గజం కొలబద్దలు ఎంత ఖచ్చితంగా ఉండేవి? ప్రజలు వాటిని రాజు ముక్కు దగ్గర పెట్టి ముందుకు చాచిన ఆయన చేతి బొటనవేలి చివరివరకు ఉన్నాయా లేవా అని స్వయంగా పరిశీలించడమొక్కటే అవి నికరమైనవని చెప్పడానికి గల మార్గం అయ్యుండవచ్చు.

నేడు కొలతల్ని నిర్దిష్టమైన ప్రమాణాలతో చాలా ఖచ్చితంగా నిర్వచిస్తారు. అందుకే ఒక మీటరంటే, సెకనులో 29,97,92,458వ వంతు కాలవ్యవధిలో శూన్యంలో కాంతి పయనించే దూరం అని నిర్వచించడం జరిగింది. ఖచ్చితంగా చెప్పాలంటే స్థిరమైన తరంగదైర్ఘ్యం కలిగి ఉన్న ఈ కాంతి, ఒక ప్రత్యేక తరహా లేజర్‌ కిరణం ద్వారా ప్రసరింపజేయబడింది. ఈ ప్రమాణాన్ని పునరుత్పత్తి చేయడానికి తగిన పరికరాలుంటే ఎక్కడున్న ప్రజలైనా తాము కొలిచే పొడవు కొలతా మిగతా వాళ్ళు కొలిచే పొడవు కొలతా ఒకటేనని పోల్చిచూసుకోవచ్చు.

కొలత ప్రమాణాల్లో ఎంత స్వల్పమైన మార్పు జరిగినా అది సందేహానికి దారి తీస్తుంది, ప్రమాణాలను రక్షించడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఉదాహరణకు బ్రిటన్‌లో, ప్లాటినమ్‌ ఇరీడియమ్‌ లోహాలతో చేసిన కిలో బరువుగల ఒక కడ్డీ బరువునుతూచే కొలప్రమాణం. ఈ కడ్డీని నేషనల్‌ ఫిజికల్‌ లాబొరెటరీలో పెట్టారు. ట్రాఫిక్‌ మూలంగా వచ్చేపోయే విమానాల మూలంగా కలిగే కాలుష్యం ఆ కిలో ప్రమాణాన్ని రోజురోజుకూ పెరిగేలా చేస్తుంది. అయితే, ఈ లోహపు కడ్డీ లేదా స్తూపాకారపు గొట్టం, ఫ్రాన్స్‌లోనున్న సెవ్రాలోని బరువుల కొలతల అంతర్జాతీయ కార్యనిర్వాహకశాఖలోని నేలమాళిగలో గంట ఆకారంలోనున్న మూడు జాడీల క్రింద పెట్టిన దానికి నకలు మాత్రమే. కానీ ఫ్రాన్స్‌లోని కొల ప్రమాణం బరువులో కూడా కంటికి కనిపించని కాలుష్యంవల్ల తేడావస్తుంది. అయినా ఇప్పటి వరకూ ప్రపంచంలోని మెట్రోలాజిస్టులు అంతకంటే పటిష్ఠమైన ప్రమాణాన్ని కనిపెట్టలేదు.

మామూలు మనిషికి క్షణకాల మార్పు ప్రాముఖ్యమేమీ కాకపోయినప్పటికీ, ఒక ప్రమాణం పూర్తిగా మారితే మాత్రం తికమక పడతాడు. బ్రిటన్‌లో ఇంపీరియల్‌ బరువు కొలతలు (పౌండ్లు, ఔన్సులు) మెట్రిక్‌ కొలతల్లోకి (కిలోగ్రాములు, గ్రాములు) మారడం విశేషమైన అపనమ్మకాన్ని కలిగించింది, అందుకు బలమైన కారణం లేకపోలేదు. అవినీతిపరులైన కొందరు దుకాణదార్లు ఈ క్రొత్త విధానం గురించి తెలియని కొనుగోలుదార్లను మోసపుచ్చారు.

కుటుంబ ప్రమాణాలు, నైతిక ప్రమాణాలు

కుటుంబ ప్రమాణాల్లోని మార్పులు నైతిక ప్రమాణాల్లోని మార్పుల మాటేమిటి? అటువంటి మార్పుల ప్రభావం చాలా ఎక్కువ హానికరంగా ఉంటుంది. పతనమైన కుటుంబాల గురించిన, విచక్షణా రహితమైన లైంగిక ప్రవర్తన గురించిన, పిల్లలపై విపరీతంగా పెరిగిన అత్యాచారాల గురించిన ప్రస్తుత రిపోర్టులు అనేకమందిని వ్యాకులపరచడమేకాక, మనం ప్రమాణాలు దిగజారిపోతున్న యుగంలో జీవిస్తున్నామని రూఢిపర్చాయి. తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాలూ, కొందరు పిల్లలు స్వలింగసంపర్కులైన “తల్లిదండ్రుల” దగ్గర పెరగడమూ, ప్రభుత్వ సంరక్షణలోనున్న పిల్లలపై ఘోరమైన లైంగిక అత్యాచారాలూ ఇవన్నీ ప్రజలు సాధారణమైన ప్రమాణాలను తిరస్కరించడం మూలంగా వచ్చిన ఫలితాలే. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం బైబిలు ప్రవచించినట్లు “స్వార్థప్రియులు, . . . అనురాగరహితులు, . . . సజ్జనద్వేషులు, . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” అత్యధికంగా పెరిగిపోతున్నారు.​—2 తిమోతి 3:1-4.

నైతిక ప్రమాణాలు దిగజారిపోవడం కనికరంలేని నమ్మకద్రోహంతో సంఘటితమై ఉంది. ఇటీవల, ఇంగ్లాండుకు ఉత్తర ప్రాంతంలో ఉన్న హైది పట్టణంలో వైద్యవృత్తిలో ఉన్నతమైన ప్రమాణాలు నీచంగా దిగజారడం వెలుగులోకి వచ్చింది. అక్కడి నివాసులు వారి ఫ్యామిలి డాక్టర్లను “గౌరవనీయులు నమ్మకస్థులు” అని చాలా గాఢంగా నమ్మేవారు. కాని విషాదకరంగా వారి నమ్మకం వంచించబడింది. ఎలా? వైద్యవృత్తిలో ఉన్న ఒక వ్యక్తి కనీసం 15 మంది ఆడ రోగులు మరణించడానికి కారకుడయ్యాడని పరిశోధనా ఫలితాలు వెల్లడి చేశాయి. నిజానికి, ఆ డాక్టరు ప్రమేయమున్న మరో 130 మరణాలను పోలీసులు మళ్ళీ పరిశోధించాల్సి వచ్చింది. ఆ డాక్టరు జైల్లో వేయబడినప్పుడు, ఎంత తీవ్రమైన నమ్మకద్రోహం జరిగిందో స్పష్టమైంది. అక్కడ పని చేస్తున్న ఇద్దరు జైలు ఆఫీసర్ల తల్లికూడా ఈ డాక్టరు మూలంగానే చనిపోయి ఉండవచ్చు, అందుకే వాళ్ళు అతినీచుడైన ఈ ఖైదీకి కాపలాగా ఉండకుండా వాళ్ళకు వేరే పనులు ఇవ్వబడ్డాయి. డైలీ టెలిగ్రాఫ్‌ అనే దినపత్రిక ఆ కేసు గురించిన నివేదికలో దోషియైన డాక్టర్‌ను “‘రాకాసి’ డాక్టర్‌” అని వర్ణించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

జీవితంలోని అనేక రంగాల్లో మారిపోగల, దిగజారిపోతున్న ప్రమాణాలను బట్టి చూస్తే మీరు ధైర్యంగా ఎవరిమీద నమ్మకముంచగలరు? మార్పులు జరగకుండా వాటిని కాపాడగలిగే శక్తిగల ప్రభుత్వ మద్దతున్న స్థిరమైన ప్రమాణాలను మీరు ఎక్కడ కనుగొనగలరు? ఈ ప్రశ్నలకు సమాధానం దీని తర్వాతి ఆర్టికల్‌ అందజేస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి