కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w01 5/15 పేజీ 27
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధించడాన్ని విలువైనదిగా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
w01 5/15 పేజీ 27

పాఠకుల ప్రశ్నలు

దానియేలు 9:24 లో ప్రవచించబడినట్లు “అతి పరిశుద్ధ స్థలము” ఎప్పుడు అభిషేకించబడింది?

దానియేలు 9:24-27 లో “అభిషిక్తుడగు అధిపతి”యైన క్రీస్తు కనబడేదాని గురించిన ప్రవచనముంది. కాబట్టి, “అతి పరిశుద్ధ స్థలము” అభిషేకించబడడాన్ని గురించిన ప్రవచనం, యెరూషలేములోని దేవాలయపు అతి పరిశుద్ధ స్థలము యొక్క అభిషేకాన్ని సూచించడంలేదు. బదులుగా, “అతి పరిశుద్ధ స్థలము” అన్న మాట పరలోకపు అతిపరిశుద్ధ స్థలమైనటువంటి, యెహోవా గొప్ప ఆధ్యాత్మిక దేవాలయములోని దేవుని పరలోకపు పవిత్ర స్థలాన్ని సూచిస్తుంది.a​—హెబ్రీయులు 8:1-5; 9:2-10, 23.

దేవుని ఆధ్యాత్మిక దేవాలయం పనిచేయడం ఎప్పుడు ప్రారంభించింది? ముందుగా, సా.శ. 29 లో యేసు తనను బాప్తిస్మం కొరకు అర్పించుకున్నప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. యేసు తన జీవితంలోని ఆ సమయం నుంచి, కీర్తన 40:6-8 నందలి మాటలను స్పష్టంగా నెరవేర్చాడు. యేసు దేవునికిలా ప్రార్థించాడని అపొస్తలుడైన పౌలు తర్వాత సూచించాడు: “బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీయులు 10:5) యెరూషలేము ఆలయంలో జంతు బలుల అర్పణలు కొనసాగాలని దేవుడు “కోరలేదు” అన్న విషయం యేసుకు తెలుసు. వాటికి బదులుగా, బలిగా అర్పించడానికి దేవుడు యేసుకొక పరిపూర్ణ మానవ శరీరాన్ని సిద్ధం చేశాడు. తన హృదయపూర్వక కోరికను చూపిస్తూ, యేసు ప్రార్థించడాన్ని ఇలా కొనసాగించాడు: “గ్రంథపుచుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నీ చిత్తము నెరవేర్చుటకు దేవా, ఇదిగో నేను వచ్చియున్నా[ను].” (హెబ్రీయులు 10:7) అందుకు యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? మత్తయి సువార్త దాన్నిలా తెలియజేస్తోంది: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు​—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.”​—మత్తయి 3:16, 17.

యేసు తన శరీరాన్ని బలిగా అర్పించడాన్ని యెహోవా దేవుడు అంగీకరించడమంటే, యెరూషలేము ఆలయంలోని బలిపీఠం కంటే గొప్ప బలిపీఠమొకటి ఉనికిలోకి వచ్చిందని అర్థం. అది, దేవుని “చిత్తము” అనే బలిపీఠము లేక యేసు మానవ జీవాన్ని బలిగా అంగీకరించడానికి దేవుడు చేసిన ఏర్పాటు. (హెబ్రీయులు 10:10) యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించడమంటే, దేవుడు తన మొత్తం ఆధ్యాత్మిక దేవాలయ ఏర్పాటును అప్పుడు ఉనికిలోకి తీసుకువచ్చాడని అర్థం.b ఆ విధంగా, యేసు బాప్తిస్మం సమయంలో, దేవుని పరలోకపు నివాస స్థలం అభిషేకించబడింది, లేక గొప్ప ఆధ్యాత్మిక ఆలయ ఏర్పాటులో “అతి పరిశుద్ధ స్థలము”గా ప్రత్యేకించబడింది.

[అధస్సూచీలు]

a దేవుని ఆధ్యాత్మిక దేవాలయపు వివిధ అంశాల చర్చ కొరకు, కావలికోట జూలై 1, 1996 లోని 14-19 పేజీలను చూడండి.

b దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) పుస్తకంలోని 195వ పేజీలో ఇది పరోక్షంగా సూచించబడింది.

[27వ పేజీలోని చిత్రం]

యేసు బాప్తిస్మం పొందినప్పుడు, “అతి పరిశుద్ధ స్థలము” అభిషేకించబడింది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి